Begin typing your search above and press return to search.

అవికా గోర్ పెళ్లి.. చరిత్రలో తొలిసారి అలా చేయబోతున్న హీరోయిన్!

ప్రస్తుతం ఈ విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదే జరిగితే.. చరిత్రలో ఒక రియాల్టీ షోలో పెళ్లి చేసుకున్న తొలి నటిగా రికార్డ్ సృష్టించబోతోంది అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.

By:  Madhu Reddy   |   23 Sept 2025 10:49 AM IST
అవికా గోర్ పెళ్లి.. చరిత్రలో తొలిసారి అలా చేయబోతున్న హీరోయిన్!
X

అవికా గోర్.. చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈ చిన్నది.. ఈ సీరియల్ తో ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకుంది అనడంలో సందేహం లేదు. అలా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన అవికా గోర్.. ఇప్పుడు చరిత్రలో తొలిసారి అలాంటి పని చేయబోతోందని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి ఘటన ఎక్కడ జరగలేదు అని కూడా కామెంట్లు పెడుతూ ఉండడం గమనార్హం. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

నటనలో భాగంగా అటు సినిమాలలో ఇటు సీరియల్స్ లో నటీనటులు పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం. అలా హీరోతో మూడు ముళ్ళు వేయించుకున్న హీరోయిన్లు ఎంతో మందే ఉన్నారు. అయితే ఈ తరహాలోనే ఇప్పుడు హీరోయిన్ అవికా గోర్ కూడా అలాగే పెళ్లి చేసుకోబోతోంది. అయితే ఇది నిజం పెళ్లి కావడం గమనార్హం. ప్రముఖ వ్యాపారవేత్త మిలింద్ చాంద్వానీతో దాదాపు 5 సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన ఈమె వయసు 28 సంవత్సరాలు. ఈ ఏడాది జూన్ లో వీళ్ళిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఈనెల 30వ తేదీన మిలింద్ తో కలిసి ఏడడుగులు వేయబోతున్నాను అంటూ తాజాగా ఒక ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ పెళ్లి డేట్ ను స్వయంగా ప్రకటించింది అవికా గోర్.

అయితే ఇక్కడ ఈ పెళ్లి ప్రత్యేకత ఏమిటంటే? నిజజీవితంలో జరిగే ఈ పెళ్లిని అవికా చేస్తున్న 'పతి పత్ని ఔర్ పంగా' అనే రియాలిటీ షోలో ప్రసారం చేయబోతున్నారు అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. బుల్లితెరపై తిరుగులేని క్రేజ్ దక్కించుకున్న ఈమె.. ఆ తర్వాతే సినిమాల్లోకి వచ్చింది. తనపై ఎంతో ప్రేమ కురిపించిన టీవీ ప్రేక్షకుల సమక్షంలోనే తాను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో తాను హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాల్టీ షోలో తన ప్రియుడితో ఏడడుగులు వేయబోతున్నాను అంటూ స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఈ విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదే జరిగితే.. చరిత్రలో ఒక రియాల్టీ షోలో పెళ్లి చేసుకున్న తొలి నటిగా రికార్డ్ సృష్టించబోతోంది అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 30వ తేదీన ఈ రియాల్టీ షో లైవ్ లో ఈమె వివాహం చేసుకోబోతోంది.

అవికా గోర్ సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో 'ఉయ్యాల జంపాల' అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత సినిమా చూపిస్త మామ, రాజు గారి గది - 3, ఎక్కడికి పోతావు చిన్నవాడా ఇలా పలు చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగుతోంది. అవికా స్క్రీన్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నిర్మాణ సంస్థను కూడా స్థాపించింది ఈ ముద్దుగుమ్మ. అలా హిందీ, తెలుగు టెలివిజన్ ధారావాహికలతో పాటు చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అవికా గోర్.. పెళ్లి తర్వాత తన నటనను కొనసాగిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.