Begin typing your search above and press return to search.

అవికా గోర్ క్షమాపణల వెనుక అసలు కథ!

ప్రముఖ రియాలిటీ షో ఖత్రోన్ కే ఖిలాడి సీజన్ 15 షూటింగ్ సెట్స్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి.

By:  Srikanth Kontham   |   18 Aug 2026 11:59 AM IST
అవికా గోర్ క్షమాపణల వెనుక అసలు కథ!
X

ప్రముఖ రియాలిటీ షో ఖత్రోన్ కే ఖిలాడి సీజన్ 15 షూటింగ్ సెట్స్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. షోలో పాల్గొన్న నటి అవికా గోర్ తోటి కంటెస్టెంట్ ఫర్హానా భట్ తో జరిగిన వివాదంపై బహిరంగంగా క్షమాపణలు కోరడం టెలివిజన్ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది. షో సమయంలో ఇద్దరి మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అయితే పరిస్థితి తీవ్రతను గ్రహించిన అవికా గోర్ వెంటనే తప్పును తెలుసుకుని క్షమాపణ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరించింది.

షో నిర్వహణలో భాగంగా కంటెస్టెంట్లు ఎదుర్కొనే మానసిక ..శారీరక ఒత్తిళ్లు కొన్నిసార్లు ఇలాంటి ఘర్షణలకు దారి తీస్తుంటాయి. టాస్క్‌ల సమయంలో గెలుపు ఓటముల ఒత్తిడి, మానసిక ఆందోళన కారణంగా తోటి కంటెస్టెంట్లతో మాటల యుద్ధాలు జరగడం రియాలిటీ షోలలో సర్వసాధారణం. `ఖత్రోన్ కే ఖిలాడి 15` సెట్స్‌లో కూడా అదే జరిగిందని.. ఆ సమయంలో తాను తీవ్రమైన అసహనానికి, మానసిక ఆందోళనకు గురయ్యానని అవికా గోర్ వెల్లడించారు. తన కోపాన్ని అదుపు చేసుకోలేక పోవడం వల్లనే ఆ వివాదం పెద్దదైందని అవిక నిజాయితీగా అంగీకరించారు.

వివాదం ముదిరిన తర్వాత సోషల్ మీడియాలో ..తోటి సెలబ్రిటీల మధ్య ఈ అంశంపై రకరకాల విశ్లేషణలు వెలువడ్డాయి. కొందరు అవికా గోర్‌కు మద్దతుగా నిలవగా, మరికొందరు ఆమె ప్రవర్తనను తప్పుబట్టారు. ఈ ట్రోలింగ్ ..విమర్శలన్నింటికీ స్వయంగా తెరదించుతూ అవికా గోర్ ముందుకొచ్చారు. తాను ప్రవర్తించిన తీరు సరైనది కాదని గ్రహించి, ఫర్హానా భట్‌కు నేరుగా క్షమాపణలు చెప్పడం ద్వారా వివాదానికి ముగింపు పలికారు. తోటి నటితో జరిగిన ఘర్షణలో తాను చేసిన తప్పును అంగీకరించడానికి ఎలాంటి అహంభావం చూపకపోవడంతో అవిక‌పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్ `బాలికా వధు` వంటి సీరియల్స్ ద్వారా బాల‌ నటిగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే. చిన్న వయసు నుంచే గ్లామర్ రంగంలో రాణిస్తున్న అమ్మ‌డు రియాలిటీ షోలలో తన నిజమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే ఇలాంటి హై-వోల్టేజ్ రియాలిటీ షోలలో పాల్గొనేటప్పుడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ఎంత కష్టమో? ఈ సంఘటన మరోసారి నిరూపించింది. కంటెస్టెంట్ల మధ్య జరిగే చిన్నపాటి మనస్పర్థలు ఎలా పెద్ద వివాదాలుగా మారుతాయో దీని ద్వారా స్పష్టమవుతోంది.

వివాదంపై అవికా గోర్ స్పందించిన తీరు ఆమె పరిణతిని తెలియజేస్తుంది. కోపంలో ఏమైనా అంటే దాన్ని మనసులో పెట్టుకోవద్దని.. తాను ఆ సమయంలో మానసిక ఒత్తిడి వలనే అలా ప్రవర్తించానని వివరణ ఇచ్చారు. ఒక సెలబ్రిటీగా తప్పు జరిగిందని భావించినప్పుడు బహిరంగంగా క్షమాపణలు చెప్పడంలో తప్పులేదని నిరూపించారు. ఈ క్షమా పణతో ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోయాయని..రాబోయే రోజుల్లో షోపై మరింత ఏకాగ్రత పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తంగా చూస్తే, 'ఖత్రోన్ కే ఖిలాడి 15' సెట్స్‌లో జరిగిన ఈ సంఘటన షో పై అంచనాలను మరింత పెంచేలా చేసింది. రియాలిటీ షోల డ్రామా ఎలా ఉన్నప్పటికీ, నటీనటులు తమ తప్పులను సరిదిద్దుకోవడానికి చూపించే చొరవ ప్రేక్షకులకు సానుకూల సందేశాన్ని ఇస్తుంది. అవికా గోర్ చూపిన ఈ పెద్దరికం ఆమె అభిమానుల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా, షోలో ఆమె ప్రయాణాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది.