Begin typing your search above and press return to search.

చరణ్‌ గురించి 'మహావతార్‌' దర్శకుడి మనసులో మాట..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా యానిమేటెడ్‌ పౌరాణిక మూవీ 'మహావతార్‌ నరసింహా' సినిమా గురించిన చర్చ జరుగుతోంది.

By:  Ramesh Palla   |   2 Aug 2025 3:44 PM IST
చరణ్‌ గురించి మహావతార్‌ దర్శకుడి మనసులో మాట..!
X

ప్రస్తుతం దేశవ్యాప్తంగా యానిమేటెడ్‌ పౌరాణిక మూవీ 'మహావతార్‌ నరసింహా' సినిమా గురించిన చర్చ జరుగుతోంది. సైలెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా వారం రోజుల తర్వాత జోరు పెరిగింది. పెద్ద సినిమాలను సైతం పక్కకు నెట్టి మరీ పలు భాషల్లో ఈ సినిమా వసూళ్లు రాబడుతున్నట్లు బాక్సాఫీస్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. తొలి పౌరాణిక యానిమేటెడ్‌ మూవీ అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు మొదటి నుంచి ప్రచారం చేస్తూ వస్తున్నారు. సినిమా మొదటి వారం రోజుల్లో ఏకంగా రూ.60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. సినిమా ముందు ముందు మరింత ఎక్కువ మందికి రీచ్‌ కావడం ఖాయం అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

మహావతార్‌ నరసింహా పోస్ట్‌ ప్రమోషన్స్‌

సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌ నేపథ్యంలో విడుదలకు ముందు సైలెంట్‌గా ఉన్న యూనిట్‌ సభ్యులు ప్రమోషన్‌ హడావిడి మొదలు పెట్టారు. పోస్ట్‌ రిలీజ్‌ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో దర్శకుడు అశ్విన్‌ కుమార్‌ పాల్గొంటున్నాడు. ఇటీవల పలు మీడియా సమావేశాలు నిర్వహించడంతో పాటు, పలు ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా సినిమాను వార్తల్లో నిలిపాడు. తప్పకుండా ఈ సినిమా ఇండియన్‌ యానిమేటెడ్‌ సినిమాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని తాము భావించామని, అన్నట్లుగానే ఈ సినిమా మంచి స్పందన దక్కించుకుందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. భవిష్యత్తులో మరిన్ని పౌరాణిక సినిమాలను తీసే ఆలోచనలో ఉన్నట్లు దర్శకుడు అశ్విన్‌ కుమార్‌ పేర్కొన్నాడు.

రామ్‌ చరణ్‌ గురించి అశ్విన్‌ కుమార్‌ కామెంట్స్‌

ఒక ఇంటర్వ్యూలో మీరు రామాయణం తీయాలి అనుకుంటే ప్రస్తుతం ఉన్న హీరోల్లో ఏ హీరోను రాముడి పాత్రకు ఎంపిక చేసుకుంటారు అంటూ ప్రశ్నించిన సమయంలో అశ్విన్‌ కుమార్‌ మరో ఆలోచన లేకుండా తాను రామ్‌ చరణ్‌ ను నా రాముడిగా ఎంపిక చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా క్లైమాక్స్‌లో రామ్‌ చరణ్‌ వేసుకున్న గెటప్‌ ను చాలా మంది రాముడి గెటప్‌ అనుకున్నారు. అందువల్ల రాముడిగా రామ్‌ చరణ్‌ సరిగ్గా సెట్‌ అవుతాడని, ఫిజిక్ మొదలుకుని చూపుల వరకు రాముడికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ కూడా రామ్‌ చరణ్‌కి ఉంటాయని అభిమానులు సైతం అంటున్నారు. తాజాగా అశ్విన్‌ కుమార్‌ అదే విషయాన్ని చెప్పడంతో అభిమానులు ఆ విషయాన్ని తెగ షేర్‌ చేస్తున్నారు.

పెద్ది సినిమా షూటింగ్‌లో చరణ్‌

ప్రస్తుతం రామ్‌ చరణ్‌ పెద్ది సినిమాలో నటిస్తున్నాడు. ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక పెద్ది సినిమాకు ఏఆర్ రెహమాన్ అందించే సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. రామ్‌ చరణ్‌ ను ఆ మధ్య కాలంలో అల్లు అరవింద్‌ రాముడిగా చూపించే ప్రయత్నాలు చేశారు. బాలీవుడ్‌ నిర్మాతలతో కలిసి వెయ్యి కోట్ల రామాయణంకు సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు. అందులో రామ్‌ చరణ్‌ ను రాముడి పాత్ర కోసం పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ సినిమా పట్టాలెక్కలేదు. దాంతో చరణ్‌ కి రాముడి గెటప్ ఆర్‌ఆర్‌ఆర్ క్లైమాక్స్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ చరణ్‌ కి ఇంకా చాలా కెరీర్‌ ఉంది. కనుక భవిష్యత్తులో ఖచ్చితంగా రామాయణం చేసే అవకాశం దక్కవచ్చు అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.