ఒక్క లైక్.. ఆమె జీవితాన్ని మార్చేసింది
కొంత మంది జీవితంలో అదృష్టం అనుకోని అతిథిగా వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది తారలు బ్రేక్ కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఆ బ్రేక్ అతి కొద్ది మందికి మాత్రమే వస్తుంది.
By: Ramesh Palla | 26 Aug 2025 6:00 PM ISTకొంత మంది జీవితంలో అదృష్టం అనుకోని అతిథిగా వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది తారలు బ్రేక్ కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఆ బ్రేక్ అతి కొద్ది మందికి మాత్రమే వస్తుంది. కొందరు చాలా కాలం కష్టపడితే బ్రేక్ లభిస్తుంది, కొందరికి ఒక్క హిట్‌తో లభిస్తుంది. అతి కొద్ది మంది సోషల్ మీడియాలో వచ్చే పాపులారిటీ కారణంగా బ్రేక్ దక్కించుకుంటారు. అయితే అందరిలోకి అవనీత్ కౌర్ కి దక్కిన బ్రేక్ చాలా అరుదు అని చెప్పాలి. అందరిలాగే అవనీత్ కౌర్ సైతం ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు చాలా కష్టపడుతుంది. తాను చేసిన సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ, సినిమా ఆఫర్ల కోసం వెతుక్కునే స్థాయి నుంచి ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయింది. ఇప్పుడు ఆమె కోసం చాలా మంది నిర్మాతలు క్యూ కడుతున్నారు, ఫిల్మ్ మేకర్స్ క్యూ లో నిల్చుని మరీ సినిమా ఆఫర్లు ఇస్తున్నారట.
కోహ్లీ లైక్‌తో పాపులర్
ఇంతకు ముందు ఆమె చేసిన సినిమాలను ఆమె తెగ ప్రమోట్ చేసుకునేది, కానీ ఇప్పుడు ఆమె పదుల కొద్ది బ్రాండ్స్ కి లక్షల రూపాయలు డబ్బు తీసుకుని మరీ ప్రమోట్ చేస్తుంది. ఆమె జీవితాన్ని మార్చేసింది ఏంటో ఇప్పటికే అందరికీ తెలిసిందే. విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో పొరపాటున అవనీత్ కౌర్ ఫోటోకు లైక్ కొట్టాడు. ఆ లైక్ పొరపాటున కొట్టినదని అప్పటికీ చెప్పాడు. అయినా కూడా ఆమెకు దక్కాల్సిన ప్రయోజనం దక్కింది. పొందాల్సిన లాభం పొందింది. తక్కువ సమయంలోనే అవనీత్ కౌర్ ఏకంగా రెండు మిలియన్‌ల లైక్స్ ను దక్కించుకోవడం మాత్రమే కాకుండా సినిమాల్లో బిజీ అయింది, యాడ్స్ తో ఫుల్ బిజీగా మారింది. దేశంలోనే పాపులర్ సోషల్ మీడియా సెలబ్రిటీల జాబితాలో చేరి పోయింది.
అవనీత్ కౌర్ సోషల్ మీడియా సెన్షేషన్
ఇన్‌స్టాగ్రామ్‌లో అవనీత్ కౌత్ ఫోటోకి పొరపాటను విరాట్ కోహ్లీ లైక్ కొట్టడంతో మొత్తం మారి పోయింది. ఆ ఒక్క లైక్ అవనీత్ కౌర్ జీవితాన్ని మార్చేసింది. కెరీర్ టర్న్ తీసుకునేలా చేస్తే, ఆమె కి మరో జన్మ అన్నట్లుగా చేసింది. ఒక్క లైక్‌కి ఇంత పవర్ ఉంటుందా అని చాలా మందికి ఆశ్చర్యం కలిగేలా అవనీత్ కౌర్ ఈ కొన్ని నెలల్లో అమాంతం ఎక్కడికో వెళ్లి పోయింది. ఓ రేంజ్ లో ఆమె స్థాయి పై పై పెరిగి పోయింది. ఆమె సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లు చేసేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కి సమాంతరంగా సోషల్ మీడియా ద్వారా బ్రాండ్ ప్రమోషన్ చేస్తుందట. అంతే కాకుండా ఆమెకు పలు కంపెనీల నుంచి ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది.
లవ్ ఇన్ వియత్నం సినిమాతో రెడీ
జీ టీవీలో ప్రసారమైన డాన్స్ ఇండియా డాన్స్ లిల్ మాస్టర్స్ డాన్స్ షో తో కెరీర్‌ను ప్రారంభించింది. సెమీ ఫైనల్స్ కి ముందే ఎలిమినేట్ అయినా కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. 2012లో లైఫ్ ఓకేస్ మేరి మాతో ఎంట్రీ ఇచ్చింది. అంతే కాకుండా రియాల్టీ షో ఝలక్ దిఖ్లా జా లోనూ పాల్గొనడం ద్వారా మరింత మంది బుల్లి తెర ప్రేక్షకులకు చేరువ అయింది. చిన్న వయసులోనే పెద్ద వారితో పోటీకి నిలవడం ద్వారా ఆ సమయంలో చాలా చర్చనీయాంశం అయింది. ఏక్ ప్రేమ్ కహానీ లో రాజకుమారి దమయంతి పాత్రలోనూ అలరించింది. ప్రస్తుతం ఈమె నటించిన లవ్ ఇన్ వియత్నం సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఆ సినిమా ప్రమోషన్‌లో అవనీత్ కౌర్ మాట్లాడుతూ తన ఫోటోకు కోహ్లీ లైక్ కొట్టడం, ఆ తర్వాత తన కెరీర్ మారిపోవడంపై స్పందిస్తూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేసింది.
