ఇండియాలో అవతార్ క్రేజ్‌కి ఇదే సాక్ష్యం..!
అవతార్ ప్రాంచైజీ నుంచి మూడో సినిమా 'అవతార్ : ఫైర్ అండ్ యాష్' రాబోతుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
By: Ramesh Palla | 23 Oct 2025 11:47 AM ISTహాలీవుడ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఆధరణ తీసుకు వచ్చిన దర్శకుల్లో జేమ్స్ కామెరాన్ ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన గొప్ప దర్శకుడు అని పలు సార్లు, పలు సినిమాలతో నిరూపితం అయ్యింది. ఆయన సృష్టించిన అవతార్ ప్రపంచం ఏ స్థాయి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవతార్ సినిమాను ఇండియన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టి మరీ థియేటర్లలో చూశారు, అందుకు తగ్గట్టుగా వసూళ్లు వచ్చాయి. అవతార్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అవతార్ 2 సినిమా సైతం ప్రేక్షకుల ముందుకు వచ్చి అదే స్థాయిలో వసూళ్లు రాబట్టింది. అవతార్ ప్రాంచైజీ నుంచి మూడో సినిమా 'అవతార్ : ఫైర్ అండ్ యాష్' రాబోతుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అవతార్ : పైర్ అండ్ యాష్ మూవీ రిలీజ్
ఇండియాలో అవతార్ : ఫైర్ అండ్ యాష్ సినిమాకు పెద్దగా ప్రచారం జరగకున్నా కూడా అంచనాలు భారీగా పెరిగాయి, అందుకు తగ్గట్లుగానే భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, ఇతర భాషల్లోనూ అవతార్ సినిమా బిజినెస్ అదే రేంజ్‌లో ఉందని వార్తలు వస్తున్నాయి. కేవలం బిజినెస్ పరంగానే కాకుండా అవతార్ : ఫైర్ అండ్ యాష్ సినిమా విడుదల సమయంలో ఏ ఇండియన్ సినిమా పోటీకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. డిసెంబర్ 19, 2025 న హిందీ, తెలుగులోనే కాకుండా ఏ ఇతర భాషల్లోనూ పెద్ద సినిమాలు విడుదల కావడం లేదు. ఆ వారం మాత్రమే కాకుండా ముందు వారం, తర్వాత వారం కూడా అవతార్ పోటీ బలంగా ఉంటుందని, దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇండియన్ సినిమాలను విడుదల చేయడానికి సాహసించడం లేదు.
అఖండ 2 సినిమా విడుదల తేదీ
మొదట అఖండ 2 సినిమాను డిసెంబర్‌లో మూడో వారం విడుదల చేయాలని భావించారని, కానీ అవతార 3 సినిమా విడుదల కారణంగానే రెండు వారాల ముందుగానే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. అఖండ 2 సినిమాను డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఆ సినిమా విడుదల అయ్యి రెండు వారాల రన్ పూర్తి చేసుకున్న తర్వాత అవతార్ 3 రాబోతుంది. కనుక ఆ సినిమా వల్ల అఖండకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఫిక్స్ అయిన తర్వాత మాత్రమే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. డిసెంబర్ మూడో వారంలో ఏ పెద్ద సినిమా రావడం లేదు, అయితే డిసెంబర్ నాల్గవ వారంలో మాత్రం కాస్త బజ్ ఉన్న సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. అవతార్ 3 జోరును బట్టి డిసెంబర్ 4వ వారం సినిమాల విడుదల ఉండే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అవతార్ జోరు
అవతార్ సినిమాకు ఉన్న బజ్, ఆ సినిమాకు ఇండియన్ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని స్టార్ హీరోల సినిమాల మాదిరిగా వేల కొద్ది స్క్రీన్స్‌లో స్క్రీనింగ్‌కు రెడీ చేస్తున్నారు. ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వడం మాత్రమే కాకుండా ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాలను పోటీ ఇవ్వకుండా సైడ్ కావడంను బట్టి కూడా అవతార్ స్టామినా ఏంటి, దానికి ఉన్న క్రేజ్ ఏంటో చెప్పకనే చెబుతోంది. ఈ స్థాయిలో అవతార్ సినిమాకు ఉన్న క్రేజ్ కారణంగానే ఈసారి కూడా వందల కోట్ల వసూళ్లు నమోదు కావడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అవతార్ 2 మాదిరిగానే థియేట్రికల్ రిలీజ్ అయిన వెంటనే ఓటీటీ స్ట్రీమింగ్ ఉండదు. కనుక ప్రేక్షకులు ఖచ్చితంగా థియేట్రికల్ స్క్రీనింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకే అవతార్ 3 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.