Begin typing your search above and press return to search.

అషు వివాదంలో కొత్త ట్విస్ట్.. తండ్రి ఏమన్నారంటే?

నటి, బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి పెళ్లి పేరుతో ఎన్ఆర్ఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ ను మోసం చేసినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.

By:  M Prashanth   |   27 April 2026 11:00 AM IST
అషు వివాదంలో కొత్త ట్విస్ట్.. తండ్రి ఏమన్నారంటే?
X

నటి, బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి పెళ్లి పేరుతో ఎన్ఆర్ఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ ను మోసం చేసినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే అషురెడ్డి స్పందించగా, తాజాగా ఆమె తండ్రి వెంకటకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

"2021లో ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ నుంచి ఫోన్ వచ్చింది. సంబంధం కోసం కాల్ చేశామని, మీ పాప మా బాబు ఫారిన్ లో కొలీగ్స్ అని చెప్పారు. అయితే ఫోన్ లో ఎందుకు? వచ్చి మాట్లాడమని చెప్పా. సత్యనారాయణ తన తోడల్లుడితో మా ఇంటికి వచ్చారు. బ్యాక్ గ్రౌండ్ తో సహా అన్ని విషయాలు చెప్పగా, త్వరలో మాట్లాడుకుని నిర్ణయం చెప్తామని మేం చెప్పాం" అని తెలిపారు.

"నాకు తెలిసిన వాళ్లతో సత్యనారాయణ ఫ్యామిలీ గురించి కనుక్కున్నా. వాళ్లమీద కాల్ మనీ కేసులు ఉన్నాయని కొందరు చెప్పారు. ఆశ్చర్యపోయి అబ్బాయి గురించి అడిగాను. అతడిపై డివోర్స్ కేసు రన్ అవుతుందని చెప్పారు. వాళ్ల సిస్టర్ భర్త చెల్లిని పెళ్లి చేసుకున్నాడట. టార్చర్ పెట్టి వదిలేశాడని అన్నారు" అని చెప్పారు.

"అవన్నీ తెలిసి కాకినాడ వెళ్లలేదు. వాళ్ళు మాకు మళ్లీ మళ్లీ అడగ్గా దూరం పెట్టా. మాకు ఇష్టం లేదని తేల్చిచెప్పాం. ఆ తర్వాత వాళ్ల ముఖాలు చూడలేదు. 2023లో అషు తల్లి నాకు రికమండ్ చేశారు. అప్పుడు నేను ఎంక్వైరీ చేశానని, సంబంధం వద్దని చెప్పేశా. కానీ ఆ తర్వాత ఆమెతో రెగ్యులర్ కాంటాక్ట్ లో అబ్బాయి ఉన్నట్లు తెలిసింది" అని వెల్లడించారు.

"ఆరోపణలు ఎవరైనా చేయొచ్చు.. కానీ ప్రూఫ్స్ ఉండాలి కదా. అషు రెడ్డి చెల్లి రూ.50 లక్షలు తీసుకుందంటే నేను నమ్మను.. ఆమె ఒక వర్కింగ్ లేడీ. అషు హైదరాబాద్ లో ఉంటుంది. నేను వైజాగ్ లో ఉంటాను. అషు చాలా టాలెంటెడ్. యాక్టింగ్ పై ప్యాషన్ ఆమెకు.. నాకు అది నచ్చదు. తల్లి ఎంకరేజ్మెంట్ తో సినిమాల్లోకి వెళ్లింది. అషు రెడ్డితో తోడు నా వైఫ్ ఉంటుంది" అని చెప్పారు.

"కానీ ఇదంతా నాకు తెలియదు. కొడుకు తప్పు అయితే తండ్రి బాధ్యత. కూతురు తప్పు చేస్తే తల్లిదే బాధ్యత. అషు రెడ్డి చాలా అమాయకురాలు. నాకు ఆమె ఎప్పుడూ ఈ విషయం చెప్పలేదు. తప్పు చేయదని అనుకుంటాను. డబ్బులు, బంగారం తీసుకోవడం అబద్దమని అనుకుంటా. నా వైఫ్ చాలా తెలివి. ఆమె తీసుకుందో లేదో నాకు తెలియదు. మా ఇద్దరి మధ్య ఫైనాన్సియల్ ట్రాన్సక్షన్స్ లేవు" అని చెప్పారు.

"నాకు కూతురంటే ఎంతో ఇష్టం. ఆమెకు నేను అంతే. వేణుస్వామితో పూజలు చేయించారని వార్తలు వచ్చినా.. నాకు తెలియదు. నేను పట్టించుకోలేదు.. నా మీద కేసు నమోదైంది. నేను నిర్దోషిగా ప్రూవ్ చేసుకుంటా. ఏదేమైనా నేను ఆ సంబంధం, అబ్బాయి వద్దన్నాను. కానీ తల్లి ఎంకరేజ్ చేయడం వల్ల ఇంత జరిగింది. అషుతో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తా" అని తెలిపారు.