గ్లామర్ తో హీటెక్కిస్తున్న బ్రహ్మోత్సవం బ్యూటీ.. ఈ రేంజ్ మేకోవర్ ఎక్స్పెక్ట్ చేయలేదుగా!
కాలిఫోర్నియాలోనే పుట్టి పెరిగిన అవంతికా వందనపు, చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు ఇండస్ట్రీలో కొన్నాళ్లు సందడి చేసింది.
By: Madhu Reddy | 23 Jun 2026 11:54 AM ISTటాలీవుడ్ లో 'బ్రహ్మోత్సవం', 'ప్రేమమ్' సినిమాల్లో బుజ్జి పాపలా కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ అవంతికా వందనపు గుర్తుందిగా? అప్పట్లో లంగా ఓణీలతో క్యూట్‌గా కనిపించిన ఈ అమ్మడు, ఇప్పుడు హాలీవుడ్‌లో గ్లామర్ బాంబ్‌లా మారిపోయింది. అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ ఒక సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటూ గ్లోబల్ వైడ్‌గా హీట్ పెంచేస్తోంది. ఈ తెలుగు బ్యూటీ రేంజ్ మేకోవర్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
టాలీవుడ్ టు హాలీవుడ్ జర్నీ:
కాలిఫోర్నియాలోనే పుట్టి పెరిగిన అవంతికా వందనపు, చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు ఇండస్ట్రీలో కొన్నాళ్లు సందడి చేసింది. అయితే, ఆ తర్వాత మళ్లీ అమెరికా వెళ్లి హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెట్టడం ఆమె కెరీర్‌కే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఇక కేవలం గ్లామర్ మాత్రమే కాదు, నటనతోనూ అక్కడ మెప్పిస్తూ ఇండియన్ ప్రైడ్‌గా మారుతోంది.
గ్లోబల్ బ్రేక్ ఇచ్చిన 'మీన్ గర్ల్స్':
డిస్నీ ఛానల్ ఒరిజినల్ మూవీ 'స్పిన్' లో లీడ్ రోల్ సాధించి హిస్టరీ క్రియేట్ చేసిన అవంతిక, ఆ తర్వాత 'మీన్ గర్ల్స్' అనే మ్యూజికల్ కామెడీ చిత్రంలో 'కరెన్ షెట్టి' అనే ప్రముఖ పాత్రలో నటించింది. ఇక ఈ సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్‌గా ఈమెకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 'టారోట్' అనే సూపర్ నేచురల్ హారర్ చిత్రంలో 'పెయిజ్' అనే పాత్రలో భయపెట్టి ఆకట్టుకుంది.
ఓటీటీలోనూ టాప్ స్పాట్:
రీసెంట్‌గా ఈమె మిండీ కాలింగ్ క్రియేట్ చేసిన హులు సిరీస్ ‘నాట్ సూటబుల్ ఫర్ వర్క్’ లో నటించింది. ఈ సిరీస్‌లో ఆమె ‘అభినయ అబ్బి చిలుకూరి’ అనే స్టైలిస్ట్ క్యారెక్టర్‌లో మెప్పించగా ఇది స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో టాప్ స్పాట్‌లో నిలిచింది. ఇక ఈ సక్సెస్ జోష్‌లోనే డిస్నీల్యాండ్‌లో సందడి చేస్తూ ఇన్ స్టాగ్రామ్‌లో కొన్ని హాట్ అండ్ స్టైలిష్ పిక్స్ షేర్ చేయగా అవి కాస్తా వైరల్ అయ్యాయి.
తెలుగు తెరపై చిన్న చిన్న రోల్స్ చేసిన ఈ అమ్మాయి, ఇప్పుడు హాలీవుడ్‌లో హీరోయిన్‌గా మెరిసి, ఇంటర్నేషనల్ స్థాయిలో క్రేజ్ సంపాదించింది. ఇక అవంతికా వందనపు మేకోవర్ చూస్తుంటే, ముందు ముందు హాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి స్టార్ హీరోయిన్‌గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు..
