అవతార్-3.. ఇండియాలో అన్ని కోట్లు రాబడుతుందా?
ప్రపంచంలోనే అత్యధికంగా రెస్పాన్స్ అందుకున్న సినిమా ఫ్రాంఛైజీల్లో కచ్చితంగా అవతార్ టాప్ లో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
By: M Prashanth | 10 Dec 2025 11:06 AM ISTప్రపంచంలోనే అత్యధికంగా రెస్పాన్స్ అందుకున్న సినిమా ఫ్రాంఛైజీల్లో కచ్చితంగా అవతార్ టాప్ లో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇప్పటి వరకు రెండు పార్టులు రాగా.. ఇప్పుడు మూడో భాగం అవతార్: ఫైర్ అండ్ యాష్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 19వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షోలో 1.2 మిలియన్ల ఇంట్రెస్టులు నమోదవడంతో ఎంతటి ఆసక్తి ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. హాలీవుడ్ మూవీనే అయినా.. ఇండియాలో పెద్ద సంఖ్యలో అభిమానులు సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.
అవతార్: ఫైర్ అండ్ యాష్ కోసం ఈసారి కొత్త తెగను డైరెక్టర్ జేమ్స్ కామరూన్ క్రియేట్ చేయడం విశేషం. దాంతోపాటు మూవీని భారీ స్థాయిలో రూపొందించడంతో పెద్ద ఎత్తున ఖర్చు అయినట్టు తెలుస్తోంది. ఆర్టిస్టులు, టెక్నిషియన్ రెమ్యునరేషన్ లతోపాటు నిర్మాణ ఖర్చు అంతా కలిసి సుమారు 400 మిలియన్ డాలర్స్ అయిందట.
అంటే మన కరెన్సీలో 3600 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే అవతార్-3.. ఇండియాలో 400 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు ఇప్పుడు అంచనా వేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ పెద్ద ఎత్తున జరుగుతుండడంతో.. భారీ వసూళ్లు కచ్చితంగా వస్తాయని వారు చెబుతున్నారు.
అయితే సినిమాకు హిట్ టాక్.. వస్తే కచ్చితంగా ట్రేడ్ పండితులు వసూళ్ల అంచనాలను అవతార్-3 మూవీ ఇండియాలో అందుకుంటుందనే చెప్పాలి. అవతార్-2 కూడా అప్పుడు 400 కోట్లకు పైగా సాధించినట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం అంతకుమించి అవతార్-3 రాబట్టడం పక్కానేమో.
ఇక సినిమా విషయానికొస్తే.. జేమ్స్ కామెరాన్, జాన్ లండావు నిర్మిస్తుండగా, సామ్ వర్తింగ్ డన్, జో సల్దానా, సిజర్నీ వీవర్, స్టీఫాన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్, ఊనా చాప్లిన్ నటిస్తున్నారు. రస్సెల్ కార్పెంటర్ సినిమాటోగ్రాఫర్ గా, సైమన్ ఫ్రాంగ్ లెన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. స్టీఫెన్ రికిన్, డెవిడ్ బ్రెన్నెర్, జాన్ రిఫ్యూ, జేమ్స్ కామెరాన్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా.. మరి ఇండియాలో అవతార్-3 మూవీ ఎంతటి వసూళ్లను రాబడుతుందో వేచి చూడాలి.
