ఆస్కార్ వేదికపై తమిళ్... 'రాకా'తో సాధ్యమా?
రాకా సినిమాతో ఆస్కార్ అవార్డ్ దక్కించుకుని కచ్చితంగా ఆస్కార్ వేదికపై తమిళ్ లో మాట్లాడుతాను అని, ప్రతి ఒక్క తమిళులు గర్వించే విధంగా ఆస్కార్ వేదికపై తమిళ్ గొప్పతనంను చెప్తాను అని అట్లీ పేర్కొన్నాడు.
By: Ramesh Palla | 6 Oct 2026 12:15 PM ISTఆస్కార్ అవార్డ్‌లు కేవలం హాలీవుడ్ సినిమాలకే అని ఒకప్పుడు అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ సైతం ఆస్కార్ కి ఆస్కారం ఉందంటూ తమ సినిమాల గురించి చెప్పుకుంటూ ఉన్నారు. ప్రతి ఏడాది ఆస్కార్‌కి ఇండియన్ సినిమాలను పంపించడం, అవి ఒట్టి చేతులతో రావడం ఇంతకు ముందు పరిపాటి అయింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇండియన్ సినిమా స్థాయి హాలీవుడ్ సినిమాల రేంజ్‌లో ఉంది. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కించుకున్న విషయం తెల్సిందే. ప్రయత్నిస్తే పోయేది ఏం లేదు, కష్టపడితే ఆస్కార్ వచ్చినా ఆశ్చర్యం లేదు అన్నట్లుగా ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ ఆస్కార్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రాకా సినిమాకు ఆస్కార్ ఆస్కారం ఉందని అట్లీ నమ్మకంగా ఉన్నాడు.
ఇండియన్ సినిమాకు ఆస్కార్...
రాజమౌళి ఇండియాకు ఆస్కార్ తీసుకు వచ్చిన తర్వాత చాలా మంది ఆస్కార్ పై దృష్టి పెట్టారు. తప్పకుండా ఆస్కార్ దక్కుతుంది అంటూ కొన్ని సినిమాల మేకర్స్ ఆశలు పెట్టుకున్నారు. తాజాగా దర్శకుడు అట్లీ ఒక చిట్ చాట్‌లో మాట్లాడుతూ రాకా సినిమాతో ఆస్కార్ అవార్డ్‌ను అందుకుంటాను అని ధీమా వ్యక్తం చేశాడు. ఇటీవల అత్యధిక కెమెరాలతో మోషన్ క్యాప్చర్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ను సొంతం చేసుకున్న రాకా టీం కచ్చితంగా ఆస్కార్ వేదికపై కూడా సత్తా చాటబుతోందనే నమ్మకంను అట్లీ వ్యక్తం చేశాడు. ఆస్కార్ గెలవడం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అట్లీ పేర్కొన్నాడు. ఆస్కార్ అవార్డ్ దక్కించుకోవాలి అనేది తన డ్రీమ్ అని, దాన్ని నిజం చేసుకోవడం కోసం రాకా సినిమాతో చాలా కష్టపడుతున్నట్లుగా పేర్కొన్నాడు. అందరి మద్దతు, సహకారంతో నా కలను సాకారం చేసుకోబోతున్నట్లు పేర్కొన్నాడు.
దర్శకుడు అట్లీ ఆస్కార్ డ్రీమ్..
రాకా సినిమాతో ఆస్కార్ అవార్డ్ దక్కించుకుని కచ్చితంగా ఆస్కార్ వేదికపై తమిళ్ లో మాట్లాడుతాను అని, ప్రతి ఒక్క తమిళులు గర్వించే విధంగా ఆస్కార్ వేదికపై తమిళ్ గొప్పతనంను చెప్తాను అని అట్లీ పేర్కొన్నాడు. రాకా సినిమాతో కాకుండా తన తదుపరి సినిమాతో అయినా ఆ డ్రీమ్ ను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను అని, తన కెరీర్‌లో ఒక్కసారి అయినా ఆస్కార్ వేదికపైకి ఎక్కుతాను అని అట్లీ నమ్మకం వ్యక్తం చేశాడు. ఆస్కార్ అకాడమీ వేదికపై తమిళంలో మాట్లాడటం తన డ్రీమ్ అని అట్లీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అట్లీ ఆస్కార్ అకాడమీ వేదిక ఎక్కితే తమిళ్ జనాలు మాత్రమే కాకుండా మొత్తం ఇండియన్స్ గర్విస్తారు. కనుక ఆయన డ్రీమ్ నెరవేరాలని, ఇండియాకు తమిళ సినిమాతో ఆస్కార్ అవార్డ్ రావాలని సగటు సినీ ప్రేమికుడు కోరుకుంటున్నాడు.
అల్లు అర్జున్ రాకా మూవీ...
అల్లు అర్జున్, అట్లీల కాంబోలో రూపొందుతున్న 'రాకా' సినిమాకు వస్తే విజువల్ వండర్‌గా ఉండబోతుందనే విశ్వాసంను వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల కాబోతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ అత్యధిక వసూళ్లతో రికార్డ్‌లు బ్రేక్ చేయడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే రాకా సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా అట్లీ ఫిల్మ్ మేకింగ్ ఉంది. వెయ్యి కోట్ల జవాన్ సినిమా తర్వాత అట్లీ నుంచి రాబోతున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకునే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించడం, మరికొందరు ముద్దుగుమ్మలు కీలక పాత్రల్లో నటించడం తో అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు.
