Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : నా సామి రంగా ఏం అందం

కన్నడ ముద్దుగుమ్మ ఆషికా రంగనాథ్ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

By:  Ramesh Palla   |   2 Aug 2025 3:00 PM IST
పిక్‌టాక్‌ : నా సామి రంగా ఏం అందం
X

కన్నడ ముద్దుగుమ్మ ఆషికా రంగనాథ్ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. తెలుగులో అమిగోస్‌, నా సామి రంగ సినిమాలతో అలరించిన ఈ అమ్మడు ఆ సినిమాలు నిరాశ మిగల్చడం తో మళ్లీ కన్నడంలో బిజీ అయింది. అక్కడ నుంచి తిరిగి టాలీవుడ్‌లో విశ్వంభర సినిమాతో ఎంట్రీ కి సిద్ధం అయింది. విశ్వంభర సినిమాలో త్రిష మెయిన్‌ లీడ్ కాగా, ఆషికా సెకండ్‌ హీరోయిన్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం అందుతోంది. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర సినిమా ఈ అక్టోబర్‌ లేదా నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ చివరి దశలో ఉన్నట్లు దర్శకుడు వశిష్ట ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. విశ్వంభర సినిమాపై ఆషికా చాలా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.


సింపుల్‌ లుక్‌లో ఆషికా రంగనాథ్‌

ఆషికా రంగనాథ్‌ సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. ఆషికా స్కిన్‌ షో చేయకుండానే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా హీరోయిన్స్‌ స్కిన్‌ షో చేస్తేనే ఆ ఫోటోలకు రీచ్‌ ఉంటుంది. కానీ ఆషికా ఇలా పద్దతైన ఔట్‌ ఫిట్‌లోనూ చాలా అందంగా కనిపించడం ద్వారా ఎక్కువ రీచ్‌ను సొంతం చేసుకుంటుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసిన ఆషికా రంగనాథ్‌ ఆకట్టుకునే అందం కారణంగా మరిన్ని ఆఫర్లు సొంతం చేసుకుంటుంది. సింపుల్‌ పాత్రలకు మోస్ట్‌ వాంటెడ్‌ ఛాయిస్‌ ఆషికా అనడంలో సందేహం లేదు. అందుకే ఆమెను మళ్లీ మళ్లీ పలువురు ఫిల్మ్‌ మేకర్స్‌ తమ సినిమాల్లో నటింపజేయడం చూస్తూ ఉంటాం. ముందు ముందు టాలీవుడ్‌లో ఈమె బిజీ స్టార్‌గా మారడం ఖాయం.


నా సామిరంగ సినిమాలో నాగార్జునకు జోడీగా..

తాజాగా ఈమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన అందమైన ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. నా సామిరంగ ఏం అందం అన్నట్లుగా ఉందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. వైట్ పంజాబీ డ్రెస్‌లో వెనుక నుంచి నడుము అందం చూపించడం ద్వారా కవ్విస్తుంది. సింపుల్‌గా ఉన్నా ఈ లుక్‌లో ఆషికా అందం ఓ రేంజ్‌లో ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆషికా ఇంత అందంగా ఉండటం వల్లే కెరీర్‌ ఆరంభం అయ్యి పదేళ్లు అయినా వరుస ఆఫర్లు దక్కించుకుంటూనే ఉంది. ప్రస్తుతం కన్నడ సినిమాలతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లోనూ నటిస్తుంది. కన్నడంలో చాలా సినిమాలు చేసిన ఈమె ముందు ముందు తమిళ్‌, హిందీ భాషల్లో సినిమాలు చేయడం ద్వారా మరింత మంది ప్రేక్షకులకు చేరువ కానుందేమో చూడాలి.


కన్నడంలో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా ఆషికా

ఆషికా 1996 ఆగస్టు 5న జన్మించింది. చిన్న వయసులోనే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. కర్ణాటకలోని తుమకూరులోని బిషప్‌ సంర్గంత్‌ పాఠశాలలో చదివిన ఆషికా ప్రీ యూనివర్శిటీ కోసం బెంగళూరు వెళ్లింది. అక్కడ జ్యోతి నివాస్ కాలేజ్‌లో చదివింది. క్లీన్‌ అండ్‌ క్లియర్‌ ఫ్రెష్‌ ఫేష్‌ బెంగళూరు పోటీల్లో పాల్గొనడం ద్వారా ఆషికా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ కాంపిటీషన్‌లో ఆషికా రన్నపర్‌గా నిలిచింది. కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆషికా సినిమాల్లో నటించాలనే ఆసక్తితో డాన్స్‌ లో శిక్షణ తీసుకుంది. యాక్టింగ్‌లో ట్రైనింగ్‌ అవుతున్న సమయంలోనే ఆఫర్లు రావడం మొదలు అయిందని తెలుస్తోంది. కన్నడంలో వరుసగా ఈమెకు ఆఫర్లు వచ్చాయి. కన్నడ స్టార్‌ హీరోలకు ఒకానొక సమయంలో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా సినిమాలు చేసింది.