బన్నీ సినిమా షూటింగ్లో బిజీ.. గుడ్ న్యూస్ చెప్పిన అట్లీ!
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న అట్లీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
By: Madhu Reddy | 20 Jan 2026 6:12 PM ISTకోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న అట్లీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీలోకి రాకముందు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఈయ.. తొలిసారి ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించిన 'రాజా రాణి' చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇందులో తన అద్భుతమైన టేకింగ్ కి విజయ్ అవార్డును అందుకున్నారు. అంతేకాదు ఉత్తమ నూతన దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా మరింత పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు అట్లీ.
ఒక్క సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన ఈయన.. తన సినిమాలతో అటు తమిళ్ ఇటు తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. విజయ్ తో తేరి , మెర్సల్, బిగిల్ అంటూ మూడు చిత్రాలతో హ్యాట్రిక్ అందుకున్న అట్లీ , బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో జవాన్ సినిమాకి దర్శకత్వం వహించి , మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. అలాంటి ఈయన ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ మూవీలకు పని చేసిన వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయి. ముఖ్యంగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా.. రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ఇలా ఒకవైపు బన్నీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఈయన.. తాజాగా అభిమానులతో మరో శుభవార్తను పంచుకున్నారు. విషయంలోకి వెళ్తే.. సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టిన అట్లీ..మా ఇంట్లోకి మరో చిన్నారి రాకతో మా సంతోషం రెట్టింపు కాబోతోంది. మేము మళ్ళీ తల్లిదండ్రులం కాబోతున్నాము. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాము.. మీ దీవెనలు మాపై ఎప్పుడూ ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.. ప్రేమతో అట్లీ..ప్రియా.. మీర్.. బెక్కీ.. యుకీ.. చోకీ.. కాఫీ.. గూఫీ అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఇదే విషయాన్ని అటు ప్రియా కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.
అలాగే తన భార్య ప్రియా బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. ఇక తన పెట్ డాగ్స్ తో పాటు తన కొడుకు మీర్ తో కలిసి ఉన్న ఫోటోలను అట్లీ షేర్ చేశారు. కాగా 2014లో ప్రియాను వివాహం చేసుకున్నారు అట్లీ. అయితే 8 ఏళ్ల నిరీక్షణ తర్వాత 2023 జనవరిలో మొదటి సంతానంగా కొడుకు జన్మించారు. ఈ అబ్బాయికి మీర్ అని నామకరణం చేశారు. ఇక రెండేళ్ల విరామం తర్వాత ఇప్పుడు మళ్ళీ తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించింది ఈ జంట. ప్రస్తుతం ప్రియా బేబీ బంప్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. డైరెక్టర్ అట్లీ జంటకి అటు సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
