ట్రోలింగ్ జరుగుతుందని ముందే ఊహించాం
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న నటి అవికా గోర్. ఆ సీరియల్ లో ఆనంది పాత్రతో తనకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు.
By: Sravani Lakshmi Srungarapu | 15 Oct 2025 3:40 PM ISTచిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న నటి అవికా గోర్. ఆ సీరియల్ లో ఆనంది పాత్రతో తనకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. సీరియల్ తో వచ్చిన గుర్తింపుతో హీరోయిన్ గా మారిన అవికా తర్వాత కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. రీసెంట్ గా తన ప్రియుడు మిలింద్ చంద్వానీని ఓ రియాలిటీ షో లో అవికా పెళ్లాడిన సంగతి తెలిసిందే.
అవికా వెడ్డింగ్ లుక్స్ లో ట్రోల్స్
అయితే అవికా రియాలిటీ షో లో పెళ్లి చేసుకున్న విషయంతో పాటూ, ఆమె వెడ్డింగ్ లుక్ పై కూడా ఎన్నో విమర్శలు రాగా, ఆ కామెంట్స్, ట్రోలింగ్ పై కొత్త జంట రెస్పాండ్ అయ్యారు. టీవీ షో లో పెళ్లి చేసుకోవాలనేది తన చిన్నప్పటి కోరిక అని, పెళ్లి గురించి తన ఆలోచనను మిళింద్‌కు చెప్పగానే తాను ఒప్పుకున్నాడని, ఆడియన్స్ నుంచి విమర్శలు వస్తాయని తాను ముందే చెప్పాడని అవికా చెప్పుకొచ్చింది.
డబ్బుల కోసం చేశామంటారని ముందే తెలుసు
డబ్బుల కోసం అలా చేస్తున్నామని ట్రోల్స్ వస్తాయని ముందుగానే ఊహించామని, అయితే ఈ డెసిషన్ తో తామిద్దరూ సంతోషంగానే ఉన్నామని చెప్పిన అవికా, తనకు మిళింద్ అభిప్రాయమే ముఖ్యమని, ఇతరుల గురించి తాను పట్టించుకోనని చెప్పింది. వెడ్డింగ్ లుక్స్ పై వస్తున్న ట్రోల్స్ విషయంలో కూడా అవికా మాట్లాడింది. తన పెళ్లి మొత్తం సంప్రదాయపరంగా జరిగిందని, ఒకవేళ తన లుక్స్ పై కాకుండా తన భర్త లుక్ పై ట్రోల్స్ జరిగితే తాను బాధపడేదాన్నని, ఎందుకంటే అతని లుక్ ను తానే డిజైన్ చేశానని, ఆ విషయంలో ఎలాంటి ట్రోల్స్ రానందుకు ఆనందంగా ఉందని చెప్పింది చిన్నారి పెళ్లికూతురు.
అందరి పెళ్లిళ్లలో ఇవి కామన్
ఇక ఈ ట్రోల్స్ పై అవికా భర్త మిళింద్ స్పందిస్తూ ఈ రోజుల్లో ఫోటోగ్రాఫర్లు, వీడియో రికార్డు చేసే వాళ్లు లేకుండా పెళ్లిళ్లు జరగడం లేదని, అందరి పెళ్లిళ్లలోనూ ఇవి కామనేనని, అవికా మంచి ఉద్దేశంతోనే ఈ డెసిషన్ తీసుకుందని, అందుకే తాను చెప్పగానే ఈ పెళ్లికి ఒప్పుకున్నానని తెలిపారు. కాగా వీరిద్దరూ గత నెల 30వ తేదీన ఓ హిందీ రియాలిటీ షో లో పెళ్లి చేసుకోగా, రియాలిటీ షో లో పెళ్లి చేసుకోవడమేంటని ఓ వర్గం ఆడియన్స్ వారిని ట్రోల్ చేయగా, రీసెంట్ గా వాటిపై స్పందించి, ఈ కొత్త జంట క్లారిటీ ఇచ్చింది.
