Begin typing your search above and press return to search.

బన్నీ 'రాకా' థీమ్ మ్యూజిక్.. కొత్త ట్రెండ్ క్రియేట్ అవ్వడం పక్కా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం రాకా (Raaka)పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

By:  M Prashanth   |   8 April 2026 7:43 PM IST
బన్నీ రాకా థీమ్ మ్యూజిక్.. కొత్త ట్రెండ్ క్రియేట్ అవ్వడం పక్కా?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం రాకా (Raaka)పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధవారం అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆ సినిమా టైటిల్‌ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను విడుదల చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫస్ట్ లుక్‌ లో అల్లు అర్జున్ పూర్తిగా కొత్త అవతార్ లో కనిపించారు. ఇప్పటివరకు ఆయన చేసిన పాత్రలన్నింటికంటే భిన్నంగా.. రగ్గడ్, బీస్ట్ మోడ్ లుక్‌ లో కనిపించడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. పొడవైన గోర్లు, క్రియేచర్ స్టైల్ డిజైన్, కళ్లలో కనిపిస్తున్న ఇంటెన్సిటీ.. పాత్రను చాలా పవర్‌ ఫుల్‌ గా చూపిస్తున్నాయి. ఆ లుక్ చూస్తుంటే సినిమా ఒక డార్క్ ఫాంటసీ లేదా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ గా ఉండబోతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

అదే సమయంలో యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ అందించిన థీమ్ మ్యూజిక్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఫస్ట్ లుక్‌ తో పాటు విడుదలైన ఆడియో థీమ్ వినిపించిన వెంటనే ఇంపాక్ట్ కలిగించేలా ఉంది. మల్టీలేయర్డ్ సౌండ్ డిజైన్‌ తో రూపొందించిన ఆ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ సినిమా టోన్‌ కు సరిపడేలా ఉందని సినీ ప్రియులు, నెటిజన్లు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

అయితే థీమ్ మ్యూజిక్ మొదటి సారి అందరికీ పూర్తిగా కనెక్ట్ కాకపోవచ్చని కొందరు భావిస్తున్నారు. కొత్తదనం, ప్రత్యేకమైన శైలి కారణంగా కొంతమంది ప్రేక్షకులకు అర్థం కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ, ఇది మ్యూజికల్‌ గా కొత్త ట్రెండ్ సెట్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో గ్లింప్స్ కోసమే ఆ ఆడియో క్రియేట్ చేసి ఉంటారని తెలుస్తోంది.

ఇక సినిమా కథ విషయానికి వస్తే, పునర్జన్మల కాన్సెప్ట్‌ తో ఒక డార్క్ మిస్టరీ డ్రామాగా తెరకెక్కుతోందని సమాచారం. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, డీ-ఏజింగ్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ రూపొందిస్తున్నారు. దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌ తో నిర్మాణం జరుగుతుండటం.. ప్రాజెక్ట్ రేంజ్ ను తెలియజేస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

హీరోయిన్‌ గా ఇప్పటికే బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె పేరు అధికారికంగా ప్రకటించారు. ఆమెతో పాటు మరికొందరు స్టార్ హీరోయిన్లు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది నిజమైతే ఆయన కెరీర్‌ లో ఇదొక పెద్ద ప్రయోగంగా నిలిచే అవకాశం ఉంది. ఇక మేకర్స్ నుంచి వచ్చే తదుపరి అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.