జిమ్‌లో అదిరిపోయిన స్టంట్.. అయేషా ఖాన్ పవర్‌కు నెటిజన్లు ఫిదా!
ఈ వర్కవుట్ స్టంట్ చూసి ఫ్యాన్స్, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయేషా పవర్, ఫిట్‌నెస్‌ను మెచ్చుకుంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
By: Madhu Reddy | 30 July 2026 12:21 PM ISTనటి అయేషా ఖాన్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక జిమ్ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. అందులో ఆమె తన థైస్ పై జిమ్ ట్రెయినర్‌ను నిలబెట్టి బాలెన్స్ చేస్తూ ఊహించని లోయర్ బాడీ స్ట్రెంత్‌ను చూపించింది. ఈ వర్కవుట్ స్టంట్ చూసి ఫ్యాన్స్, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయేషా పవర్, ఫిట్‌నెస్‌ను మెచ్చుకుంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
వైరల్ అవుతున్న అయేషా ఖాన్ జిమ్ వీడియో:
ఇక అయేషా ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేసింది. ఇక సాధారణంగా జిమ్‌లో మనం రకరకాల వర్కవుట్స్ చూస్తుంటాం, కానీ అయేషా చేసిన ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. ఆమె తన కాళ్ల బలాన్ని ప్రదర్శిస్తూ చేసిన ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.
"బరువు ఎంతో ఊహించండి?":
ఈ వీడియోకు అయేషా "గెస్ ది వెయిట్!?" అని క్యాప్షన్ ఇచ్చింది. అంటే తన ట్రెయినర్ బరువు ఎంతో చెప్పమంటూ ఫ్యాన్స్‌కు ఒక సరదా ఛాలెంజ్ విసిరింది. ఇక దీంతో నెటిజన్లు రకరకాల నంబర్లను కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు.
ర్యాంప్ తరహా బాలెన్సింగ్ స్టంట్:
ఈ వర్కవుట్ ఎలా చేశారంటే.. అయేషా ఒక గోడకు ఆనుకుని కూర్చుని, తన తొడలపై ఒక బాలెన్స్ బోర్డును ఉంచింది. ఆ తర్వాత ఆమె ట్రెయినర్ నెమ్మదిగా వచ్చి ఆ బోర్డుపై నిలబడ్డాడు. అతని బరువంతా అయేషా కాళ్లపైనే ఉన్నప్పటికీ, ఆమె ఏమాత్రం తడబడకుండా ఎంతో సులువుగా బాలెన్స్ చేసింది.
నవ్వుతూనే సమాధానం ఇచ్చేసింది:
అంత బరువును మోస్తున్నా అయేషా ముఖంలో ఎలాంటి కష్టం కనిపించలేదు. చాలా ప్రశాంతంగా, నవ్వుతూ కెమెరా వైపు చూస్తూ ఉండిపోయింది. ఇక చూడటానికి చాలా తేలికగా అనిపించినా, ఇది చేయడం చాలా కష్టమని, ఆమె లోయర్ బాడీ స్ట్రెంత్ సాధారణమైనది కాదని ఫిట్‌నెస్ ప్రేమికులు చెబుతున్నారు.
నెటిజన్ల రియాక్షన్లు, కామెంట్ల గలాటా:
ఈ వీడియో చూసిన అభిమానులు "ఓ మై గాడ్.. నువ్వు చాలా స్ట్రాంగ్, బహుశా ట్రెయినర్ బరువు 80 కేజీలు ఉంటుందా?" అని అడుగుతున్నారు. "మా అమ్మాయిలేమీ అబ్బాయిల కంటే తక్కువ కాదు" అని కొందరు, "నాకు కూడా ఇంత బలం కావాలి" అని మరికొందరు ప్రశంసిస్తున్నారు.
అయేషా ఖాన్ చేసిన ఈ స్టంట్ ఆమెకు ఫిట్‌నెస్‌పై ఉన్న శ్రద్ధను, కష్టపడే తత్వాన్ని తెలియజేస్తోంది. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, హెల్తీ అండ్ స్ట్రాంగ్ బాడీ సాధించడం ఎంత ముఖ్యమో ఈ వీడియో ద్వారా నిరూపించింది. ప్రస్తుతం ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
