పిక్‌టాక్ : పవన్ బర్త్‌డే స్పెషల్‌గా అషు షో..!
టాలీవుడ్ హీరోల్లో ఫ్యాన్ ఫాలోయింగ్‌లో టాప్‌లో ఉండే స్టార్ పవన్ కళ్యాణ్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By: Ramesh Palla | 2 Sept 2025 11:28 AM ISTటాలీవుడ్ హీరోల్లో ఫ్యాన్ ఫాలోయింగ్‌లో టాప్‌లో ఉండే స్టార్ పవన్ కళ్యాణ్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఏ విషయం అయినా నెట్టింట తెగ సందడి చేయడం మనం చూస్తూ ఉంటాం. పవన్ కళ్యాన్ పుట్టిన రోజు అంటే అభిమానులు ఏ విధంగా సోషల్ మీడియా ద్వారా తమ అభిమానంను చాటుకుంటారో తెలిసిందే. నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు, నెటిజన్స్ సోషల్ మీడియా ద్వారా హ్యాపీ బర్త్‌డే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం అంటూ చాలా గౌరవంగా, మర్యాదగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ బర్త్‌డే కి సంబంధించిన హడావిడి నడుస్తోంది. ఈ సమయంలో అషు రెడ్డి షేర్ చేసిన ఫోటో ఒక్కసారిగా వైరల్ అయింది. పవన్ కళ్యాణ్‌కి ఈమె ఫ్యాన్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు..
పవన్ కళ్యాణ్ కి చాలా మంది సెలబ్రిటీ ఫ్యాన్స్ అంటారు. హీరోయిన్స్‌లోనూ చాలా మంది పవన్ ఫ్యాన్స్ ఉంటారు, ఇక యంగ్ హీరోల్లో చాలా మంది పవన్‌ను అభిమానించే వారు చాలా మంది ఉంటారు. పవన్ పై తమకు ఉన్న అభిమానంను సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా ఫోటోలు షేర్ చేయడం ద్వారా చూపిస్తూ ఉంటారు. పవన్ తో తాము దిగిన ఫోటోలను ఎక్కువ మంది సెలబ్రిటీలు షేర్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు. అషు రెడ్డి మాత్రం చాలా స్పెషల్ ఫోటోను షేర్ చేసింది. చాలా ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ అనే టాటూను అషు రెడ్డి ప్రైవేట్ ప్లేస్ లో వేయించుకున్న విషయం తెల్సిందే. ఆ టాటూ వేయించుకున్న కారణంగా సోషల్ మీడియాలో మంచి రీచ్ దక్కింది, ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ కూడా దక్కించుకున్న విషయం అందరికీ తెలిసిందే.
అషు రెడ్డి టాటూ వైరల్..
అషు రెడ్డి తాజాగా మరోసారి ఆ టాటూను చూపించింది. చాలా ఏళ్ల తర్వాత అషు ఆ టాటూతో ఉన్న తన ఫోటోను షేర్ చేసింది. సైడ్ యాంగిల్ లో చెస్ట్ పక్కన ఉన్న ఈ టాటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అనిపించుకునేందుకు ఈ అమ్మడు మరోసారి ఈ ఫోటోను షేర్ చేయడం అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. అషు రెడ్డి ప్రైవేట్ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ పేరును టాటూ వేయించుకుంది అనే విషయం చాలా మందికి తెలుసు. కానీ అది ఎక్కడ అనేది మాత్రం ఇప్పుడు పూర్తిగా తేలిపోయింది. అప్పట్లో అషు రెడ్డిని ఫాలో అయ్యే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కనుక తక్కువ మందికే ఆ టాటూ చూపించింది. ఇప్పుడు ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య ఏకంగా 20 లక్షలు. ఇప్పుడు వారంతా కూడా పవన్ కళ్యాణ్ టాటూను చూస్తూ తెగ లైక్ చేసి, కామెంట్ చేస్తున్నారు.
హ్యాపీ బర్త్‌డే పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుని సెలబ్రిటీలు అవుతున్న వారు చాలా మంది ఉన్నారు. అందులో అషు రెడ్డి కూడా ఒకరు అనే విషయం మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. అషు రెడ్డి తీరును చాలా మంది విమర్శించినా తనకంటూ గుర్తింపు దక్కించుకోవడం కోసం ఆమె చేస్తున్న ప్రయత్నంను అభినందించాల్సిందే అని కొందరు అంటూ ఉంటారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా మరోసారి అషు రెడ్డి తన పర్సనల్ టాటూను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ బర్త్‌డేకి ఒక అభిమానిగా ఇంతకు మించి ఏం గిఫ్ట్ ఇస్తారు అంటూ కొందరు అషు అభిమానంను ప్రశంసిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమాని అయినందుకు గర్వంగా ఉందని కామెంట్ పెట్టిన అషు రెడ్డి ప్రజల దేవుడు పవన్ కళ్యాణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ఈ ఫోటోతో పాటు షేర్ చేసింది.
