బ్యాడ్మింటన్ కోర్టులో అషు రెడ్డి గ్లామర్ హీట్
లేటెస్ట్ గా అషు రెడ్డి షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి.
By: M Prashanth | 26 Nov 2025 10:16 AM ISTసోషల్ మీడియా సెన్సేషన్గా, డబ్స్మాష్ వీడియోలతో పాపులర్ అయిన అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జూనియర్ సమంతగా నెటిజన్ల మనసు గెలుచుకున్న ఈ బ్యూటీ, బిగ్ బాస్ షోతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. నిత్యం ఏదో ఒక గ్లామరస్ అప్డేట్తో ఇంటర్నెట్లో హల్చల్ చేయడం ఆమెకు అలవాటుగా మారింది.
లేటెస్ట్ గా అషు రెడ్డి షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి. అమెరికాలోని ఫ్లోరిడాలో బ్యాడ్మింటన్ ఆడుతూ, ఆలివ్ గ్రీన్ కలర్ బ్యాక్లెస్ జంప్సూట్ ధరించి ఎంతో గ్లామరస్ గా దర్శనమిచ్చారు. చేతిలో రాకెట్ పట్టుకుని, వెనుక వైపు తిరిగి తన ఫిట్ బాడీని, స్టైలిష్ లుక్ను హైలెట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఆమె పెట్టిన ఆసక్తికరమైన క్యాప్షన్ లో ఆమెలోని మనోధైర్యాన్ని, ఫిట్నెస్ పట్ల ఉన్న శ్రద్ధను సూచిస్తోంది.
'చల్ మోహన్ రంగ' సినిమాతో వెండితెరకు పరిచయమైనా, ఆమెకు అసలైన గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం 'బిగ్ బాస్' రియాలిటీ షోనే. హౌస్లో తన ఆటతీరుతో, గ్లామర్తో, బోల్డ్నెస్తో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అప్పటి నుంచి బుల్లితెరపై, వెండితెరపై వరుస అవకాశాలను అందుకుంటూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.
కేవలం గ్లామర్కే పరిమితం కాకుండా, రామ్ గోపాల్ వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలతోనూ అషు రెడ్డి ఇంటర్నెట్ను షేక్ చేశారు. ప్రస్తుతం ఆమె ఎక్కువగా విదేశీ పర్యటనలతో ఎంజాయ్ చేస్తున్నారు. ఖరీదైన కార్లు, లగ్జరీ లైఫ్స్టైల్తో సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్లో ఉంటారు. నటిగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తూనే, డిజిటల్ ప్లాట్ఫామ్స్లో తన సత్తా చాటుతున్నారు.
సినిమా అవకాశాలు పెద్దగా లేకపోయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం అషు రెడ్డి ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఇలాంటి గ్లామర్ ఫొటోషూట్లతో, ట్రెండీ రీల్స్తో తన ఫ్యాన్స్ను ఎప్పుడూ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. గ్లామర్ డోస్ పెంచుతూ, నెట్టింట తన క్రేజ్ను కాపాడుకోవడంలో అషు రెడ్డి ఎప్పుడూ ముందుంటారు. మరి అమ్మడు భవిష్యత్తులో ఏవైనా గ్లామరస్ ఛాన్సులు అందుకుంటుందో లేదో చూడాలి.
