Begin typing your search above and press return to search.

అవతార్ 3: రిలీజ్ కు ముందు ఓ దెబ్బ.. ఏం పర్లేదు!

గ్లోబల్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ క్రియేట్ చేసిన 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' సినిమాను, రాబోయే 'ఫైర్ అండ్ యాష్' కోసం బజ్ పెంచడానికి డిస్నీ మళ్లీ థియేటర్లలోకి తీసుకురావడం పెద్ద ప్లానే.

By:  M Prashanth   |   13 Oct 2025 12:07 PM IST
అవతార్ 3: రిలీజ్ కు ముందు ఓ దెబ్బ.. ఏం పర్లేదు!
X

గ్లోబల్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ క్రియేట్ చేసిన 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' సినిమాను, రాబోయే 'ఫైర్ అండ్ యాష్' కోసం బజ్ పెంచడానికి డిస్నీ మళ్లీ థియేటర్లలోకి తీసుకురావడం పెద్ద ప్లానే. కానీ, ఈ రీ రిలీజ్ కనీసం 5 కోట్లు కూడా కలెక్ట్ చేయలేక ఘోరంగా ఫ్లాప్ అయ్యిందనే కథనాలు వెలువడుతున్నాయి. ఈ ఫెయిల్యూర్ చూసి, డిసెంబర్ రిలీజ్ పై టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే, ప్రేక్షకులు అంత త్వరగా, అంటే సినిమా చూసి కేవలం మూడేళ్లు మాత్రమే అయిన తర్వాత, మళ్లీ అదే విజువల్స్ కోసం థియేటర్‌కు రారనేది సింపుల్ లాజిక్. ఈ రీ రిలీజ్ అనేది కేవలం ప్రమోషనల్ టూల్ మాత్రమే.

​రీ రిలీజ్ ఎందుకు వర్కౌట్ కాలేదు?

​రీ రిలీజ్ వర్కౌట్ కాకపోవడానికి ప్రధాన కారణం.. ఇది మరీ త్వరగా రావడం. ఒక క్లాసిక్ సినిమా అయితే, మళ్లీ చూడాలనే ఆసక్తి ఉంటుంది. కానీ, 'అవతార్ 2' విజువల్స్ అందరి మనసుల్లో ఇంకా ఫ్రెష్‌గా ఉన్నాయి. అందుకే, కొన్ని అన్‌సీన్ క్లిప్స్ ఉన్నా, 200 పెట్టి మళ్లీ థియేటర్‌కు వెళ్లాలనే ఆసక్తి ప్రేక్షకులకు కలగలేదు. అందుకే ఈ రీ రిలీజ్ ప్రభావం.. రాబోయే 'అవతార్: ఫైర్ అండ్ యాష్' సినిమా కలెక్షన్లపై ఏమాత్రం చూపకపోవచ్చు. ఎందుకంటే, రాబోయేది పూర్తిగా కొత్త కంటెంట్.

​జక్కన్నతో ప్లానింగ్

​డిస్నీ ఇప్పుడు కొత్త సినిమా కోసం మార్కెట్ స్ట్రాటజీని పక్కాగా సిద్ధం చేస్తోందనేది తాజా సమాచారం. 'ఫైర్ అండ్ యాష్' ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఇండియాలో నెవ్వర్ బిఫోర్ అనేలా స్క్రీన్ కౌంట్ పెంచుతున్నారు. దీనికి తోడుగా, రాజమౌళి లాంటి గ్లోబల్ డైరెక్టర్‌ను ప్రమోషన్స్‌లో వాడుకునే అవకాశం ఉంది. SSMB29 (మహేష్ బాబు-రాజమౌళి) సినిమా టీజర్‌ను లేదా ఏదైనా ఎక్స్‌క్లూజివ్ ఫుటేజ్‌ను ఈ సినిమాతో జత చేసి, హైప్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు.

​రాజమౌళి స్వయంగా జేమ్స్ కామెరూన్‌తో కలిసి సినిమాను ప్రమోట్ చేసే అవకాశం ఉంది. జక్కన్న బ్రాండ్ ఇమేజ్, అవతార్ ఫ్రాంచైజ్ క్రేజ్‌ను తిరిగి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించవచ్చు. ఎలా చూసుకున్నా, ఈ రీ రిలీజ్ ఫెయిల్యూర్ అనేది రాబోయే సినిమా విజయాన్ని అస్సలు దెబ్బతీయదు.

​ఫైనల్ పాయింట్ ఏంటంటే, 'అవతార్: ఫైర్ అండ్ యాష్' సినిమాకు టాక్ బాగుంటే, కలెక్షన్లు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.