Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: అగ్గి రాజేస్తున్న అవ్‌నీత్ కౌర్

సోషల్ మీడియా సెన్సేషన్ అవ్‌నీత్ కౌర్ తన లేటెస్ట్ ఫోటో షూట్‌తో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తోంది. తాజాగా ఈ యంగ్ బ్యూటీ పోస్ట్ చేసిన ఫోటోలు కుర్రాళ్ల గుండెల్లో విరహాగ్ని రాజేస్తున్నాయి.

By:  Sivaji Kontham   |   17 March 2026 10:42 PM IST
ఫోటో స్టోరి: అగ్గి రాజేస్తున్న అవ్‌నీత్ కౌర్
X

సోషల్ మీడియా సెన్సేషన్ అవ్‌నీత్ కౌర్ తన లేటెస్ట్ ఫోటో షూట్‌తో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తోంది. తాజాగా ఈ యంగ్ బ్యూటీ పోస్ట్ చేసిన ఫోటోలు కుర్రాళ్ల గుండెల్లో విరహాగ్ని రాజేస్తున్నాయి. బటన్ లెస్ డెనిమ్ ప్యాంట్, బ్రాండెడ్ ఇన్నర్ వేర్ ధ‌రించి ఈ భామ ఫోజులిచ్చిన‌ తీరు నెటిజన్లను కట్టిపడేస్తోంది. ముఖ్యంగా బాటమ్ దుస్తుల స్టైలింగ్‌లో అవ్‌నీత్ బో*నెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.




అవ్‌నీత్ ఫ్యాషన్ సెన్స్ ఎప్పుడూ వినూత్నంగా ఉంటుంది కానీ ఈసారి తన స్టైలింగ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లిందంటూ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ దుస్తుల్లో అవ్ నీత్ సొగసులు నెట్టింట మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. కేవలం గ్లామర్ మాత్రమే కాకుండా.. కెమెరా ముందు పలికించిన హావభావాలు ఈ ఫోటో షూట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.




అవ్‌నీత్ కౌర్ సినీ ప్రస్థానం ఒక డాన్సర్‌గా మొదలైంది. `డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్స్` వంటి రియాలిటీ షోల ద్వారా చిన్న వయసులోనే బుల్లితెరపై తన ముద్ర వేసింది. ఆ తర్వాత నటనపై దృష్టి సారించి `చక్రవర్తి అశోక సామ్రాట్`, `చంద్ర నందిని` వంటి పాపులర్ సీరియల్స్‌లో నటించి మెప్పించింది. ముఖ్యంగా `అల్లాదీన్ - నామ్` తో సునా హోగా' సీరియల్‌లో పోషించిన యాస్మిన్ పాత్ర దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.

వెండితెరపై కూడా అవ్‌నీత్ తన సత్తా చాటుతోంది. రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన `మర్దాని 2` చిత్రంలో కీలక పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన `టీకూ వెడ్స్ షేరు` చిత్రంలో హీరోయిన్‌గా నటించి బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాగా అవ్ నీత్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ప్రస్తుతం అవ్‌నీత్ వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. `లవ్ కీ బిల్లీ` వంటి కొత్త ప్రాజెక్టులతో పాటు పలు క్రేజీ వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ వీడియోలలో నటిస్తోంది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్‌పై తన హవా కొనసాగిస్తూనే, స్టార్ హీరోయిన్‌గా ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.