ఆరా ఆఫ్ ఉస్తాద్ లిరిక్: చంద్రబోస్ మార్క్ మరోసారి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న `ఉస్తాద్ భగత్ సింగ్` నుండి విడుదలైన `ఆరా ఆఫ్ ఉస్తాద్` సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.
By: Sivaji Kontham | 22 Feb 2026 8:15 PM ISTపవర్ స్టార్ పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న `ఉస్తాద్ భగత్ సింగ్` నుండి విడుదలైన `ఆరా ఆఫ్ ఉస్తాద్` సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. నాటు నాటు (ఆర్.ఆర్.ఆర్)తో ఆస్కార్ ని అందించిన ప్రఖ్యాత లిరిసిస్ట్ `చంద్రబోస్` తన కలం నుండి జాలువారిన అద్భుతమైన పదాలతో ఈ పాటను అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దారు. మరోసారి బోస్ మార్క్ పదజాలం మాయాజాలం చేస్తోంది. అభిమానుల్లో ఒకరకమైన ఉద్విగ్నతను పెంచుతోంది ఈ పాట.
ఆరా ఆఫ్ ఉస్తాద్ -లిరిక్స్ ని గమనిస్తే...
మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే..!!
జుట్టెగురుతుంటే ఇక దడదడ పిడుగులు పడినట్టే..
మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే..!!
జుట్టెగురుతుంటే ఇక దడదడ పిడుగులు పడినట్టే..
...............................
........................
చిరునవ్వుతో చించేస్తాడు..
కనుసైగతో కాల్చేస్తాడు..
చిటికెలతో చెడుగుడు చెడుగుడు ఆడే రకం..
.....
.......
మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదు నువ్వు..
బండరాళ్లను బద్ధలు గొట్టిన గట్టి ఆయుధం నువ్వు..
ఇలాంటి అరుదైన పవర్ ఫుల్ పదజాలాన్ని చంద్రబోస్ తన సాహిత్యంలో ఉపయోగించారు.
మరోసారి చంద్రబోస్ తన కలం బలం చూపించారు. పవర్ స్టార్ రేంజుకు తగ్గట్టే పవర్ ప్యాక్డ్ పంచ్ లైన్లతో ఈ లిరిక్ ఆద్యంతం రక్తి కట్టించారు. చంద్రబోస్ ఈ పాటలో పవన్ కల్యాణ్ పోషించిన భగత్ సింగ్ పాత్ర వ్యక్తిత్వాన్ని ఆరాను చాలా లోతుగా విశ్లేషించారు. పవన్ కల్యాణ్ మ్యానరిజాన్ని దీనికి జోడించి రాసిన విధానం ఆకట్టుకుంది.
దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన బీట్స్, చంద్రబోస్ భావోద్వేగపూరితమైన సాహిత్యం ఈ పాటను కేవలం హీరోయిజాన్ని ఎలివేట్ చేయడమే కాకుండా, ఒక పవర్ ఫుల్ యాంథమ్ లా మార్చేశాయి. సాహిత్యానికి తగ్గట్టే మరోసారి దేవీశ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్ ని అందించారు.
ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. క్లైమాక్స్ చిత్రీకరణ గత సెప్టెంబర్‌లోనే ముగిసింది. ప్రస్తుతం సినిమా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. జనవరి నుంచే డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. హీరోయిన్ రాశీ ఖన్నా కూడా తన పార్ట్ డబ్బింగ్‌ను ఫిబ్రవరిలో పూర్తి చేశారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సమ్మర్ కానుకగా వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద `గబ్బర్ సింగ్` సహా `ఓజీ` రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ నటుడు ఆర్. పార్తీబన్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (డిఎస్పీ) సంగీతం అందిస్తున్నారు. ఆరా ఆఫ్ ఉస్తాద్ పాటను ఆస్కార్ విజేత చంద్రబోస్ రచించారు.
నేను మెడ ముట్టుకుంటే.. తొడ కొట్టినట్టే! అనే డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. పవన్ మానియా మళ్ళీ పీక్స్‌కి చేరుకుంది.
