పుత్తడిబొమ్మలా అందంగా ముస్తాబైన ఆషురెడ్డి.. ఫోటోలు వైరల్!
గ్లామర్ వలకబోయడం లోనే కాదు సాంప్రదాయంగా కనిపించి అభిమానులను ఆకట్టుకోవడంలో కూడా ముందుంటుంది ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆషురెడ్డి.
By: Madhu Reddy | 30 Sept 2025 12:16 PM ISTగ్లామర్ వలకబోయడం లోనే కాదు సాంప్రదాయంగా కనిపించి అభిమానులను ఆకట్టుకోవడంలో కూడా ముందుంటుంది ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆషురెడ్డి. తన అందంతో.. వాక్చాతుర్యంతో అందరినీ అబ్బురపరిచే ఈ ముద్దుగుమ్మ.. అప్పుడప్పుడు సాంప్రదాయంగా కనిపించి అందరినీ అలరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఒకవైపు.. దేవీ నవరాత్రులు మరొకవైపు ఘనంగా జరుగుతుండగా.. ఈ సందర్భంగా పుత్తడి బొమ్మలా సాంప్రదాయంగా రెడీ అయ్యి అందరి చూపును తన వైపు తిప్పుకుంది.
పట్టు పరికిణిలో కనిపించి అందుకు తగ్గట్టుగా జువెలరీ ధరించిన ఈమె చాలా సాంప్రదాయంగా కనిపిస్తోంది. ఆషురెడ్డిని తొలిసారి ఇలా చూస్తున్నాం అంటూ ఆమె అభిమానులు సైతం ఆమె అందానికి మంత్రముగ్ధులవుతున్నారు. ఆషురెడ్డి ఒక షోలో భాగంగా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఈ ఫోటోలను షేర్ చేసింది.. అందులో స్రవంతి చొక్కారపు కూడా చాలా అందంగా కనిపిస్తోందని చెప్పవచ్చు.. ముఖ్యంగా ఈ ఇద్దరు సాంప్రదాయంగా కనిపించి అభిమానులను తమ అందంతో కట్టిపడేస్తున్నారు.
ఆషురెడ్డి కెరియర్ విషయానికే వస్తే.. ఎక్కడో అమెరికాలో సాఫ్ట్వేర్ గా ఉద్యోగం చేసుకుంటూ కెరియర్ ను కొనసాగిస్తున్న ఈమె పవన్ కళ్యాణ్ కి డై హార్డ్ ఫ్యాన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన కోసమే తాను ఉద్యోగం వదిలేసి వచ్చానని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పింది కూడా.. అలా ఉద్యోగం మానేసి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. ఇక్కడే పలు ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ మరింత పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా తన అందంతో జూనియర్ సమంత అనే బిరుదును కూడా దక్కించుకుంది ఆషురెడ్డి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అటు వెకేషన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం సుధీర్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఫ్యామిలీ స్టార్ట్స్ అనే షోలో సుధీర్ తో పాటు హోస్ట్గా వ్యవహరిస్తూ కెరియర్ ను కొనసాగిస్తోంది. అంతేకాదు గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగుపెట్టిన ఈమె.. అక్కడ కూడా తన పెర్ఫార్మెన్స్ తో అందరినీ అబ్బురపరిచింది. ఇదిలా ఉండగా.. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఈమె ప్రేమలో ఉందని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవ్వగా.. అందులో నిజం లేదని కొట్టిపారేసింది.
ఇకపోతే ఈమె రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూలతో భారీ పాపులారిటీ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆయనతో ఇంటర్వ్యూలో చాలా బోల్డుగా కనిపించడమే కాకుండా మాట తీరుతో కూడా అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత వర్మ ఈమె కాలి వేలును నోట్లో పెట్టుకోవడం కూడా అప్పట్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎంతైతే పాపులారిటీ అందుకుందో అంతే విమర్శలు కూడా ఎదుర్కొంది ఆషురెడ్డి. ఇప్పుడు సినిమాలలో కూడా కనిపించిన ఈమె కెరీర్లో మంచి హోదాలో కొనసాగాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
