Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: విర‌హంలో న‌వ‌నీతం.. అదొక్క‌టే త‌ప‌న‌!

సోషల్ మీడియా సంచలనం, ప్రముఖ నటి అవ్‌నీత్ కౌర్ మరోసారి తన అద్భుతమైన ఫ్యాషన్ లుక్‌తో అభిమానులను కట్టిపడేశారు.

By:  Sivaji Kontham   |   30 Sept 2026 11:05 PM IST
ఫోటో స్టోరి: విర‌హంలో న‌వ‌నీతం.. అదొక్క‌టే త‌ప‌న‌!
X

సోషల్ మీడియా సంచలనం, ప్రముఖ నటి అవ్‌నీత్ కౌర్ మరోసారి తన అద్భుతమైన ఫ్యాషన్ లుక్‌తో అభిమానులను కట్టిపడేశారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఈ బ్యూటీ తన స్టైలిష్‌ అప్పియరెన్స్‌తో గ్లోబల్ లెవెల్‌లో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్‌ను పరిచయం చేస్తూ యువతను ఆకట్టుకునే అవ్‌నీత్ తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.





`రెడ్ కార్పెట్ రెడీ` అనే క్యాప్షన్‌తో న‌వ్‌నీత్ పోస్ట్ చేసిన ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ రోహిత్ యూకే కెమెరాలో బంధించిన ఈ ఫొటోల్లో యంగ్ బ్యూటీ ఎంతో గ్లామరస్‌గా కనిపిస్తున్నారు. అద్భుతమైన డిజైన్ కలిగిన ఎర్రటి గౌన్‌లో రాజసంలా మెరుస్తూ.. అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకున్నారు.





ఈ పోస్ట్ చూసిన అభిమానులు, ఫాలోవర్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆమెను `లాల్ పారీ`, `రెడ్ వెల్వెట్ గర్ల్` అంటూ ఎంతో ప్రేమగా కొనియాడుతున్నారు. ``ఈ స్థాయి అందం చూడటానికి రెండు కళ్లూ చాలవు`` అంటూ, కొందరైతే ``ఈ హాట్‌నెస్ చూస్తుంటే ఒక వార్నింగ్ ఇవ్వాల్సిందేమో`` అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.





కేవలం ధరించిన దుస్తులే కాకుండా... విదేశీ గడ్డపై న‌వ్‌నీత్ ఆత్మవిశ్వాసం, రాజసమైన నడక అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అభిమాన పేజీలు ఈ లుక్‌ను ఒక ఫ్యాషన్ ఎడిటోరియల్‌తో పోల్చాయి. లండన్ వీధుల్లో ఆమె ఇస్తున్న ఈ అదిరిపోయే `సర్వ్`కు అభిమానులు ఫిదా అవుతున్నారు.





ఓవ‌రాల్ గా అవ్‌నీత్ కౌర్ తన లేటెస్ట్ రెడ్ కార్పెట్ లుక్‌తో మరోసారి ఫ్యాషన్ ఐకాన్‌గా నిరూపించుకున్నారు. గ్లోబల్ స్థాయిలో తనదైన ముద్ర వేస్తూ.. ప్రతి పోస్ట్‌తోనూ యువతలో క్రేజ్ పెంచుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ బ్యూటిఫుల్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.