అవతార్ 3 చిత్రం 100కోట్లు మిస్ చేసుకున్నట్టే!
హాలీవుడ్ సినిమాలను ఆదరించడంలో భారతీయ ప్రజలు ఎప్పుడూ ముందుంటారు. పాశ్చాత్య దేశాల నుంచి వచ్చే భారీ ఫ్రాంఛైజీ చిత్రాలు మన దేశం నుంచి వందల కోట్లు వసూలు చేస్తున్నాయి.
By: Sivaji Kontham | 30 Aug 2025 10:09 AM ISTహాలీవుడ్ సినిమాలను ఆదరించడంలో భారతీయ ప్రజలు ఎప్పుడూ ముందుంటారు. పాశ్చాత్య దేశాల నుంచి వచ్చే భారీ ఫ్రాంఛైజీ చిత్రాలు మన దేశం నుంచి వందల కోట్లు వసూలు చేస్తున్నాయి. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ ఇండియాలో స్థానిక భాషల్లో విడుదలై సంచలన వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అవతార్ ఫ్రాంఛైజీ నుంచి రెండు భాగాలు విడుదల కాగా భారీ వసూళ్లను సాధించాయి. ఇప్పుడు అవతార్ 3 ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. భారతదేశంలోను ఈ సినిమాని అత్యంత భారీగా విడుదల చేయనున్నారు.
అయితే అవతార్ 3 - ఫైర్ అండ్ యాష్ విషయంలో గత సినిమాల మాదిరి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ రిపీటవుతుందా? అంటే సందేహం వ్యక్తమవుతోంది. డిసెంబర్ 19న విడుదలకు సిద్ధమవుతున్న అవతార్ 3 కోసం అవసరమైన పబ్లిసిటీ చేయడంలో స్థానిక పంపిణీదారు విఫలమవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు అవతార్ 3 ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఇది మొదటి రెండు భాగాల ట్రైలర్లు ఇచ్చినంత భావోద్వేగపు డెప్త్ ని అందించడంలో విఫలమైందని విమర్శలొచ్చాయి. మొదటి భాగంలో ప్రకృతి ప్రధాన ఇతివృత్తంగా కనిపించింది. రెండో భాగంలో నీటిలో అవతార్ ల ప్రయాణం హైలైట్ అయింది. ఈసారి నిప్పు -దహనం నేపథ్యంలో మూడో భాగాన్ని కామెరూన్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో విలన్ పాత్రధారిని మండే నిప్పు కణంలా ప్రెజెంట్ చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది.
ఇటీవల విడుదలైన ట్రైలర్ బావుంది.. కానీ మునుపటి భాగాలను మించేలా, ఆశించిన స్థాయిలో లేదనే విమర్శలు వచ్చాయి. కానీ అవతార్ నుంచి మునుముందు మరిన్ని ట్రైలర్లు మునుముందు ఉత్కంఠను పెంచుతాయని ఆశిస్తున్నారు. ఇప్పటికి అవతార్ ఫ్రాంఛైజీ సినిమాలకు ఆరంభ వసూళ్లకు డోఖా ఏం ఉండదనే నమ్మకం ఉంది. భారీ వీఎఫ్ఎక్స్ - టెక్నాలజీ ఆధారంగా రూపొందుతున్న ఈ ఫ్రాంఛైజీపైనా, కామెరూన్ పైనా ప్రజలకు ఉన్న నమ్మకం అలాంటిది. అయితే అవతార్ 3 ఆరంభ వసూళ్ల పరంగా ప్రభంజనం సృష్టిస్తేనే భారతదేశం నుంచి 100 కోట్లు సునాయాసంగా కొల్లగొట్టడం సాధ్యమవుతుంది. అలా కాకుండా ఏమాత్రం టాక్ నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయినా ఆరంభ వసూళ్లు దక్కడం సులువు కాదు. ఇటీవల కొన్ని భారీతనం నిండిన హాలీవుడ్ సినిమాలు ఇండియాలో భారీ వసూళ్లను రప్పించడంలో విఫలమయ్యాయి. వీటికి దేశీయంగా ప్రచారం లేకపోవడం కూడా మైనస్ అయింది. బాలీవుడ్ దిగ్గజ హీరోలు కూడా వంద కోట్ల లోపు వసూళ్లతో నిరాశపరుస్తున్నారు. అందువల్ల అవతార్3 ప్రమోషన్స్ విషయంలో మరింత జాగ్రత్త అవసరమని విశ్లేషిస్తున్నారు. అవతార్ 3 విషయంలో ముందస్తు ప్రణాళిక, హార్డ్ వర్క్ తో భారతదేశంలోను భారీ వసూళ్లను తేవడానికి ఆస్కారం ఉంది.
