బన్నీ- అట్లీ ఎన్ని దేశాల్లో ప్లాన్ చేసారు!
ఈ సినిమాకు పోటీగా ఉన్న మరో భారతీయ చిత్రం ఏదైనా ఉందా? అంటే అదీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమే.
By: Srikanth Kontham | 3 March 2026 4:00 PM ISTసూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'వారణాసి' చిత్రం పాన్ వరల్డ్ లోనే రిలీజ్ అవుతుంది. ఈ చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో రిలీజ్ చేయాలన్నది రాజమౌళి ప్లాన్. దీనిలో భాగంగా గ్లోబల్ ఇమేజ్ ఉన్న ప్రియాంక చోప్రాను ఏరికోరి మరీ తీసుకున్నారు. దాదాపు 120 దేశాల్లో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు దాదాపు కన్పమ్ అయింది. ఇంత వరకూ ఇన్ని దేశాల్లో ఏ భారతీయ చిత్రం రిలీజ్ అవ్వలేదు. ఈ 120 దేశాల్లో ఎన్నో కొత్త దేశాలున్నాయి. ఈసినిమా విజయం సాధిస్తే గనుక ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగానూ సరికొత్త రికార్డు నమోదవుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు 'వారణాసి'కి దక్కుతుంది. ఈసినిమాకు పోటీగా ఉన్న మరో భారతీయ చిత్రం ఏదైనా ఉందా? అంటే అదీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమే. ఈ చిత్రాన్ని అట్లీ టెక్నికల్ గా హైలైట్ చేస్తున్నాడు. ఇందులో బన్నీ నాలుగు విభిన్న పాత్రలు పోషిస్తున్నాడు. హీరో కం విలన్ గా బన్నీ అనే ప్రచారం జరుగుతోంది. ఇదొక పార్లల్ యూనివర్స్ కథ. అందుకే ఈ చిత్రాన్ని అట్లీ ఇంటర్నేషనల్ మార్కెట్ కి కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. తొలుతు పాన్ ఇండియాకే పరిమితం చేయాలనుకున్నాడు.
కానీ స్టోరీ స్పాన్ చూసి గ్లోబల్ స్థాయికి అన్ని రకాలుగా అర్హత సాధించిన చిత్రంగా భావించి ముందుకెళ్తున్నాడు. ఈ సినిమా కోసం అట్లీ పగలు రాత్రి తేడా లేకుండా పని చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనుల దగ్గర నుంచి అట్లీ శ్రమ కనిపిస్తుంది. పూర్తిగా ఈ సినిమాకే సమయాన్ని కేటాయించి పని చేస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని ఎన్నిదేశాల్లో రిలీజ్ చేస్తారు? అన్నది ఇంత వరకూ ప్రకటించలేదు. భారత్లో మాత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళంతో పాటు, అవకాశం ఉంటే ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది.
విదేశాల పరంగా చూస్తే అమెరికా, కెనడా, యూకే , ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో తప్పక రిలీజ్ అవుతుంది. అలాగే జపాన్, చైనా, రష్యా వంటి ఆసియా మార్కెట్లలో కూడా భారీగా విడుదల చేయనున్నారు. ఇక మిగతా ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ రిలీజ్ చేస్తారు? అన్నది చూడాలి. ఈ సినిమా కంటే ముందే 'వారణాసి' 2027 మార్చిలో 120 దేశాల్లో రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆ సినిమా వరల్డ్ వైడ్ గా ఏ రీజియన్ నుంచి ఎలాంటి వసూళ్లు సాధించింది? అన్న దానిపై క్లియర్ గా తెలుస్తుంది. అటుపై బన్నీ సినిమాను ఎక్కడెక్కడ రిలీజ్ చేస్తే మంచి ఫలితాలు సాధించొచ్చు అన్న దానిపై ఓ ఐడియా ఏర్పడుతుంది. కాబట్టి 'వారణాసి' వరల్డ్ వైడ్ సక్సెస్ అన్నది బన్నీ సినిమాకు ఎంతో కీలకం అని చెప్పొచ్చు.
