డెతడి గ్లింప్స్.. ఘనీ భాయ్ ఎనర్జీతో ఆకట్టుకున్న ఆశిష్!
దిల్ రాజు.. శిరీష్ కలిసి కొత్తగా డెతడి అనే సినిమా తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ హీరో ఆశిష్ నటిస్తున్నారు.
By: Priya Chowdhary Nuthalapti | 24 March 2026 6:41 PM ISTదిల్ రాజు.. శిరీష్ కలిసి కొత్తగా డెతడి అనే సినిమా తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ హీరో ఆశిష్ నటిస్తున్నారు. ఆయన ఇప్పటికే రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో గుర్తింపు పొందారు. ఈ సినిమాతో ఆదిత్య రావు గంగసాని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కథ హైదరాబాద్ నేపథ్యంలో సాగుతుంది. నగర సంస్కృతి, జీవన శైలి, ఉత్సాహాన్ని ఈ సినిమా చూపించబోతోంది.
ఈరోజు ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. ఇది చూసిన ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి పెరిగింది. గ్లింప్స్‌లో ప్రధాన పాత్ర ఘనీ భాయ్ (ఘన్ను భాయ్)ను ఒక స్ట్రీట్ డ్రమ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో జరిగే పండుగలు, వేడుకల్లో డ్రమ్స్ వాయిస్తూ అందరిని అలరిస్తూ ఉంటాము అని హీరో డైలాగులు చెబుతూ స్టైల్ గా నరుస్తూ కనిపించారు.
"ఘనీ భాయ్.. నా పేరు.. సుమారు ఏడు కిలోల బరువు ఉన్న డ్రమ్స్ మోసుకుంటూ గంటల పాటు ఆగకుండా ప్రదర్శన ఇస్తూ ఉన్న నా మొహం లో చిరునవ్వు చెరగదు," అంటూ.. హీరో డైలాగులు హైలైట్ గా నిలిచాయి .
ఈ పాత్రలో ఆశిష్ చాలా బాగా నటించారు. అతని రఫ్ లుక్, గడ్డం, స్టైల్ పాత్రకు సరిగ్గా సరిపోయాయి. ఆయన బాడీ లాంగ్వేజ్, హైదరాబాద్ స్లాంగ్ మాట్లాడే విధానం సహజంగా అనిపించింది. ఇక చివరిలో బ్యాండ్ వాళ్ళం కదా అన్న గట్టిగా వాయిస్తాము అన్న డైలాగ్ కూడా హైలెట్గా నిలిచింది.
దర్శకుడు ఆదిత్య రావు గంగసాని కొత్తవాడైనా కథను బాగా చూపించినట్టు ఈ చిన్న గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది. విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా, ఎనర్జీతో కనిపిస్తున్నాయి. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు దిల్ రాజు ప్రొడక్షన్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు బలంగా రాశారు. జునైద్ కుమార్ సంగీతం డ్రమ్స్ బీట్‌తో మంచి ఉత్సాహాన్ని ఇవ్వబోతోంది.
ఈ గ్లింప్స్ లాంచ్ కూడా గ్రాండ్‌గా జరిగింది. 500కి పైగా డ్రమర్స్ కలిసి లైవ్‌లో ప్రదర్శన ఇచ్చారు. ఆ ఈవెంట్ మొత్తం ఎనర్జీతో నిండిపోయింది. డెతడి ఒక కలర్‌ఫుల్, ఎనర్జీతో నిండిన సినిమా అవుతుందని అనిపిస్తోంది. త్వరలో “జాతర” ప్రారంభమవుతుందని మేకర్స్ చెప్పడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
