Begin typing your search above and press return to search.

వర్కౌట్స్ తోనే ఆశ్చర్యపరుస్తున్న కొత్తజంట!

వారెవరో కాదు ఒకప్పుడు చిన్నారి పెళ్లికూతురు అనే సీరియల్ తో యావత్ దేశ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ నటి అవికా గోర్ , ఆమె భర్త మిలింద్ చాద్వాని.

By:  Madhu Reddy   |   3 Jan 2026 11:38 AM IST
వర్కౌట్స్ తోనే ఆశ్చర్యపరుస్తున్న కొత్తజంట!
X

సినీ సెలబ్రిటీలు అందంగా, ఫిట్ గా , ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ అప్పుడప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే సెలబ్రిటీలు ఇలా విడివిడిగా జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ.. ఆ ఫోటోలను షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఏకంగా సెలబ్రిటీ భార్యాభర్తలు జిమ్ లో.. కలసి ఎక్సర్సైజులు చేస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పటికే ప్రముఖ బాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరు సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఆమె భర్త జాకీ భగ్నానీ జంటగా ఎక్సర్సైజులు, యోగాలు చేస్తూ భారీ పాపులారిటీ అందుకున్నారు.




అయితే ఇప్పుడు ఆ జంట జాబితాలోకి మరో జంట వచ్చి చేరింది. వారెవరో కాదు ఒకప్పుడు చిన్నారి పెళ్లికూతురు అనే సీరియల్ తో యావత్ దేశ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ నటి అవికా గోర్ , ఆమె భర్త మిలింద్ చాద్వాని. తాజాగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా అవికా గోర్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తన భర్తతో కలిసి ఆమె జిమ్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అందులో మిలింద్ చాద్వాని సిక్స్ ప్యాక్ తో కనిపించగా.. జిమ్ సూట్ లో కనిపించి ఆకట్టుకుంది అవికా. ఇక ఈ జంట కలిసికట్టుగా వర్కౌట్స్ చేస్తున్నట్టు ఫోటోలు షేర్ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇదో కొత్త ట్రెండ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

బాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ మొదలైందని.. అందుకే ఇలా సెలబ్రిటీ బాలీవుడ్ కపుల్స్ జంటలుగా జిమ్లో వర్కౌట్స్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి భవిష్యత్తులో ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఈ జాబితాలోకి ఇంకెన్ని జంటలు వచ్చి చేరుతాయో చూడాలి.

అవికా గోర్ , మిలింద్ చాద్వాని విషయానికి వస్తే.. ఈ జంట గత ఏడాది సెప్టెంబర్ 30న ఒక లైవ్ షోలో పెళ్లి చేసుకుని అభిమానులను ఆశ్చర్యపరిచారు.. అనంతరం ముంబైలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక వైభవంగా జరిగింది. ఇకపోతే 2019లో ప్రముఖ వ్యాపారవేత్త అయిన మిలింద్ చాద్వానీతో ప్రేమలో పడింది అవికా గోర్. మిలింద్ సామాజిక కార్యకర్తగా పనిచేస్తుండగా జరిగిన ఒక ఈవెంట్లో మొదటిసారి కలుసుకున్నారు. అలా మొదలైన ఆ పరిచయం కాస్త ప్రేమ, పెళ్లికి దారితీసింది. అలా ఈ జంట ఒక్కటయ్యారు.

అవికాగోర్ విషయానికి వస్తే.. బాలికా వధు అంటూ హిందీలో.. చిన్నారి పెళ్లికూతురు అంటూ తెలుగులో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఉయ్యాల జంపాల అనే సినిమాతో తొలిసారి హీరోయిన్గా అడుగు పెట్టింది.. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈమె ప్రస్తుతం హిందీలో సినిమాలు చేస్తూ కెరియర్ ను కొనసాగిస్తోంది.