ఒక్క యాడ్‌కి రూ.150 కోట్లు ఏంటి భయ్యా?
ఒకప్పుడు కమర్షియల్ యాడ్స్ చాలా సింపుల్‌గా, ప్రాడెక్ట్ గురించి వివరిస్తూ, డైలాగ్స్ చెబుతున్నట్లుగా ఉండేది.
By: Ramesh Palla | 17 Oct 2025 11:09 AM ISTఒకప్పుడు కమర్షియల్ యాడ్స్ చాలా సింపుల్‌గా, ప్రాడెక్ట్ గురించి వివరిస్తూ, డైలాగ్స్ చెబుతున్నట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు మారింది. సినిమాటిక్‌లో యాడ్స్ ఉంటున్నాయి. యాక్షన్‌తో పాటు, రొమాన్స్, కామెడీ ఇలా అన్నింటిని యాడ్స్‌లో చూపించడం ద్వారా మిని మూవీ అన్నట్లుగా రూపొందిస్తున్నారు. ఒకప్పుడు యాడ్ ఫిల్మ్ మేకర్స్ ప్రత్యేకంగా ఉండేవారు. కానీ ఇప్పుడు యాడ్ ఫిల్మ్స్‌ను స్టార్ ఫిల్మ్ మేకర్స్ కూడా తీస్తున్నారు. వేల కోట్ల రూపాయలు వసూళ్లు చేసిన సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకులు యాడ్ ఫిల్మ్స్ ను రూపొందిస్తున్నారు. వందల కోట్ల బడ్జెట్ మూవీలు తీసే నిర్మాతలను యాడ్ ఫిల్మ్స్ తీయమంటే అదే స్థాయి బడ్జెట్ కోరడం కామన్ విషయం. ఇప్పుడు ఒక యాడ్ ను ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్‌తో తీసేందుకు ప్రముఖ దర్శకుడు అట్లీ రెడీ అయ్యాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రముఖంగా చర్చ జరుగుతోంది.
అట్లీ దర్శకత్వంలో ఒక భారీ కమర్షియల్ యాడ్
మొదట రణ్వీర్ సింగ్, శ్రీలీల, బాబీ డియోల్‌లు ముఖ్య పాత్రల్లో అట్లీ దర్శకత్వంలో ఒక భారీ, మెగా ప్రాజెక్ట్ పట్టాలెక్కింది అనే వార్తలు వచ్చాయి. అదేంటి అట్లీ ఇప్పటికే అల్లు అర్జున్ సినిమాను మొదలు పెట్టాడు కదా, వీరితో మళ్లీ సినిమా ఏంటని చాలా మంది షాక్ అయ్యారు. కానీ అసలు విషయం ఏంటి అంటే అది ఒక కమర్షియల్ యాడ్, అది కూడా రూ.150 కోట్లతో రూపొందుతున్న యాడ్ అని సమాచారం అందుతోంది. సాధారణంగా పదుల కోట్లతో యాడ్ తీయడమే చాలా పెద్ద విషయం. అలాంటిది ఏకంగా రూ.150 కోట్లతో యాడ్ అంటే ఖచ్చితంగా చిన్న విషయం కాదు. కమర్షియల్ యాడ్‌కు అంత ఖర్చు చేస్తున్నారంటే ఆ కంపెనీ స్థాయి ఏంటో అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు యాడ్‌కు సంబంధించిన లీక్స్ మాత్రమే బయటకు వస్తున్నాయి. అధికారికంగా ఆ యాడ్ ఎప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రణ్వీర్ సింగ్, శ్రీలీల జంటగా
దీపావళి సందర్భంగా ఆ కమర్షియల్ యాడ్ గురించి అన్ని విషయాలు బయటకు వస్తాయని బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు. శ్రీలీల, బాబీ డియోల్‌లు తమ ఇన్‌స్టా వాల్స్ పై ఇందుకు సంబంధించిన పోస్ట్‌లు, పోస్టర్స్ షేర్ చేశారు. ఈ యాడ్ నిర్మాణం కోసం భారీ ఎత్తున ఎందుకు ఖర్చు అయింది, అంతగా ఈ యాడ్‌లో ఏం ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా స్టార్స్ కమర్షియల్ యాడ్స్ లో నటించేందుకు పదుల సంఖ్య కోట్లలో పారితోషికం తీసుకుంటారు అనే టాక్ ఉంది. ఈ సినిమాకు ముగ్గురు స్టార్స్ కలిపి భారీ మొత్తమే పారితోషికంగా తీసుకుని ఉంటారు. అయినా కూడా రూ.150 కోట్ల బడ్జెట్ అంటే చాలా పెద్ద విషయం అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం. అందుకే ఈ యాడ్ ఏంటి, ఎలా ఉంటుంది అనే విషయం బాలీవుడ్ వర్గాల వారిలో, మీడియా సర్కిల్స్‌లోనూ ఆసక్తి రేకెత్తించింది అనడంలో సందేహం లేదు.
బాబీ డియోల్ ముఖ్య పాత్రలో కమర్షియల్ యాడ్
రణ్వీర్ సింగ్ గతంలో ఎన్నో యాడ్స్ లో నటించాడు, శ్రీలీల సైతం యాడ్స్‌కి కొత్తేం కాదు, ఇక బాబీ డియోల్ ఈ మధ్య యాడ్స్ లో కనిపిస్తున్నారు. ఈ ముగ్గురు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తారో లేదో తెలియదు కానీ, ఖచ్చితంగా ఈ ముగ్గురి కాంబో యాడ్ కి మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. ఈ కమర్షియల్ యాడ్ కోసం అంతర్జాతీయ స్థాయి వీఎఫ్‌ఎక్స్ కంపెనీ వీఎఫ్‌ఎక్స్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా అన్ని విధాలుగా ఈ యాడ్ ఆకట్టుకునే విధంగా అట్లీ రూపొందిస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాకు చిన్న బ్రేక్ తీసుకుని ఈ కమర్షియల్ యాడ్ రూపకల్పనలో అట్లీ పడ్డాడు. ఈ యాడ్ బయటకు వచ్చిన తర్వాత అట్లీ యాడ్ ఫిల్మ్ మేకర్ గా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జవాన్ తో షారుఖ్ ఖాన్ కి రూ.1000 కోట్ల సినిమాను ఇచ్చిన అట్లీ త్వరలోనే బన్నీతో రాబోతున్న సినిమాతోనూ వెయ్యి కోట్లకు మించి వసూళ్లు సాదిస్తాడనే విశ్వాసం వ్యక్తం అవుతోంది.
