Begin typing your search above and press return to search.

తెల్ల చీరలో దేవకన్యలా మెరిసిపోతున్న ఆషికా రంగనాథ్

ఆషికా రంగ‌నాథ్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అందానికి అందం, ప్ర‌తిభ‌తో వేగంగా త‌న‌ను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంది ఈ బ్యూటీ.

By:  Sivaji Kontham   |   25 July 2026 3:33 PM IST
తెల్ల చీరలో దేవకన్యలా మెరిసిపోతున్న ఆషికా రంగనాథ్
X

ఆషికా రంగ‌నాథ్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అందానికి అందం, ప్ర‌తిభ‌తో వేగంగా త‌న‌ను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంది ఈ బ్యూటీ. నాగార్జున‌, ర‌వితేజ లాంటి అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించిన ఆషిక అరుదైన ప్ర‌తిభావ‌నిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోష‌ల్ మీడియాలోను ఈ అమ్మ‌డికి ఫాలోయింగ్ అసాధార‌ణంగా ఉంది.




తాజాగా ఆషికా రంగనాథ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. `ది వైట్స్ ద‌ట్ నెవ్వ‌ర్ మేడ్ ఇట్ టు ది గ్రామ్` అనే క్యాప్షన్‌తో ఆషిక షేర్ చేసిన ఈ వైట్ కలర్ ఔట్‌ఫిట్ ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తెల్లటి చీరలో దేవకన్యలా మెరిసిపోతున్న ఆషిక‌ గ్లామరస్ లుక్స్ చూసి అభిమానులు పరవశించిపోతున్నారు.




ఈ ఫోటోలు పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే వేలాది లైక్స్, కామెంట్లతో నెట్టింట ట్రెండింగ్‌గా మారాయి. వైట్ కలర్ నీకు పర్ఫెక్ట్‌గా సెట్ అయింది.. బ్యూటీ క్వీన్.. అంటూ నెటిజన్లు లవ్, హార్ట్ ఎమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నాగార్జున సరసన `నా సామి రంగా` సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆషికా తన అందం, నటనతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.




సినిమాల విషయానికి వస్తే... ఇటీవల వచ్చిన `భ‌ర్త‌ మహాశయులకు విజ్ఞప్తి` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా ఆషిక‌ క్రేజ్ మాత్రం తగ్గలేదు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా అభిమానులు త‌న‌ తదుపరి ప్రాజెక్ట్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తన క్యూట్ లుక్స్.. నటనతో మునుముందు పెద్ద ప్రాజెక్టులతో అలరించడానికి ఆషికా సిద్ధమవుతోంది.

సినిమాలతోనే కాకుండా బ్రాండ్ ఎండోర్స్‌మెంట్లు, రిబ్బన్ కటింగ్ ఈవెంట్లతో కూడా ఈ బ్యూటీ నెట్టింట సందడి చేస్తోంది. ఇటీవల మాంగళ్య షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి ఆషికా హాజరైనప్పుడు త‌న‌ను చూడటానికి అభిమానులు భారీగా తరలివచ్చిన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో తనకున్న ఫాలోయింగ్‌తో ఈ తరహా ఈవెంట్లలో ఆషిక‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఈ అందాల భామ‌కు ఊహించని పాపులారిటీ వల్ల రిబ్బన్ కటింగ్స్, షాపింగ్ మాల్ ప్రారంభోత్సవాల కోసం ఎంత చార్జ్ చేస్తోందనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఈవెంట్‌కు ఆమె రూ. 10 ల‌క్ష‌ల‌ నుండి 15 లక్షల వరకు పారితోషికం వ‌సూలు చేస్తోంద‌ని ప్ర‌చారం జరుగుతోంది. కేవలం సినిమాల్లోనే కాకుండా బయట ఈవెంట్లలోనూ త‌న‌కు మంచి క్రేజ్ ఉంద‌ని ప్రూవ్ అవుతోంది.