Begin typing your search above and press return to search.

అషు రెడ్డి.. చీరలో కూడా హై గ్లామర్ ట్రీట్!

లేటెస్ట్ గా అషు రెడ్డి ఒక ట్రెడిషనల్ లుక్‌లో నెటిజన్లను మెస్మరైజ్ చేసింది. చక్కటి చీరతో క్లాసీ మేకోవర్‌లో ఫోటోషూట్ చేసింది.

By:  M Prashanth   |   8 Aug 2025 9:48 AM IST
అషు రెడ్డి.. చీరలో కూడా హై గ్లామర్ ట్రీట్!
X

ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన అషు రెడ్డి తరచూ సోషల్ మీడియా వేదికగా తన ఫోటోషూట్లతో, స్టైల్ స్టేట్మెంట్లతో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఒకవైపు సినిమాలు, వెబ్ షోలు, యాంకరింగ్, మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో రకరకాల లుక్స్ తో ఫాలోవర్లను పెంచుకుంటోంది. ఆమె పోస్ట్ చేసే ప్రతి ఫోటో సెకండ్లలో వైరల్ అవుతూ ట్రెండింగ్ లోకి వస్తుంటుంది.


లేటెస్ట్ గా అషు రెడ్డి ఒక ట్రెడిషనల్ లుక్‌లో నెటిజన్లను మెస్మరైజ్ చేసింది. చక్కటి చీరతో క్లాసీ మేకోవర్‌లో ఫోటోషూట్ చేసింది. మెస్మరైజ్ చేసే చిరునవ్వుతో, స్మార్ట్ పోజులతో అషు ఎట్రాక్షన్ పెంచింది. మోడ్రన్ ఎలిగెన్స్‌తో పాటు సాంప్రదాయ హంగు కలిపిన ఈ లుక్స్ కి నెటిజన్లు ఫిదా అయిపోయారు. క్రీమ్ కలర్ కాంబినేషన్‌లో ఉండే ఈ చీరలోని ఫ్లోరల్ డిజైన్‌, లైట్ మెటీరియల్ స్టైలింగ్ అషు లుక్‌ని మరింత అందంగా చూపించింది.


ఈ ఫోటోలకి "మాయం అయింది నా మనస్సు నీ వల్ల" అంటూ క్యాప్షన్ పెట్టింది. హ్యాష్‌ట్యాగ్స్‌తో పాటు, తన ఫొటోషూట్ బృందానికి క్రెడిట్ ఇస్తూ పోస్ట్ చేసింది. ఆమెను ఫాలో అయ్యే అభిమానులు, స్నేహితులు కామెంట్స్‌లో వర్షంలా ప్రశంసలు కురిపిస్తున్నారు. "సింప్లిసిటీకి, బ్యూటీకి పర్‌ఫెక్ట్ డెఫినిషన్", "గార్జియస్", "ఫెయిరీ టేల్ లుక్" అని కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. అషు రెడ్డి ట్రెడిషనల్ లుక్‌లోనూ ఎంత స్టన్నింగ్‌గా కనిపించగలదో మరోసారి నిరూపించుకుంది.


అషు రెడ్డి సోషల్ మీడియా యాక్టివిటీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఫ్యాషన్ లవర్స్ మాత్రమే కాదు, యూత్ కూడా ఆమె స్టైల్‌ని ఫాలో అవుతున్నారు. ఫోటోషూట్ లలో తనదైన మార్క్ చూపించడంలో ఆమె దిట్ట. వెస్ట్రన్, మోడ్రన్ లుక్స్‌లో అయితే టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. ఇప్పుడు చీరలో కూడా అదే ఎఫెక్ట్ చూపించి ట్రెండ్ సెట్ చేసింది. ప్రస్తుతం ఆమె ప్రొఫెషనల్ కెరీర్ కూడా ఫుల్ జోష్ లోనే సాగుతోంది. యాంకరింగ్, షూటింగ్‌లతో బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్లతో టచ్‌లో ఉంటుంది.