విశ్వంభరలో ఓ అందమైన చందమామ.. స్పెషల్ లుక్!
టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వస్తున్న విజువల్ వండర్ విశ్వంభర సినిమా పట్ల అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది.
By: M Prashanth | 5 Aug 2025 1:05 PM ISTటాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వస్తున్న విజువల్ వండర్ విశ్వంభర సినిమా పట్ల అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది. సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ని యంగ్ డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తుండగా, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మెగాస్టార్ సరసన త్రిష ప్రధాన కథానాయికగా కనిపించనుండగా, కన్నడ బ్యూటీ ఆశికా రంగనాథ్, కునాల్ కపూర్, ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పుడు చిత్ర బృందం ఆశికా రంగనాథ్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో ఆశికా రంగనాథ్ సంప్రదాయ దుస్తుల్లో, చందమామ లాంటి మెరుపుతో అందంగా కనిపించారు. నెక్లెస్ చేతికి గాజులు, నుదుటి బొట్టు.. మొత్తం లుక్ ఆకర్షణీయంగా, కలర్‌ఫుల్‌గా ఉండటంతో ఈ క్యారెక్టర్‌పై ఇంట్రెస్ట్ పెరిగింది. ఆమె గ్లామర్ యాంగిల్‌ని హైలైట్ చేస్తూ రూపొందించిన పోస్టర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ కూడా ఆశికా కొత్త లుక్‌పై పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
విశ్వంభర మూవీలో ఆశికా రంగనాథ్ కీలక పాత్రలో నటించబోతున్నారు. త్రిషతో పాటు చిరు సరసన మరో గ్లామరస్ ఫేస్‌గా ఆమె స్థానం సంపాదించుకుంది. కన్నడలో స్టార్ ఇమేజ్ ఉన్న ఆశికా, తెలుగులో విశ్వంభరతో మరింతగా క్రేజ్ సంపాదించుకునే అవకాశం ఉంది. తాజాగా విడుదలైన పోస్టర్ ఆధారంగా ఆమె పాత్ర సినిమాకు ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, త్రిష, ఆశికా రంగనాథ్ మధ్య సీన్స్ సినిమా హైలైట్ కానున్నాయని టాక్.
ఇక ఈ సినిమాలో చిరంజీవికి నాలుగేళ్ల కొడుకు ఉంటాడన్న సమాచారం ఇప్పటికే బయటకు వచ్చింది. సినిమాలోని కథ, కాన్సెప్ట్ గురించి దర్శకుడు వశిష్ట ఇటీవల క్లారిటీ ఇచ్చారు. పంచభూతాలతో ఐదు లోకాల కాన్సెప్ట్‌తో సినిమా నడవనుందని, వీఎఫ్‌ఎక్స్ పరంగా టాలీవుడ్‌లోనే కాకుండా ఇండియన్ సినిమాల్లోనూ కొత్త ట్రెండ్ సెట్ చేయబోతుందని వెల్లడించారు. ఈ సినిమాలో, ఉడుత, రెక్కల గుర్రం వంటి క్యారెక్టర్స్‌కు కూడా స్పెషల్ ఇంపోర్టెన్స్ ఉందని టాక్.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ పనులు తుదిదశలో ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా మళ్లీ స్టార్ట్ చేశారు. అక్టోబర్‌లో ట్రైలర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన పోస్టర్లతో విశ్వంభర మూవీ క్రేజ్‌ను పెంచుతూ పోతున్నారు. తాజాగా విడుదలైన ఆశికా రంగనాథ్ పోస్టర్ మూవీపై అంచనాలను మరింతగా పెంచింది. సినిమా రిలీజ్‌కు ఇంకా కొంత టైం ఉన్నప్పటికీ, ఇలాంటి ప్రోమోషనల్ అప్‌డేట్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తాయని చెప్పవచ్చు.
