సీనియర్ హీరోలతో నో ఇష్యూ.. యంగ్ హీరోయిన్!
నాగార్జున సరసన నా సామి రంగా చిత్రంలో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత సిద్ధార్థ్ తో మిస్ యు అనే చిత్రంలో ఆడిపాడింది.
By: Sivaji Kontham | 20 Dec 2025 11:13 PM ISTవరుసగా టాలీవుడ్ సీనియర్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది ఆషికా రంగనాథ్. నాగార్జున సరసన నా సామి రంగా చిత్రంలో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత సిద్ధార్థ్ తో మిస్ యు అనే చిత్రంలో ఆడిపాడింది. ఈ ఏడాది చిరుతో విశ్వంభర, కార్తీతో సర్ధార్ 2 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
నేటితరంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న భామగా ఆషికకు గుర్తింపు ఉంది. ఆషిక `గత వైభవ` (మలయాళం) అనే ప్రయోగాత్మక చిత్రంలోను నటించింది. ఈ నవంబర్ 14న సినిమా థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఆషిక తన తదుపరి రిలీజ్ `భర్త మహాశయులకు విజ్ఞప్తి` (బిఎండబ్ల్యూ) విడుదల ప్రమోషన్స్ తో బిజీ బిజీగా ఉంది. ఈ సందర్భంగా మీడియా అడిగిన ఒక ప్రశ్నకు ఆషిక ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
మీరు వరుసగా మీకంటే చాలా ఎక్కువ వయసు ఉన్న సీరియర్ హీరోలతో నటిస్తున్నారు కదా? అనేది ఈ ప్రశ్న. ఇప్పటికే షష్ఠిపూర్తి చేసుకున్న నాగార్జున సరసన ఆశిక నటించింది. తదుపరి మెగాస్టార్ చిరంజీవి సరసన `విశ్వంభర` చిత్రంలోను ఆడిపాడుతోంది. ఇంతలోనే మాస్ మహారాజా రవితేజ సరసన నటించిన భర్త మహాశయులకు విడుదలకు రెడీ అవుతోంది.
తనకు సీనియర్ హీరోలతో పని చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆశిక తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. సీనియర్లతో పని చేయడం వల్ల తాను చాలా నేర్చుకున్నానని కూడా వెల్లడించింది. ఈ తరం నాయికల్లో ఆశిక వందశాతం సీనియర్ స్టార్ల సరసన అందంగా జతకుదిరింది. తదుపరి మహేష్, చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, బన్ని వంటి స్టార్ల సరసన ఆశిక నటించాలని కలలు కంటోంది.
