స్టార్ డైరెక్టర్ తో విలక్షణ నటుడు!
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో సినిమాలు చేయడానికి ఎంత మంది దర్శకులు క్యూలో ఉన్నారో చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 15 Nov 2025 3:00 PM ISTమక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో సినిమాలు చేయడానికి ఎంత మంది దర్శకులు క్యూలో ఉన్నారో చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్ నుంచి టాలీవుడ్, బాలీవుడ్ సైతం అతడితో పని చేయడానికి సిద్దంగా ఉన్నారు. గ్రేట్ పెర్పార్మర్ కావడంతో? తమ సినిమాల్లో ఎలాగైనా భాగం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ విజయ్ మాత్రం మునుపటిలా కమిట్ అవ్వడం లేదు. సొంత భాషలో మినహా ఇతర భాషల్లో కొన్ని రకాల పాత్రలకు దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయంతో ఆ రోల్స్ భర్తీ కావడం లేదు. దీంతో దర్శకులు ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తోంది.
కానీ సేతుపతి మాత్రం తాను నమ్మిన స్వభాషా దర్శకులకు అవకాశాలివ్వడంలో మాత్రం పెద్దగా ఆలోచించడం లేదు. తాజాగా మరోసారి మూడవసారి బాలాజీ తరణీధరన్ తో పని చేయడానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. గతంలో ఇద్దరి కాంబినేషన్ లో రెండు సినిమాలు తెరకెక్కాయి. రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. ఆ నమ్మకంతోనే మక్కల్ సెల్వన్ మూడవ సారి ఛాన్స్ ఇవ్వడంలో పెద్దగా ఆలోచించలేదు. అసలు విషయం ఏంటంటే? ఈ సినిమా లాంచింగ్ కూడా పూర్తయిందంటున్నారు. సెట్స్ లో ఉందని మరికొంత మంది నుంచి అందుతోన్న సమాచారాం.
హీరోయిన్ ఛాన్స్ అలా:
మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే? ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది స్టార్ డైరెక్టర్ అట్లీ అని ప్రచారం జరుగుతోంది. విజయ్ ఇమేజ్ కు తగ్గ పర్పెక్ట్ స్టోరీ కావడంతో బాలాజీ తాను అనుకున్న విధంగా తీస్తాడు? అన్న నమ్మకంతో అట్లీనే తానే నిర్మిస్తానని ముందకొచ్చాడుట. వాస్తవానికి ఈ చిత్రానికి విజయ్ మరో నిర్మాతను అనుకున్నారట. కానీ అట్లీ ముందుకు రావడంతో? ఆయన మాట కాదనలేక అంగీకరించినట్లు వినిపిస్తోంది. ఇందులో హీరోయిన్ ఎంపిక కూడా గమ్మత్తుగా జరిగినట్లు తెలుస్తోంది. తొలుత కేవలం తమిళ నాయికనే తీసుకోవాలనుకున్నారట. పాత్ర పరంగా స్థానిక నటి అయితే బాగుంటుందనే ఆలోచనతో అలా ప్లాన్ చేసారుట. కానీ స్థానిక నటి కంటే బెటర్ గా మలయాళం నటి లిజోమోల్ జోస్ ఎంపికైంది. `జైభీమ్` లో సినతల్లి పాత్రతో లిజోమోల్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
తెలుగులోనూ బిజీగా:
ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక సమాచారం త్వరలో బయటకు రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం అట్లీ తెలుగులో కూడా ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాధ్ ఆ సినిమాకు దర్శకుడిగా పనిచేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లోనూ ఇదే తొలి సినిమా. పూరి ప్లాప్ ల్లో ఉన్నా? అతడు హీరో విజయ్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పూరి స్టోరీ పరంగా కొత్తగా తీసుకున్నాడు? అన్న అంశం ఆసక్తికరంగా మారింది. మరి ఈ రెండు సినిమాలు విజయ్ కు ఎలాంటి బ్రేక్ నిస్తాయో చూడాలి.
