Begin typing your search above and press return to search.

గణేష్ చతుర్థి స్పెషల్.. చీరకట్టులో ఆకట్టుకుంటున్న ఆషికా రంగనాథ్!

ఆషికా రంగనాథ్ విషయానికి వస్తే.. 1996 ఆగస్టు 5న కర్ణాటక తుమకూరు జిల్లాలో కన్నడ మాట్లాడే రంగనాథ్, సుధా రంగనాథ్ దంపతులకు జన్మించింది.

By:  Madhu Reddy   |   27 Aug 2025 5:05 PM IST
గణేష్ చతుర్థి స్పెషల్.. చీరకట్టులో ఆకట్టుకుంటున్న ఆషికా రంగనాథ్!
X

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలు ఎక్కువగా తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి తదితర సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ద్వారా తెలియజేస్తున్నారు. మరీ ముఖ్యంగా పండుగలు వచ్చాయంటే చాలు అందంగా ముస్తాబయి సాంప్రదాయంగా కూడా ఆకట్టుకుంటున్నారు కూడా.. ఈ క్రమంలోనే నేడు దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ప్రజలే కాదు పలువురు సెలబ్రిటీలు కూడా భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. దీనికి తోడు ఈ పండుగకు మరింత సాంప్రదాయంగా, అందంగా రెడీ అయ్యి..ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.


ఇప్పుడు ఈ జాబితాలోకి తాజాగా ప్రముఖ యంగ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ కూడా వచ్చి చేరింది.వినాయక చవితి సందర్భంగా చాలా అందంగా రెడీ అయ్యి.. ఆ ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసి.. ఫాలోవర్స్ ను ఆకట్టుకుంది. తాజాగా యాష్ కలర్ ప్లెయిన్ సారీ కట్టుకున్న ఈమె దానికి కాంబినేషన్లో స్లీవ్ లెస్ ఎల్లో కలర్ బ్లౌజ్ ధరించింది. కొద్దిగా జుట్టును ముడి పెట్టి మిగతా జుట్టును లీవ్ చేసిన ఆషికా రంగనాథ్.. ఆ ముడికి చాలా చక్కగా పూలు పెట్టి మరింత సాంప్రదాయంగా కనిపించింది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రస్తుతం ఆషికా రంగనాథ్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


ఆషికా రంగనాథ్ విషయానికి వస్తే.. 1996 ఆగస్టు 5న కర్ణాటక తుమకూరు జిల్లాలో కన్నడ మాట్లాడే రంగనాథ్, సుధా రంగనాథ్ దంపతులకు జన్మించింది.ఈమెకు ఒక అక్క అనూషా రంగనాథ్ కూడా ఉన్నారు. ఈమె కూడా కన్నడ సినిమాలలో నటిగా కెరియర్ మొదలుపెట్టారు. ఇక ఆషికా రంగనాథ్ తుమకూరు లోని బిషప్ సార్జెంట్ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసింది. ప్రీ యూనివర్శిటీ కోసం బెంగళూరుకు వెళ్లి జ్యోతి నివాస్ కాలేజీలో చేరింది. అక్కడ క్లీన్ అండ్ క్లియర్ మిస్ ఫ్రెష్ ఫేస్ బెంగళూరు పోటీకి ఆడిషన్ లో పాల్గొని.. 2014లో జరిగిన పోటీలలో రన్నరప్ గా నిలిచింది. ఇక కామర్స్ అండ్ సైన్స్ నుండి కామర్స్ లో డిగ్రీ పట్టా అందుకున్న ఈమె.. వెస్ట్రన్, ఫ్రీ స్టైల్ ఇలా వివిధ నృత్య రూపాల్లో కూడా శిక్షణ అందుకుంది.


ఈమె కెరియర్ విషయానికి వస్తే.. 2016లో మహేష్ బాబు దర్శకత్వం వహించిన 'క్రేజీ బాయ్స్' అనే చిత్రం ద్వారా నటనా జీవితాన్ని ప్రారంభించిన ఈమె.. మొదటి సినిమాతోనే ఉత్తమ మహిళ నటిగా సైమా అవార్డు సొంతం చేసుకుంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తో కలిసి సినిమాలు చేసిన ఈమె 2023లో వచ్చిన 'అమిగోస్' చిత్రం ద్వారా తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత ' నా సామిరంగా' సినిమాలో వరాలు పాత్రతో మరింత దగ్గరైన ఈమె.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట మల్లిడి కాంబినేషన్లో వస్తున్న 'విశ్వంభర' సినిమాలో కూడా నటిస్తోంది. ఈమెతో పాటు త్రిష మెయిన్ లీడ్ పోషిస్తున్న విషయం తెలిసిందే. 2026 సమ్మర్ స్పెషల్ గా ఈ సినిమా విడుదల కాబోతోంది.ఇటు తెలుగులోనే కాకుండా అటు తమిళ్ సర్దార్ 2లో కూడా అవకాశం అందుకుంది ఈ ముద్దుగుమ్మ.