Begin typing your search above and press return to search.

అట్లీ కుమారుని పేరు వెన‌క అంత క‌థ ఉందా?

అయితే అట్లీ త‌న కుమారుడికి మీర్ అనే పేరు పెట్ట‌డానికి కార‌ణ‌మేమిటో అభిమానులు ఇంట‌ర్నెట్ లో వెతుకుతున్నారు.

By:  Sivaji Kontham   |   31 Dec 2025 4:00 PM IST
అట్లీ కుమారుని పేరు వెన‌క అంత క‌థ ఉందా?
X

కొంద‌రి ఆలోచ‌న‌లు.. కొంద‌రి కెరీర్ గ్రాఫ్... ఊహాతీతంగా ఉంటుంది. లైఫ్ జ‌ర్నీ కేక్ వాక్ లా మారుతుంది. అయితే అలా మారడానికి ముందు చాలా శ్ర‌మ‌, క్రియేటివిటీని పెట్టుబ‌డి పెట్టాల్సి ఉంటుంది. అలాంటి ప్ర‌యాణం అట్లీ కుమార్ కి ఉంది. అత‌డు ఏ.ఆర్.మురుగ‌దాస్, శంక‌ర్ వంటి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుల వ‌ద్ద స‌హాయ‌కుడిగా ప‌ని చేసాడు. రాజా రాణి సినిమాతో ద‌ర్శ‌కుడు అయ్యాడు. ఆ త‌ర్వాత ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో వ‌ర‌స బ్లాక్ బ‌స్ట‌ర్లు తెర‌కెక్కిస్తూ, మోస్ట్ వాంటెడ్ ద‌ర్శ‌కుల జాబితాలో చేరాడు. భార‌త‌దేశంలో అప‌జ‌య‌మెరుగ‌ని ద‌ర్శ‌కుల జాబితాలో రాజ‌మౌళి త‌రవాత అట్లీ పేరే వినిపిస్తోంది.

థెరి, మెర్సల్, బిగిల్, జవాన్ వంటి క‌మ‌ర్షియ‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్లు తెర‌కెక్కించాడు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు తీసినా సామాజికంగా ఆలోచింప‌జేసే ఏదో ఒక ఎలిమెంట్ ని త‌న సినిమాల్లో చూపిస్తూ, త‌న గురువు మురుగ‌దాస్ ని కూడా గుర్తు చేస్తుంటాడు. ఇక వ్య‌క్తిగ‌త జీవితంలోను అట్లీ ఎంతో హ్యాపీగా ఉన్నాడు. అట్లీ కుమార్ 2023లో ఒక మగబిడ్డకు తండ్రి అయ్యాడు. అట్లీ-ప్రియా దంప‌తుల‌కు జ‌న్మించిన‌ బిడ్డకు 'మీర్' అనే పేరు పెట్టారు. ఇప్ప‌టికే ఈ బిడ్డ జ‌న్మించి రెండేళ్ల‌యింది.

అయితే అట్లీ త‌న కుమారుడికి మీర్ అనే పేరు పెట్ట‌డానికి కార‌ణ‌మేమిటో అభిమానులు ఇంట‌ర్నెట్ లో వెతుకుతున్నారు. అయితే మీర్ అనే పేరు వెన‌క చాలా అర్థం ప‌ర‌మార్థం ఉంది. ఈ పేరు ప్రధానంగా అరబిక్ - పర్షియన్ భాషా సంప్రదాయాల నుండి ఉద్భవించింది. ఈ పేరుకు అర్థం- యువరాజు. పాలకుడు, కమాండర్ లేదా నాయకుడు అనే అర్థం కూడా వ‌స్తుంది. అధికారి లేదా పాల‌కుడిని స్ఫుర‌ణ‌కు తెస్తుంది. సంస్కార‌వంత‌మైన వాడు, త్రిక‌ర‌ణ శుద్ధి క‌ల‌వాడు అనే అర్థం కూడా వ‌స్తుంది. న్యాయ‌స్థానాలు, పాల‌నా వ్య‌వ‌స్థ‌లో అధికారం లేదా బాధ్యతను కలిగి ఉన్న వ్యక్తులతో ముడిపడిన పేరు ఇది. ఇలాంటివి దక్షిణాసియాలో భారతదేశం- పాకిస్తాన్‌లో వినిపిస్తాయి. భక్తి, పాండిత్యం క‌లిగి ఉన్న వ్య‌క్తులుగాను మీర్ అనే పేరును చూడాలి. మీర్ అనేది నాయకత్వ లక్షణాలు, జ్ఞానం, నైతిక స్థాయిని చూపించిన వ్యక్తులకు ఇచ్చే బిరుదు.

కవిత్వం, సాహిత్యంలోను మీర్ కు ప్ర‌త్యేక స్థానం ఉంది. తెలివితేటలు, మోడ్ర‌న్ గా అనిపించే పేరు కూడా ఇది.

ఈ పేరు అందంగా సింపుల్ గా ఏ భాషా వ్య‌క్తులు అయినా సులువుగా పిలుచుకోగ‌లిగే పేరు. నిజానికి అట్లీ అభిరుచితో ఈ ఎంపిక చేసుకోవ‌డం అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. మీర్ అనే పేరు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. అర‌బిక్ - ప‌ర్షియ‌న్ తో పాటు ఈ ప్రత్యేకమైన పేరు మొత్తం దక్షిణాసియా చరిత్రకు చాలా ముఖ్యమైనది.

అట్లీ ప్ర‌స్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా భారీ సైన్స్ ఫిక్ష‌న్ సినిమాని రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. సోషియో ఫాంట‌సీ జాన‌ర్ లో ఇది అద్భుత‌మైన విజువ‌ల్ గ్రాఫిక్స్ , యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో ర‌క్తి క‌ట్టించ‌నుంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రంలో దీపిక ప‌దుకొనే క‌థానాయిక‌గా న‌టిస్తోంది.