ఏఏ 22లో స్పెషల్ సర్‌ప్రైజ్ ఇతడే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 30 Aug 2025 4:00 AM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కాస్టింగ్, సాంకేతిక నిపుణులు సహా దేనిలోను రాజీ అన్నదే లేకుండా అద్భుతగా ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.
ఈ భారీ ప్రయోగాత్మక చిత్రంలో బాలీవుడ్ అందాల కథానాయిక దీపిక పదుకొనే బన్ని సరసన నటిస్తోంది. తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో కోలీవుడ్ కమెడియన్ యోగిబాబు ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇక ఇదే చిత్రంలో మృణాల్ ఠాకూర్ కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తోందని తెలిసింది. దీంతో యోగిబాబు, మృణాల్ ల పాత్రలు ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సుకత అభిమానుల్లో పెరిగింది.
ప్రభాస్ `కల్కి 2898 ఏడి` పాన్ ఇండియా కేటగిరీలో సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత మళ్లీ ప్రణాళికా బద్ధంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు నాన్ థియేట్రికల్, డిజిటల్ హక్కుల కోసం భారీ డిమాండ్ నెలకొంది. జవాన్ చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్లో సత్తా చాటిన అట్లీ ఈసారి సైన్స్ ఫిక్షన్ కాన్సెప్టుతో భారీ ప్రయోగం చేస్తున్నాడు. షారూఖ్- అట్లీ కాంబినేషన్ మూవీ జవాన్ లో యోగిబాబు ఓ కీలక పాత్రను పోషించారు. ఆ తర్వాత మళ్లీ భారీ ప్రయోగాత్మక చిత్రంలో యోగిబాబు పాత్ర ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి నెలకొంది.
