Begin typing your search above and press return to search.

నా అన్వేషణ.. సీన్ లోకి మరో టాప్ యూట్యూబర్

యూట్యూబర్ అన్వేష్ వివాదం హాట్ టాపిక్ గా కొనసాగుతూనే ఉన్న విషయం తెలిసిందే. హిందూ దేవతలపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

By:  M Prashanth   |   3 Jan 2026 10:07 AM IST
నా అన్వేషణ.. సీన్ లోకి మరో టాప్ యూట్యూబర్
X

యూట్యూబర్ అన్వేష్ వివాదం హాట్ టాపిక్ గా కొనసాగుతూనే ఉన్న విషయం తెలిసిందే. హిందూ దేవతలపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అతడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కేసులు నమోదయ్యాయి. ఆ ప్రభావం అన్వేష్ యూట్యూబ్ ఛానెల్‌ పై కూడా పడింది. కొన్ని రోజులుగా రోజురోజుకూ సబ్‌ స్క్రైబర్స్ సంఖ్య భారీగా పడిపోతోంది.

ఇప్పుడు అన్వేష్ వివాదంలోకి మరో టాప్ యూట్యూబర్ ఏయ్ జూడ్ అజయ్ ఎంట్రీ ఇచ్చారు. 41 లక్షల మంది సబ్‌ స్క్రైబర్స్ ఉన్న అజయ్.. రీసెంట్ గా అన్వేష్ ను ఉద్దేశించి వీడియో పోస్ట్ చేశారు. హిందూ దేవతలను ఏమైనా అంటే వదిలే ప్రసక్తి లేదని ఖబడ్దార్ అని వార్నింగ్ ఇచ్చారు. దీంతో అన్వేష్.. వీడియో డిలీట్ చేయకపోతే అజయ్ తోపాటు అతని తమ్ముడి సంగతి తేలుస్తానంటూ బెదిరించాడు.

అయితే ఇప్పటికే అజయ్ తమ్ముడు హనుమంతుపై పలు ఆరోపణలు ఉన్నాయి. వాటిని అన్వేష్ ప్రస్తావించాడు. ఆ వెంటనే అజయ్ డిలీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. భయపడి వీడియో డిలీట్ చేశాడా అని అంతా మాట్లాడుకున్నారు. ఇప్పుడు రీసెంట్ గా రీ అప్లోడ్ చేసి అన్వేష్ కు కౌంటర్ ఇచ్చారు. యుద్ధానికి సై అంటే వద్దనడానికి నేనెవరిని అంటూ స్టార్ట్ చేశారు అజయ్.

"నా రాముడు, సీతమ్మ తల్లి, ఆంజనేయుడు, శ్రీవారి గురించి, శివుని గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఖబడ్డార్. దేశంలో మార్పులు , రాజ్యాంగంలో ఛేంజెస్ అవుతాయి.. ఒక మాట మాట్లాడితే మీ బాడీ షేక్ అయ్యి మీ భూమి తలకిందులయ్యే రోజులు వస్తాయి. నిన్నటి వీడియో డౌన్ చేశా.. కుటుంబం గురించి భయపడ్డా.. ఆలోచించా.. మన అందరిలో అది ఉంటుంది" అని తెలిపారు.

"మన తప్పు లేనప్పుడు స్ట్రాంగ్ గా నిలబడి పోరాడితే నామ రూపాలు లేకుండా వ్యక్తి చెరిగిపోతాడు. ఆ ప్రాసెస్ లో ఉన్నావ్ కాబట్టి నీవు జాగ్రత్త.. అన్వేష్. సినిమాల కోసం మాట్లాడుదాం. స్టాలిన్ మూవీలో అక్క కోసం చిరంజీవి గారు లొంగడానికి సిద్ధమవుతారు. ప్రకాష్ రాజు ఇంటికి వెళ్లి లోపల చంపుకుని సారీ చెప్పడానికి ఫిక్స్ అయ్యారని మనం అనుకుంటాం.. కానీ కళ్లు పెద్దగా చేసి డైలాగ్ చెబుతారు"

"నా ఫ్యామిలీ జోలికి రాకు.. అమ్మకు అబ్బకు పుట్టంటే నేను ముందు తర్వాత నా ఫ్యామిలీ అంటారు. ఆ తర్వాత పుష్పలో బన్నీ, షెకావత్ మధ్య సీన్ కూడా అంతే. ఏదేమైనా అన్వేష్.. మనం మాట్లాడుకుందాం.. నా వీడియో తీసి మళ్లీ పెడతానని అంతా ఫిక్స్ అయ్యారు. నా గురించి ఏం తెలుసు నీకు? బెట్టింగ్ యాప్ కోసం ప్రమోట్ చేశానా?" అని అజయ్ ప్రశ్నించారు.

"తప్పు చేస్తే చూపించు. ప్రూఫ్స్ పెట్టి మాట్లాడు. గాల్లో బొంగరాలు తిప్పకు.. మా నాన్న గారు రిటైర్డ్ ఐఏఎస్. 32 ఏళ్ల కెరీర్ లో ఎలాంటి మచ్చ లేని ఆఫీసర్.. నా మొండి పట్టుదల కోసం ఇంకా నీకు తెలియదేమో" అని అన్నారు. ప్రస్తుతం అజయ్ వీడియో వైరల్ గా మారగా.. అనేక మంది మద్దతు పలుకుతున్నారు. ఇది కదా రిప్లై అంటే, సపోర్ట్ బటన్ అజయ్ అంటూ పోస్టులు పెడుతున్నారు.