Begin typing your search above and press return to search.

స్టార్ హీరోలకు షాక్.. ఏడేళ్ల తర్వాత కూడా థియేట‌ర్లో బాస్!

సాధారణంగా థియేటర్లలో కొత్త సినిమాలు లేని సమయంలో రీ-రిలీజ్‌లు చేస్తుంటారు. కానీ ఈసారి ప్రముఖ హాలీవుడ్ నటుల కొత్త సినిమాలు బరిలో ఉన్నా?

By:  Srikanth Kontham   |   28 Sept 2026 4:39 PM IST
స్టార్ హీరోలకు షాక్.. ఏడేళ్ల తర్వాత కూడా థియేట‌ర్లో బాస్!
X

హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) మళ్లీ ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన `అవెంజర్స్: ఎండ్‌గేమ్` విడుదలై ఏడేళ్లు పూర్తయిన తర్వాత సరికొత్త దృశ్యాలు .. వినూత్న ముగింపుతో `అవెంజర్స్: ఎండ్‌గేమ్ ఎన్‌కోర్` పేరుతో రీ-రిలీజ్ అయిన ఈ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద అగ్రస్థానంలో నిలిచింది. బిగ్ స్టార్స్ నటించిన సరి కొత్త హాలీవుడ్ చిత్రాల నుంచి తీవ్ర పోటీ ఎదురైనప్పటికీ మార్వెల్ ప్రేమికులు ఈ సూపర్ హీరో చిత్రానికి బ్రహ్మరథం ప‌డుతున్నారు.

ఈ వారాంతంలో `ఎండ్‌గేమ్ ఎన్‌కోర్` ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 86 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇందులో ఉత్తర అమెరికా నుంచి 26 మిలియన్ డాలర్లు రాగా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి 60 మిలియన్ డాలర్లు వసూలయ్యాయి. ఒక సినిమా రీ-రిలీజ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ స్థాయిలో ఓపెనింగ్స్ సాధించడం సినీ చరిత్రలోనే అత్యధికం కావడం విశేషం. ఉత్తర అమెరికాలోనూ 1997నాటి `స్టార్ వార్స్: ఎ న్యూ హోప్`(35.9 మిలియన్ డాలర్లు), 2011నాటి `ది లయన్ కింగ్` (30.2 మిలియన్ డాలర్లు) రీ-రిలీజ్‌ల తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా ఇది నిలిచింది.

సాధారణంగా థియేటర్లలో కొత్త సినిమాలు లేని సమయంలో రీ-రిలీజ్‌లు చేస్తుంటారు. కానీ ఈసారి ప్రముఖ హాలీవుడ్ నటుల కొత్త సినిమాలు బరిలో ఉన్నా? `ఎండ్‌గేమ్ ఎన్‌కోర్` వాటిపై ఆధిక్యతను ప్రదర్శించింది. హాలీవుడ్ సూపర్‌స్టార్ బ్రాడ్ పిట్ నటించిన సర్వైవల్ థ్రిల్లర్ `హార్ట్ ఆఫ్ ది బీస్ట్` ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ డాలర్ల వసూళ్లతో రెండో స్థానానికి పరిమితం కాగా, మార్వెల్ సినిమా దాని కంటే చాలా ముందంజలో నిలిచింది. మరోవైపు ప్రముఖ నటుడు రాబర్ట్ ప్యాటిన్సన్ ప్రధాన పాత్రలో నటించిన ట్రూ-క్రైమ్ డ్రామా `ప్రైమ్‌టైమ్` ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. 15 మిలియన్ డాలర్ల తక్కువ బడ్జెట్‌తో తక్కువ థియేటర్లలో విడుదలై ఈ స్థాయి వసూళ్లు సాధించి మంచి విజయంగా నిలిచింది. అలాగే యూనివర్సల్ పిక్చర్స్ తెరకెక్కించిన యానిమేటెడ్ చిత్రం `ఫార్గాటెన్ ఐలాండ్` 20 మిలియన్ డాలర్ల వసూళ్లతో తదుపరి స్థానంలో నిలిచింది.

ఇదే ఏడాది డిసెంబర్‌లో రానున్న భారీ చిత్రం `అవెంజర్స్: డూమ్స్‌డే` కు ముందస్తు ప్రచారంగా `ఎండ్‌గేమ్ ఎన్‌కోర్` వెర్షన్‌ను మార్వెల్ ఉపయోగించుకుంది. ఈ రీ-రిలీజ్ వెర్షన్‌లో రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఈవాన్స్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపే ప్రత్యేక సందేశంతో పాటు, కొత్తగా ఎండ్-క్రెడిట్ సీన్లను జోడించారు. `ఎండ్‌గేమ్` సంఘటనలు భవిష్యత్తులో విలన్ డాక్టర్ డూమ్ ఆవిర్భావానికి ఎలా దారితీశాయనేది ఈ కొత్త దృశ్యాల ద్వారా స్పష్టంగా చూపిం చారు. కరోనా మహమ్మారి తర్వాత మార్వెల్ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్న తరుణంలో ఈ విజయం మార్వెల్ స్టూడియోస్‌కు పెద్ద ఊరటనిచ్చింది. `డూమ్స్‌డే` సినిమాను గ్రాండ్‌గా ప్రమోట్ చేసేందుకు వేసిన ఈ ప్రణాళిక ఫలించడంతో మార్వెల్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నిండడమే కాకుండా తదుపరి రాబోయే అవెంజర్స్ చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.