Begin typing your search above and press return to search.

చిన్నారి పెపంకంలో అసిన్ వేరే లెవెల్

టాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమలను అభినయంతో ఊపేసిన నటి అసిన్ వివాహం తర్వాత సినిమాలకు దూరమైన సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   26 Oct 2026 8:00 PM IST
చిన్నారి పెపంకంలో అసిన్  వేరే లెవెల్
X

టాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమలను అభినయంతో ఊపేసిన నటి అసిన్ వివాహం తర్వాత సినిమాలకు దూరమైన సంగ‌తి తెలిసిందే. మైక్రోమాక్స్ కో-ఫౌండర్ రాహుల్ శర్మను వివాహం చేసుకున్న అసిన్ పూర్తిగా కుటుంబం.. పాప ఆలనాపాలనపైనే దృష్టి పెట్టారు. సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుంద‌ని మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డుతున్నా? ఇంకా ఆ ఛాన్స్ తీసుకోలేదు. తాజాగా రాహుల్ శర్మ ఓ ఇంటర్వ్యూలో కుమార్తెకు సంబంధించిన ఆసక్తికర విషయా లను పంచుకున్నారు. కుమార్తె అరిన్ రయాన్ శర్మ వయసు ఏడేళ్లే అయినా? అద్భుతమైన ప్రతిభతో అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. చిన్న వయసులోనే 12 విభిన్న భాషలను అర్థం చేసుకోగలగడం.. అనర్గళంగా మాట్లాడటం విశేషం.

సాధారణంగా పెద్దవారే రెండు .. మూడు భాషలు మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటే? చిన్నారి అరిన్ మాత్రం కొరియన్, జపనీస్, థాయ్, చైనీస్ వంటి విదేశీ భాషలతో పాటు ఏకంగా 12 భాషలపై పట్టు సాధించడం అసాధారణ విషయమని రాహుల్ శర్మ ప్రశంసించారు. కుమార్తె ఇంతటి భాషా నైపుణ్యాన్ని సంపాదించడానికి ప్రధాన కారణం భార్య అసిన్ పెంపకమేనని కొనియాడారు. అసిన్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్లే ఇది సాధ్యమైందని వెల్లడించారు.

ముఖ్యంగా తమ ఇంట్లో ఎలాంటి టెలివిజన్లు కానీ, మొబైల్ ఫోన్లు కానీ లేవని రాహుల్ శర్మ స్పష్టం చేయడం గమనార్హం. ఇప్పటి వరకు కుమార్తెకు ఎలాంటి స్క్రీన్ టైమ్ ఇవ్వలేదని, డిజిటల్ గాడ్జెట్లకు పూర్తిగా దూరంగా ఉంచామని తెలిపారు. మొబైల్స్, టీవీలకు బదులుగా ఇంట్లో ఎప్పుడూ పుస్తకాలే ప్రపంచంగా ఉంటాయని.. చిన్నారి అరిన్‌కు పుస్తకాలంటే విపరీతమైన ఇష్టమని పేర్కొన్నారు.

ప్రస్తుతం రెండవ తరగతి చదువుతున్న అరిన్ కోసం ఇంట్లోనే 8, 9 తరగతులకు సంబంధించిన పుస్తకాలను కూడా ఉంచినట్లు రాహుల్ న‌వ్వేసారు. పాఠశాల విద్యతో పాటు పుస్తకాల పట్ల చూపే ఆసక్తి అసిన్ పెంపకంలోని ప్రత్యేకతను తెలియజేస్తుందన్నారు. తన జీవితంలో అసిన్‌ను వివాహం చేసుకోవడమే అత్యంత ముఖ్యమైన నిర్ణయమని, తన ప్రతి విజయం వెనుక ఆమె ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందన్నారు.

పర్సనల్ లైఫ్‌ను ఆస్వాదిస్తున్న అసిన్ కూతురిని తీర్చిదిద్దిన తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. డిజిటల్ యుగంలోనూ స్క్రీన్ టచ్ లేకుండా పిల్లలను పుస్తకాలతో పెంచుతూ బహుభాషా నైపుణ్యాలు నేర్పిస్తున్న ఈ స్టార్ కపుల్ తీరుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అసిన్ కూతురి టాలెంటెడ్ జర్నీ చూసి అభిమానులు మురిసిపోతున్నారు.