చీరకట్టులో కూడా గ్లామర్ కి సరికొత్త నిర్వచనం.. ఆషికా లేటెస్ట్ లుక్!
అలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే ఇటు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఎప్పటికప్పుడు చేరువ అవుతోంది.
By: Madhu Reddy | 22 Jun 2026 10:34 AM ISTసినిమా తెరపై అందాలు ఆరబోయడంలో తన తర్వాతే ఎవరైనా అనే రేంజ్ లో గ్లామర్ వలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 1996 ఆగస్టు 5 కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలోని తుమకూరులో జన్మించింది. అక్కడే బిషప్ సార్గెంట్ స్కూల్లో స్కూల్ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన ఈమె.. ఆ తర్వాత జ్యోతి నివాస్ కాలేజీలో ప్రీ ఇన్ కోసం బెంగళూరుకి వెళ్ళింది. ఫ్రీ స్టైల్ , బెల్లీ, వెస్ట్రన్ తో సహా వివిధ నృత్య రూపాలలో శిక్షణ కూడా అందుకున్న ఈమె.. క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగళూరు పోటీ కోసం ఆడిషన్ కూడా చేయబడింది. అంతేకాదు 2014లో మిస్ ఫ్రెష్ ఫేస్ పోటీలలో రన్నరప్ గా నిలిచి అందరిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ పోటీలలో రన్నరప్ గా నిలిచిన తరువాతే దర్శకుడు మహేష్ బాబు ఈమెను గుర్తించి.. ఈమెకు సినిమాలలో అవకాశాన్ని కల్పించారు. అలా 2016 లో వచ్చిన క్రేజీ బాయ్ అనే చిత్రం ద్వారా కన్నడ సినీ పరిశ్రమకు పరిచయం అయింది. 2016 నుండి సుమారుగా 2022 వరకు కన్నడలోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఆషిక తొలిసారి పట్టతు అరసన్ అనే తమిళ చిత్రం ద్వారా తన నటన జీవితాన్ని విస్తరించుకుంది.
తెలుగులో 2023లో కళ్యాణ్ రామ్ హీరోగా, రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో వచ్చిన అమిగోస్ అనే చిత్రం ద్వారా తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఈ సినిమా తర్వాత నాగార్జున, అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ కలయికలో వచ్చిన నా సామిరంగా అనే సినిమాలో వరమహాలక్ష్మి అలియాస్ వరాలు పాత్రతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.
ఈ రెండు తెలుగు చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఈ ఏడాది భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో గ్లామర్ డోస్ దట్టించి మరీ నటించింది. ఇక ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటుంది అనుకున్నారు. కానీ ఆశించినంత స్థాయిలో ఈ సినిమా ఈమెకు విజయాన్ని అందించలేదు. ఇక ప్రస్తుతం చిరంజీవి హీరోగా, వశిష్ట మల్లిడి దర్శకత్వంలో వస్తున్న విశ్వంభర సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది. అలాగే కార్తీ సర్దార్ 2లో కూడా భాగమైన విషయం తెలిసిందే. అలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే ఇటు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఎప్పటికప్పుడు చేరువ అవుతోంది.
ఇకపోతే తాజాగా ప్రజావాణి సినీ సమ్మన అవార్డ్స్ 2026 ఈవెంట్ కోసం స్పెషల్ గా రెడీ అయింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే గోల్డెన్ కలర్ హెవీ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన షోల్డర్ లెస్ బ్లౌజ్ ధరించి.. దీనికి కాంబినేషన్ లో మెరూన్ రెడ్ చీరపై గోల్డెన్ కలర్ జెర్రీ అంచుతో చక్కగా డిజైన్ చేయబడిన సిల్క్ శారీ ని కట్టుకొని తన అందాలతో మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా ఈ పట్టు చీరలో అమ్మడి అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఖుషి జగదీశ చేసిన ఈ స్టైలింగ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.. ఇక మెడలో చౌకర్, చెవులకు దిద్దులు పెట్టుకొని జుట్టును ముడివేసి మరింత అందంగా, హుందాగా ఫోటోలకు ఫోజులిచ్చింది. మొత్తానికైతే ఆషికా రంగనాథ్ తాజాగా పంచుకున్న ఈ అవార్డు వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
