Begin typing your search above and press return to search.

104 డిగ్రీల‌ డెంగ్యూ తో షూట్ లో అవికా గోర్!

టెలివిజన్ రంగంతో పాటు సిల్వర్ స్క్రీన్‌పై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అవికా గోర్ ప్రస్తుతం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు.

By:  Srikanth Kontham   |   9 Aug 2026 6:00 AM IST
104 డిగ్రీల‌ డెంగ్యూ తో షూట్ లో అవికా గోర్!
X

టెలివిజన్ రంగంతో పాటు సిల్వర్ స్క్రీన్‌పై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అవికా గోర్ ప్రస్తుతం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. చిన్ననాటి నుంచి నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అవిక తాజాగా డెంగ్యూ బారిన పడ్డారు. ఈ వార్త బ‌య‌ట‌కు రావ‌డంతో అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షలు తెలియజేస్తున్నారు. అవికా గోర్ ఆసుపత్రిలో చేరిన విషయాన్ని ఆమె భర్త, సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వాని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

అవిక ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను వివరిస్తూ ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు. అవికా అనారోగ్యంతో బాధ‌పడుతున్నా? వృత్తిపట్ల ఆమెకు ఉన్న అంకితభావం ఎంత గొప్పదో ఈ సంఘటన నిరూపించిందని తెలిపారు.

డెంగ్యూ లక్షణాలు తీవ్రంగా ఉన్నా? అవికా గోర్ ఏకంగా 104 డిగ్రీల ఫారెన్‌హీట్ జ్వరంతో కూడా షూటింగ్ పనులను పూర్తి చేశారని మిలింద్ చంద్వాని వెల్లడించారు. ఎంతగా అనారోగ్యం వేధిస్తున్నా? కమిట్‌మెంట్ కారణంగా అవిక‌ విశ్రాంతి తీసుకోకుండా పనిచేశారని తెలిపారు. అయితే పరిస్థితి మరింత క్షీణించడంతో వెంటనే ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

నటీనటులు ఎదుర్కొనే శారీరక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లను ఈ ఘటన మరోసారి కళ్లకు కట్టింది. షూటింగ్స్ సమయంలో సెలబ్రిటీలు పడే శ్రమ, ఆరోగ్య సమస్యలను కూడా లెక్కచేయకుండా ప్రదర్శించే అంకితభావం ప్రశంసనీయమైనప్పటికీ ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యమని ఈ సంఘటన హెచ్చరిస్తోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అవికా గోర్ క్రమంగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.

బాలీవుడ్ సీరియల్ `బాలికా వధు` (చిన్నారి పెళ్లికూతురు) ద్వారా దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదిం చుకున్న అవికా గోర్ ఆ తర్వాత తెలుగులో కూడా పలు విజయవంతమైన చిత్రాలలో నటించారు. ప్రస్తుతం అవిక‌ నటనతో పాటు వివిధ ప్రాజెక్ట్‌లతో అత్యంత బిజీగా గడుపుతున్నారు. ఆమె త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో కోలుకుని మళ్లీ సాధారణ జీవితానికి, షూటింగ్స్‌కు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

వృత్తిపరమైన బాధ్యతలు ఎంత ముఖ్య‌మైనా? ప్రాథమికంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇలాంటి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయని సెలబ్రిటీల ఉదంతాలు నిరూపిస్తున్నాయి. అవికా గోర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ఇక అవికా గోర్ కెరీర్ సంగ‌తి చూస్తే కొంత కాలంగా తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌డం లేదు. దీంతో అమ్మ‌డు హిందీ లో ఛాన్సుల కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇప్ప‌టికే కొన్ని క‌మిట్ అయిన చిత్రాలున్నాయి. అలాగే పాత్రల విష‌యంలో రాజీ ప‌డేది లేద‌ని తెలిపారు.పారితోషికం కోసం కాకుండా పాత్ర కోసం ప‌నిచేసే న‌టిని అని..అలాంటి పాత్ర‌లు వ‌స్తేనే ప‌నిచేస్తాన‌ని ఇటీవ‌లే అమ్మ‌డు కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన సంగ‌తి తెలిసిందే.