పిక్‌టాక్ : ఈ క్యూట్ దెయ్యాన్ని గుర్తు పట్టారా?
బాల నటిగా హిందీ సీరియల్స్‌తో ప్రేక్షకులకు పరిచయం అయిన అవికా గోర్ మంచి గుర్తింపు దక్కించుకుంది.
By: Ramesh Palla | 30 Oct 2026 6:52 PM ISTబాల నటిగా హిందీ సీరియల్స్‌తో ప్రేక్షకులకు పరిచయం అయిన అవికా గోర్ మంచి గుర్తింపు దక్కించుకుంది. హిందీలో నటించినప్పటికీ ఆ సీరియల్స్ మొత్తం అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో డబ్బింగ్ చేయడంతో దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ముఖ్యంగా చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా అవికాకు దేశవ్యాప్తంగా పాపులారిటీ దక్కింది. ఆ పాపులారిటీతో అవికా పెద్దయ్యాక హీరోయిన్‌గానూ ఛాన్స్ దక్కించుకుంది. తెలుగులో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‌గా నటించడం ద్వారా తక్కువ సమయంలోనే అవికా స్టార్‌డం దక్కించుకుంది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉండటంతో అవికా గోర్‌కు టాలీవుడ్‌లో చాలా సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కింది. కానీ లక్ కలిసి రాకపోవడంతో అవికాకు హిట్స్ పడలేదు. గుర్తింపు దక్కినప్పటికీ హిట్స్ దక్కక పోవడంతో మెల్లగా ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి.
అవికా గోర్ హీరోయిన్‌గా ఎంట్రీ...
కొన్నాళ్లు కనిపించకుండా పోయిన అవికా గోర్ షాకింగ్ లుక్ తో అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. అప్పటి వరకు ఒక మాదిరిగా ఉండి, ఒక్కసారే సన్నబడి కనిపించడంతో అంతా కూడా అవాక్కయ్యారు. దీంతో అవికాకి స్టార్ హీరోలకు జోడీగా అవకాశాలు రావడం ఖాయం అని అంతా భావించారు. కానీ ఆమె రీ ఎంట్రీ నిరాశ ను మిగిల్చింది. చూడ్డానికి బాగుంది, కానీ ఎప్పటిలాగే అదృష్టం కలిసి రాకపోవడంతో మళ్లీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా అవికా కెరీర్ ఉంది. అయితే అవికా ఎప్పుడు కూడా ఆఫర్లు లేక ఖాళీగా లేదు. ఏదో ఒక సినిమా లేదా సిరీస్ చేస్తూనే వచ్చింది. ఇటీవల హగ్లీ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో తన యాక్టింగ్‌తో మరోసారి మెప్పించింది. అంతే కాకుండా సింప్లీ సూపర్ అన్నట్లుగా చీర కట్టులో అవికా మెప్పించింది. సినిమాలతో పాటు అవికా రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
అగ్లీ స్టోరీ సినిమాతో...
తాజాగా అవికా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అవికా గోర్ అందంగా ఉండటంతో పాటు, ఆకట్టుకునే లుక్స్‌తో ఎప్పుడూ మెప్పిస్తూ ఉంటుంది. అలాంటి అందమైన అవికా గోర్ ఇప్పుడు దెయ్యంగా కనిపించడంతో అంతా షాక్ అవుతున్నారు. కొందరు క్యూట్ దెయ్యం అంటూ కామెంట్ చేస్తే, మరికొందరు బాబోయ్ భయపెట్టావ్ కదా అవికా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి హ్యాలోవింగ్ వీకెండ్ కోసం అవికా ఇలా మేకోవర్ అయింది. ఈ హ్యాలోవింగ్ కి చాలా మంది సెలబ్రిటీలు ఇలా మేకోవర్ కావడం మనం చూస్తూనే ఉంటాం. ముందు ముందు మరింత మంది సెలబ్రిటీలు సైతం ఇలాంటి అందమైన దెయ్యం గెటప్ లో కనిపించబోతున్నారు. అయితే అవికా మాత్రం చాలా అందంగా, క్యూట్ దెయ్యంగా కనిపిస్తుంది అంటూ చాలామంది కామెంట్స్ చేయడం ద్వారా ఈ పోటోలు వైరల్ అవుతున్నాయి.
దెయ్యం లుక్‌లో అవికా షాక్...
ఇక అవికా సినిమాల విషయానికి వస్తే... గత ఏడాది షణ్ముఖ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ ఆకట్టుకున్న అవికా కమర్షియల్ బ్రేక్ ను దక్కించుకోలేక పోయింది. అయినా కూడా లక్కీగా అగ్లీ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం దక్కించుకుంది. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. అయితే ఈ సినిమా నేరుగా ఓటీటీ ద్వారా విడుదల కావడంతో ప్రేక్షకులు బిగ్ స్క్రీన్ లో ఎక్స్‌పీరియన్స్ చేయలేక పోయారు. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్, యాక్టింగ్ స్కిల్స్ ఉన్నప్పటికీ అవికా గోర్ కి లక్ కలిసి రాకపోవడంతో అభిమానులు ఆశించిన స్థాయిలో సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోలేక పోతుంది. ప్రస్తుతం ఒక తెలుగు సినిమాతో పాటు ఒక హిందీ సినిమా చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో ఆ రెండు సినిమాలతో అవికా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయినా ఇంకా లక్ కోసం ఈ అమ్మడు ఎదురు చూడాల్సి రావడం పాపం కదా..!
