Begin typing your search above and press return to search.

ఆ బుక్ లో అంత పవర్ ఉందా..? తేజ్ ఎందుకలా చెప్పాడు..?

ఇక తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పి.. ఆఫ్టర్ యాక్సిడెంట్ స్పీచ్ థెరపీ తీసుకోవాల్సి వచ్చిందని.. బుక్ రీడింగ్ కూడా చేస్తానని అన్నారు తేజ్.

By:  Ramesh Boddu   |   12 Oct 2025 9:51 AM IST
ఆ బుక్ లో అంత పవర్ ఉందా..? తేజ్ ఎందుకలా చెప్పాడు..?
X

ఫాస్ట్ అండ్ క్యూరియస్ ది ఆటో ఎక్స్ పో 2025లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ స్టూడెంట్స్ తో ఒక స్పెషల్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన జీవిత పాఠాలను వాళ్లకు చెప్పారు. మెగా బ్యాక్ గ్రౌండ్ ఉంది కదా అని ఆయనకు అవకాశాలు రాలేదని. మొదట తాను ఎవరన్నది చెప్పకుండా ఫోటోలు పట్టుకుని సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరిగానని అన్నారు తేజ్. ఐతే తన ఫోటోలు పల్లీల పొట్లాల్లా వాడుకునే వారని చెప్పారు.

బ్యాక్ గ్రౌండ్ ఉన్నంత మాత్రాన..

ఒకసారి మంచు మనోజ్ ఆఫీస్ లో వైవీఎస్ చౌదరి చూసి హీరోగా చేస్తావా అని అడిగారు.. నేను చేస్తా అనేసరికి నా గురించి మొత్తం డీటైల్స్ అడిగారు. ఇలా చిరంజీవి గారి మేనల్లుడు అని చెబితే ఆయన వెళ్లి వాళ్లతో మాట్లాడి సినిమా ఓకే చేశారు. బ్యాక్ గ్రౌండ్ ఉన్నంత మాత్రాన అవకాశాలు వస్తాయన్న రూల్ ఏమి లేదు. కచ్చితంగా కష్టపడాల్సిన అవసరం ఉంది. అలా కష్టపడితేనే కెరీర్ బాగుంటుందని అన్నారు తేజ్.

ఇక తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పి.. ఆఫ్టర్ యాక్సిడెంట్ స్పీచ్ థెరపీ తీసుకోవాల్సి వచ్చిందని.. బుక్ రీడింగ్ కూడా చేస్తానని అన్నారు తేజ్. మార్నింగ్ ఎప్పటిలానే 5కి లేచి వర్క్ అవుట్ చేస్తాను. ఐతే స్టూడెంట్స్ కి నా రిక్వెస్ట్ ఒక్కటే.. ది పవర్ ఆఫ్ నౌ అనే బుక్ చదవండి.. ఎకాట్ టోల్ రాసిన బుక్ అది.. ప్రస్తుతం యొక్క పవర్ ఏంటన్నది అందులో ఉంటుంది. అది చాలా యూజ్ ఫుల్ అవుతుందని అన్నారు.

హాస్పిటల్ బెడ్ మీద చిల్ అవుతున్నా అని చెప్పే వాడిని..

తనకు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టమని చెప్పారు తేజ్. ఈవెనింగ్ స్పోర్ట్స్ కూడా ఆడుతానని అన్నారు. బైక్ మీద వెళ్లేప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని.. హెల్మెట్ లేకుండా బైక్ మీద ప్రయాణం అసలు మంచిది కాదని అన్నారు తేజ్. ప్రతి విషయాన్ని తాను చాలా క్యాజువల్ గా తీసుకుంటా.. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు ఎవరైనా వస్తే ఇక్కడ చిల్ అవుతున్నా అని చెప్పే వాడినని అన్నారు తేజ్. సీరియస్ సిచ్యువేషన్ లో కూడా నవ్వే వ్యక్తిని.. హాస్పిటల్ లో కాలు మీద కాలేసుకుని కూర్చోవడానికి వెళ్లానని వచ్చిన వాళ్లతో చెప్పానని అన్నారు తేజ్.

తన స్వీయ అనుభవాలు చెబుతూ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఆటో ఎక్స్ పోలో స్టూడెంట్స్ కి ఒక మంచి అనుభూతిని కలిగించారు తేజ్. ఆటో ఎక్స్ పోలో భాగంగా తేజ్ అలా బైక్ మీద హెల్మెట్ పెట్టుకుని అలా చిన్న రైడ్ కూడా చేశారు.