Begin typing your search above and press return to search.

నేడు థియేటర్లలో విడుదలైన చిత్రాలు.. మరి ఓటీటీలో?

శుక్రవారం వచ్చిందంటే చాలు అటు థియేటర్లు ఇటు ఓటీటీలు కొత్త కొత్త చిత్రాలతో సందడి చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే.

By:  Madhu Reddy   |   21 Aug 2026 9:43 AM IST
నేడు థియేటర్లలో విడుదలైన చిత్రాలు.. మరి ఓటీటీలో?
X

శుక్రవారం వచ్చిందంటే చాలు అటు థియేటర్లు ఇటు ఓటీటీలు కొత్త కొత్త చిత్రాలతో సందడి చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా ఏదైనా పండుగ దినాలు వచ్చాయంటే ఇక ఆరోజు విడుదలయ్యే చిత్రాలకు కలెక్షన్లు భారీగా వస్తాయి. ఇకపోతే నేడు వరలక్ష్మీ వ్రతం ఈ సందర్భంగా నేడు థియేటర్లో విడుదలయ్యే చిత్రాలతో పాటు ఓటీటీలో సందడి చేయబోతున్న చిత్రాల జాబితా కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

థియేటర్లలో మాస్ జాతర సృష్టిస్తున్న చిత్రాలు..

వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆగస్టు 21వ తేదీన థియేటర్లలో సందడి చేస్తున్న చిత్రాల విషయానికొస్తే మాస్ మహారాజా ఇరుముడి, ది రెడ్ బ్యాగ్, అమీర్ లోగ్ వంటి తెలుగు చిత్రాలతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రేక్షకులను అలరించడానికి సెవెన్ డాగ్స్ మూవీ కూడా నేడు రిలీజ్ అయింది. ముఖ్యంగా ఇందులో మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది .

పైగా ఈరోజు సెలవు కూడా కావడంతో థియేటర్లలో మాస్ జాతర సృష్టించడం ఖాయమంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఓటీటీ లో అలరిస్తున్న చిత్రాలు..

ఓటీటీల విషయానికి వస్తే. ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు విడుదలయ్యాయి. అందులో 14 సినిమాలు చాలా స్పెషల్ గా ఉంటే.. ప్రత్యేకించి తెలుగులో ఐదు చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి జియో హాట్ స్టార్ , ఈటీవీ విన్, నెట్ ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్, జి ఫైవ్ లలో ఓటిటి స్ట్రీమింగ్ అవుతున్న ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..

నెట్ ఫ్లిక్స్: తెలుగు డబ్బింగ్ నుండి క్రైమ్ యాక్షన్ వరకు..

'ప్యార్ ప్రేమ కళ్యాణం' అనే తమిళ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ చిత్రం ఇప్పుడు తెలుగు డబ్బింగ్ లో నేడు ఓటిటి వేదికగా అందుబాటులోకి వచ్చేసింది. అలాగే 'ఫేసింగ్ ఎల్ చాపో' కూడా నేడు ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

అమెజాన్ ప్రైమ్: కామెడీ క్రైమ్ థ్రిల్లర్ టు యానిమేషన్ ఫాంటసీ ఫ్యామిలీ డ్రామా..

అమెజాన్ ప్రైమ్ లో హిందీ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'క్లీనప్ కంపెనీ' నేడు స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ముఖ్యంగా ఇదే వెబ్ సిరీస్ అటు ఎంఎక్స్ ప్లేయర్ లో కూడా అందుబాటులో ఉండడం గమనార్హం. అలాగే తమిళ్ హారర్ సైకాలజికల్ మిస్టరీ మూవీ 'డార్క్' కూడా నేడు స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఇక దీంతోపాటు కొరియన్ యానిమేషన్ ఫాంటసీ ఫ్యామిలీ కామెడీ వెబ్ సిరీస్ 'సూపర్ వింగ్స్ సీజన్ 21 ' కూడా ఆగస్టు 21న స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

జీ 5:

జి ఫైవ్ లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి చివరి మూవీ 'జననాయగన్ ' స్ట్రీమింగ్ కి రాగా.. అటు హిందీ ఫ్యామిలీ సైన్స్ ఫిక్షన్ కామెడీ ఫిలిం అయిన 'ది గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో: ఏలియన్స్ కా ఆగ్ మ్యాన్' మూవీ కూడా ఓటిటి స్ట్రీమింగ్ కి వచ్చింది.

జియో హాట్ స్టార్ విషయానికి వస్తే.. హిందీ కామెడీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'వెల్కం టు ది జంగిల్', ఇంగ్లీష్ కామెడీ ట్రావెల్ టాప్ షో 'కొనన్ ఓ బ్రియన్ మస్ట్ గో ' సినిమా స్ట్రీమింగ్ కి వచ్చింది.

మరొకవైపు సోనీ లైవ్ లో తెలుగు రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా 'చెన్నై లవ్ స్టోరీ' కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసింది.