Begin typing your search above and press return to search.

శివకార్తికేయన్ తో చిత్రాలు.. నిర్మాతకు అన్ని కష్టాలా?

కేజేఆర్ స్టూడియోస్‌ బ్యానర్‌ పై వరుసగా భారీ చిత్రాలను నిర్మించిన రాజేష్.. 2018లో హీరో, అదే సమయంలో అయలాన్ చిత్రాలు ప్రారంభించినట్లు తెలిపారు.

By:  M Prashanth   |   2 Jun 2026 5:00 PM IST
శివకార్తికేయన్ తో చిత్రాలు.. నిర్మాతకు అన్ని కష్టాలా?
X

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు పొందిన కోటపాడి జె. రాజేష్ (కేజేఆర్ రాజేష్) రీసెంట్ గా తన ఆర్థిక పరిస్థితుల గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. హీరో, డాక్టర్, అయలాన్ వంటి చిత్రాలను నిర్మించిన ఆయన.. శివకార్తికేయన్‌ తో చేసిన ప్రాజెక్టుల కారణంగా యాదృచ్ఛికంగా ఎదుర్కొన్న ఆర్థిక ఒత్తిడిని షేర్ చేసుకున్నారు.

కేజేఆర్ స్టూడియోస్‌ బ్యానర్‌ పై వరుసగా భారీ చిత్రాలను నిర్మించిన రాజేష్.. 2018లో హీరో, అదే సమయంలో అయలాన్ చిత్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఆ సమయంలో మూడు సినిమాలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లు, లోన్లు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఉండేదని చెప్పారు. 2019 నాటికే పైనాన్షియల్ ట్రాన్సక్షన్స్ కంప్లీట్ అవుతాయని భావించినప్పటికీ, పరిస్థితులు అనుకున్నట్లు సాగలేదని పేర్కొన్నారు.

శివకార్తికేయన్‌ తో మూడు సినిమాల ఒప్పందం చేసుకున్న సమయంలో ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన లోన్లు తానే భరిస్తానని హామీ ఇచ్చినట్లు రాజేష్ వెల్లడించారు. 2019లో విడుదలైన హీరో సినిమా తర్వాత దాదాపు రూ.30 కోట్ల మేర ఫైనాన్సియల్ ప్రెజర్ ఏర్పడిందని తెలిపారు. అయితే అదే సమయంలో కరోనా మహమ్మారి రావడంతో ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది.

కరోనా కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడం, విడుదల వాయిదా పడటం, ఫైనాన్సియల్ సోర్సెస్ తగ్గిపోవడం వంటి పరిణామాలు నిర్మాతలపై ప్రభావం చూపించాయి. ముఖ్యంగా అయలాన్ వంటి భారీ విజువల్ ఎఫెక్ట్స్‌ బేస్డ్ సినిమా పూర్తవడానికి ఎక్కువ సమయం పట్టడంతో ఖర్చు మరింత పెరిగిందని రాజేష్ వివరించారు. డాక్టర్, అయలాన్ చిత్రాల ప్రొడక్షన్ టైమ్ లో మూడేళ్ల పాటు వడ్డీ భారం గణనీయంగా పెరిగిందని చెప్పారు.

ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సమయంలో తనపై ఉన్న అప్పులు సుమారు రూ.90 కోట్లు కాగా, ప్రస్తుతం అవి దాదాపు రూ.120 కోట్లకు చేరుకున్నాయని ఆయన వెల్లడించారు. పెరిగిన అప్పులు తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ పై ఎఫెక్ట్ చూపాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ ప్రాజెక్టుల వల్ల శివకార్తికేయన్‌ కు కూడా సుమారు రూ.55 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు రాజేష్ చెప్పారు.

అయితే అన్ని ఇబ్బందుల మధ్య కూడా శివకార్తికేయన్‌ తో తన రిలేషన్ కొనసాగుతోందని రాజేష్ క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య ఇంకా రెండు సినిమాల కమిట్మెంట్‌ మిగిలి ఉందని, ఆ చిత్రాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో దేవుడికే తెలుసని వ్యాఖ్యానించారు. నిర్మాతగా అరమ్, హీరో, డాక్టర్, అయలాన్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన కేజేఆర్ రాజేష్ జర్నీ విజయాలతో పాటు ఆర్థిక సవాళ్లతో నిండిపోయిందని ఆయన కామెంట్స్ ద్వారా క్లియర్ గా తెలుస్తోంది. భారీ చిత్రాల నిర్మాణంలో ఉండే రిస్క్, పాండమిక్ సిట్యువేషన్స్, పెరిగిన వడ్డీ భారం వంటి ఎలిమెంట్స్ నిర్మాతలపై ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయో రాజేష్ అనుభవం చెప్పకనే చెబుతోంది.