'అవెంజర్స్ డూమ్స్ డే' ఫైనల్ ట్రైలర్: కొత్త వారియర్ ప్రపంచంలోకి పయనం!
మార్వెల్ ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ఫైనల్ ట్రైలర్ భారీ యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్‌తో ఆకట్టుకుంటోంది. స్టీవ్ రోజర్స్, పెగ్గీ కార్టర్ కుమారుడి పరిచయం, డాక్టర్ డూమ్ నేపథ్యం ఆసక్తి పెంచుతున్నాయి. థోర్, ఎక్స్‌మెన్, బ్లాక్ పాంథర్ సహా పలువురు సూపర్ హీరోలు కనిపించడంతో డిసెంబర్ 18న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
By: Sivaji Kontham | 24 Nov 2026 9:18 AM ISTభారీ విజువల్ గ్రాఫిక్స్.. యుద్ధాలు.. స్నేహితుల కలయికలు.. నష్టానికి రివెంజ్ తీర్చుకోవడం.. అద్బుతమైన ప్రపంచాల నుంచి పాత్రలు పాత్రధారుల ప్రయాణాలు.. ఒకచోటి నుంచి ఇంకో చోటికి అదృశ్యమవ్వడం.. ఇవన్నీ కేవలం గ్రాఫికల్ వండర్స్ మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇందులోనే బోలెడంత కథ చెబుతారు గనుకనే అవెంజర్స్ లాంటి ఫాంటసీ ఫిక్షన్ చిత్రాలకు గొప్ప ఆదరణ దక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు పెద్దలు కలిసి కుటుంబ సమేతంగా ఈ సినిమాలను ఆదరిస్తుంటే బిలియన్ డాలర్ వసూల్ పెద్ద మ్యాటరేమీ కాదు. ఈ కేటగిరీలో అవెంజర్స్ ఫ్రాంఛైజీ దూకుడు గురించి చెప్పాల్సిన పనే లేదు.
మార్వెల్ స్టూడియోస్ నుంచి మెస్ట్ అవైటెడ్ `అవెంజర్స్: డూమ్స్‌డే` సంచలనాలకు సిద్ధమవుతోంది. అవెంజర్స్ కి ఇండియాలో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇక్కడా బాక్సాఫీస్ వసూళ్లపై ట్రేడ్ లో భారీ అంచనాలున్నాయి. అవెంజర్స్ ఫ్రాంఛైజీ సినిమాలు భారత్ లో సునాయాసంగా 100 కోట్లు పైగా వసూలు చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫైనల్ ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో పెద్ద చర్చకు తెరలేపింది. ట్రైలర్ ఆద్యంతం భారీ విజువల్ గ్రాఫిక్స్ తో యాక్షన్ తో రక్తి కట్టిస్తోంది. ఇందులో కెప్టెన్ అమెరికా- స్టీవ్ రోజర్స్ తిరిగి రావడం.. పెగ్గీ కార్టర్‌తో అతడికి ఒక కొడుకు ఉన్నాడన్న విషయాన్ని ఈ ట్రైలర్‌లో చూపించారు. `అవెంజర్స్: ఎండ్‌గేమ్` రీ-రిలీజ్‌లో జోడించిన సీన్‌కు కొనసాగింపుగా.. ఫెంటాస్టిక్ ఫోర్ బృందం టైమ్ ట్రావెల్ చేసి స్టీవ్‌ను ప్రధాన టైమ్‌లైన్‌లోకి తీసుకురావడం.. తన తండ్రి గతం గురించి కొడుకు ప్రశ్నించడం వంటి సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.
మరోవైపు ఈ ట్రైలర్‌లో విక్టర్ వాన్ డూమ్ (డాక్టర్ డూమ్) పాత్రకు సంబంధించిన నేపథ్యం బయటపడటంతో, ప్రేక్షకుల్లో కొందరు హీరోల కంటే విలన్ వైపే మొగ్గు చూపుతూ టీమ్ డూమ్ అంటూ మద్దతు తెలుపుతున్నారు. ప్రతీకారం నేపథ్యంలో ట్రైలర్ లో యాక్షన్ రక్తి కట్టించింది. ట్రైలర్ లో కొన్ని పంచ్ డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
ఇక `అవెంజర్స్: ఎండ్‌గేమ్`లో టోనీ స్టార్క్ (ఐరన్ మ్యాన్), నటాషా రోమనోఫ్ చేసిన ప్రాణత్యాగాలపై కూడా ట్రైలర్ తర్వాత తీవ్ర చర్చ మొదలైంది. థానోస్ గురించి పెద్ద చర్చ సాగేలా ట్రైలర్ లో ఎలివేషన్లు ఆకట్టుకున్నాయి. డిసెంబర్ 18న థియేటర్లలో విడుదల కానున్న `అవెంజర్స్: డూమ్స్‌డే`లో రాబర్ట్ డౌనీ జూనియర్ పోషిస్తున్న డాక్టర్ డూమ్ .. అతడి సైన్యాన్ని ఎదుర్కొనేందుకు భారీ సూపర్ హీరోల టీమ్ ఒకటిగా మారుతుందనే పాయింట్ ఆకట్టుకుంది. థోర్ హీరోలు.... ఎక్స్-మెన్ గాంబిట్, నైట్‌క్రాలర్ వంటి మ్యూటెంట్లు వార్ లోకి దిగడం ఆసక్తికరం. వీరితో పాటు న్యూ అవెంజర్స్, బ్లాక్ పాంథర్, కేట్ బిషప్ వంటి పాత్రలు కూడా కనిపించడంతో ఇది మార్వెల్ సినీ చరిత్రలోనే అతిపెద్ద మల్టీవర్స్ పోరుగా నిలవనుంది.
పాత్రధారుల అసలు పేర్లు గుర్తుండకపోవచ్చు.. కానీ పాత్రల పేర్లను సినీప్రేమికులు ఎప్పటికీ మర్చిపోలేరు. డాక్టర్ డూమ్, థోర్, ఐరన్ మేన్, నైట్ క్రాలర్, బ్లాక్ పాంథర్, ఎక్స్‌మెన్, మ్యూటెంట్స్ .. ఇలా ప్రతి పాత్రా దేనికదే ప్రత్యేకం. ఇవన్నీ వెండితెర నిండుగా కనిపిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నాయి. డూమ్స్ డే కోసం భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నందున ఇక్కడా రికార్డులు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు.
