అవతార్ 3 ట్రైలర్ : విజువల్ వండర్ కా బాప్ అంటే ఇదే
ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో మూడో చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా అవతార్ 3 (ఫైర్ అండ్ యాష్) కొత్త ట్రైలర్ విడుదలై వెబ్ లో సునామీ స్పీడ్ తో దూసుకుపోతోంది.
By: Sivaji Kontham | 26 Sept 2025 10:01 AM ISTచాలామంది తమ సినిమాలను విజువల్ వండర్స్ అని చెబుతుంటారు. కానీ అలా చెప్పకుండానే ప్రేక్షకుల మనసుపై ఘాడమైన ముద్ర వేయడంలో జేమ్స్ కామెరూన్ పనితనం గురించి చెప్పుకుని తీరాలి. టైటానిక్ మొదలు, అతడు ఎన్నో సంచలన సినిమాలను తెరకెక్కించారు. ముఖ్యంగా అవతార్ ఫ్రాంఛైజీని ప్రారంభించి కామెరూన్ చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు.
ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చి వేల కోట్ల వసూళ్లను సాధించాయి. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో మూడో చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా అవతార్ 3 (ఫైర్ అండ్ యాష్) కొత్త ట్రైలర్ విడుదలై వెబ్ లో సునామీ స్పీడ్ తో దూసుకుపోతోంది.
విజువల్ వండర్ కా బాప్ అంటే ఇదే! అనే రేంజులో ఈ ట్రైలర్ రక్తి కట్టిస్తోంది. ఓవైపు పండోరా గ్రహంపై భీకర యుద్ధాలు, మరోవైపు సముద్ర జాలలపైనా అసాధారణ పోరాటాలు, గగుర్పొడిచే సాహస విన్యాసాలు, వింతైన కొత్త జీవుల పరిచయంతో ఈ ఫ్రాంఛైజీ చిత్రం మునుపటి భాగాల కంటే అత్యంత గ్రాండియర్ గా ఉండబోతోందని క్లారిటీనిచ్చింది. ట్రైలర్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. మరోసారి కామెరూన్ చిత్రం బిలియన్ల డాలర్లను కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఐమ్యాక్స్ 3డిలో ఇలాంటి విజువల్ అద్భుతాన్ని వీక్షించడం అనేది ఒక డ్రీమ్ లాంటిది. ఇప్పుడు ఐమ్యాక్స్ స్క్రీన్ల విస్తరణ పెరుగుతోంది కాబట్టి ప్రపంచంలోని సినీప్రియులకు గొప్ప వినోదానికి ఆస్కారం ఉంది.
మూడో భాగం కథాంశం ఆసక్తిని కలిగిస్తోంది. పండోరా గ్రహవాసుల నాయకుడు జేక్ సుల్లీ, యోధురాలైన నెయితిరి తమ కుటుంబానికి ఎదురైన ముప్పు నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నం తో కథ ప్రారంభమవుతుంది. అనవసరమైన కన్ఫ్యూజన్స్ లేకుండా చాలా సరళమైన కథతో ఈ సినిమాను పెద్దతెర అద్బుతంగా రూపొందిస్తున్నారు కామెరూన్. ట్రైలర్ ఆద్యంతం రక్తి కట్టిస్తోంది. ఇందులో ఎమోషనల్ డెప్త్ ప్రజల్ని విపరీతంగా ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు. బలమైన శత్రువు అగ్నితో దహించేంత భయంకరమైనవాడు అయినా దానిని ఎదుర్కొనే వీరుల కథను కామెరూన్ తెరపై ఆవిష్కరిస్తున్నారు. కామెరూన్, రిక్ జాఫా- అమండా సిల్వర్ దీనికి రచయితలు. సామ్ వర్తింగ్టన్, సిగౌర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్లెట్ తదితరులు నటించారు.