Begin typing your search above and press return to search.

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

తెలుగు మూలాలు కలిగిన భారతీయ-అమెరికన్ నటి అవంతిక వందనపు ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇటు టాలీవుడ్, అటు హాలీవుడ్‌లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు

By:  Sivaji Kontham   |   2 Nov 2026 11:52 PM IST
కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం
X

తెలుగు మూలాలు కలిగిన భారతీయ-అమెరికన్ నటి అవంతిక వందనపు ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇటు టాలీవుడ్, అటు హాలీవుడ్‌లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా ప్రముఖ మ్యాగ‌జైన్ (A షాట్ మ్యాగ‌జైన్) కోసం నిర్వహించిన హాలోవీన్ థీమ్ ఫోటోషూట్ కి సంబంధించిన బిహైండ్ ద సీన్స్ అవుట్‌టేక్స్ ఫోటోలను అవంతిక తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసారు. ఎడిటర్-ఇన్-చీఫ్ రెమి అల్ ఫలాహ్, ఆర్ట్ డైరెక్టర్ హాలీ గ్లుక్ సార‌థ్యంలోని ఫొటోగ్రాఫర్ క్సింగర్-క్సాంగర్ తీసిన ఈ డిఫరెంట్ ఫ్యాషన్ షూట్ ఫ్యాన్స్ స‌హా సినీ ప్రముఖులను ఎంతగానో ఆకట్టుకుంది.




స్టైలిస్ట్ సెబాస్టియన్ హోల్ రూపొందించిన ట్రెండీ అవుట్‌ఫిట్స్.. రాచెల్ లీటా హెయిర్ స్టైలింగ్.. రోబెర్టీ మేకప్ `అల్ హెయిల్ థై నైల్` నైల్ ఆర్ట్‌తో అవంతిక బోల్డ్ అండ్ స్ఫెష‌ల్ లుక్‌లో మెరిసిపోయారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే హాలీవుడ్ ప్రముఖులు టాన్ ఫ్రాన్స్, బెయిలీ బాస్, జోషువా రాబర్ట్ కొల్లీలతో పాటు ఫేమస్ ఫొటోగ్రాఫర్ బ్రాండన్ వోల్ఫెల్ సైతం అవంతిక ఫ్యాషన్ సెన్స్, గ్లామర్‌ను కొనియాడుతూ కామెంట్స్ చేశారు.




అవంతిక సినీ ప్రయాణ విషయానికి వస్తే.. అవంతిక తన నటనా జీవితాన్ని టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రారంభించారు. మహేష్ బాబు `బ్రహ్మోత్సవం` సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ భామ‌ ఆ తర్వాత `మనం అంతా`, నాగచైతన్య `ప్రేమమ్`, `రా రండోయ్ వేడుక చూద్దాం`, `బాబు బాగా బిజీ`, `బాలకృష్ణుడు`, `ఆక్సిజన్`... పవన్ కళ్యాణ్ `అజ్ఞాతవాసి` వంటి ప‌లు తెలుగు సినిమాల్లో బాలనటిగా ఆకట్టుకున్నారు.




అమెరికాకు చెందిన ఎన్నారై కుటుంబ నేపథ్యం కలిగిన అవంతిక తెలుగు సినిమాల‌కు బ్రేక్ ఇచ్చి హాలీవుడ్ వైపు అడుగులు వేశారు. డిస్నీ ఛానెల్ రూపొందించిన `స్పిన్` (2021) చిత్రంతో హాలీవుడ్‌లో క‌థానాయిక‌గా మారి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన `సీనియర్ ఇయర్`(2022), హాలీవుడ్ పాపులర్ రీమేక్ `మీన్ గర్ల్స్`.. హారర్ మూవీ `టారో` చిత్రాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో మంచి నటిగా పేరు సంపాదించుకున్నారు.




ప్రస్తుతం కూడా అవంతిక హాలీవుడ్ స‌హా భారతీయ ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. 2026లో హాలీవుడ్‌లో మిండీ కాలింగ్ నిర్మించిన `నాట్ సూటబుల్ ఫర్ వర్క్` సిరీస్‌తో పాటు `ప్రెట్టీ లీథల్` అనే ఇంగ్లీష్ మూవీలోను అలరించారు. టాలీవుడ్‌లో రోషన్ కనకాల హీరోగా వచ్చిన `ఛాంపియన్` చిత్రంలో స్పెషల్ అప్పీయరెన్స్‌తో పలకరించారు. పశ్చిమ దేశాల మోడరన్ కల్చర్ .. భారతీయ సాంప్రదాయ శైలులను కలగలిపిన ఈ బ్యూటీ వెస్ట్రన్ అండ్ దేశీ ఫ్యాషన్ సెన్స్ నిరంతరం సోషల్ మీడియాలో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటూనే ఉంది.