కొండకోనల్లో ఆషికా రంగనాథ్ సాహసాలు
కన్నడ సౌందర్యరాశి ఆషికా రంగనాథ్ ప్రస్తుతం ప్రకృతి ఒడిలో సేదతీరుతోంది. సామాన్యంగా వెండితెరపై గ్లామరస్ పాత్రల్లో మెరిసే ఈ బ్యూటీ నటిగాను నిరూపించుకుంది.
By: Sivaji Kontham | 10 April 2026 9:56 AM ISTకన్నడ సౌందర్యరాశి ఆషికా రంగనాథ్ ప్రస్తుతం ప్రకృతి ఒడిలో సేదతీరుతోంది. సామాన్యంగా వెండితెరపై గ్లామరస్ పాత్రల్లో మెరిసే ఈ బ్యూటీ నటిగాను నిరూపించుకుంది. సోషల్ మీడియాల్లోను నిరంతరం స్పీడ్ గానే ఉంది ఆషిక. ఇప్పుడు మేఘాలయలోని ఎత్తైన కొండకోనలు.. దట్టమైన అడవుల మధ్య సాహసయాత్ర చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మేఘాలయ అంటేనే ప్రకృతి అందాలకు నెలవు. అటువంటి ప్రాంతంలో ఆషికా ఒంటరిగా ఇలా ప్రకృతిని ఆస్వాధిస్తూ తన పర్యటనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుంటే.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆషికా తన మేఘాలయ పర్యటనను ఒక `అడ్వెంచర్ డంప్`గా అభివర్ణించింది. అక్కడ తను ఎదుర్కొన్న అనుభవాలు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అత్యంత భయంకరమైన ట్రెక్కింగ్ మార్గాల్లో ప్రయాణించడం.. ప్రాచీన గుహలను అన్వేషించడం వంటి సాహసాలు చేస్తున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా అక్కడి ట్రెక్కింగ్ మార్గాలు చాలా భయానకంగా ఉన్నాయని.. కానీ ఆ భయం వెనుక ఒక తెలియని థ్రిల్ ఉందని ఆషికా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపింది.
భయంకరమైన దారుల్లో నడుస్తూనే.. దారి మధ్యలో దొరికే రోడ్డు పక్కన మోమోలను తింటూ... స్వచ్ఛమైన నీటి జలపాతాల వద్ద ఫుల్ గా చిల్ అవుతోంది. ``సర్రియల్ గ్రీనరీ, క్రిస్టల్ క్లియర్ వాటర్స్`` అంటూ అక్కడి ప్రకృతి అందాలను వర్ణించింది. బయటి ప్రపంచానికి తెలియకుండా దాగి ఉన్న అద్భుతమైన ప్రదేశాలను చూడటానికి కిలోమీటర్ల మేర నడక సాగించాల్సి వస్తోందని.. అయినా సరే ఆ అందాలు హొయల ముందు ఈ కష్టం చిన్నదని ఆషికా చెబుతోంది. నటిగా నిత్యం బిజీగా ఉండే ఈ బ్యూటీ ఇలా ప్రకృతి ఒడిలో సేదతీరడం చూసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఆషికా రంగనాథ్ కెరీర్ విషయానికి వస్తే.. కన్నడతో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. `నా సామిరంగ` చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాతా అగ్ర హీరోల సరసన నటించింది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. 2026-2027 కాలంలో ఆషిక నటించిన మరికొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటిలో మెగాస్టార్ చిరంజీవితో నటించిన `విశ్వంభర` కెరీర్ లో అత్యంత ముఖ్యమైనది. తదుపరి కార్తీతో `సర్ధార్ 2` కూడా విడుదల కానుంది. ముఖ్యంగా ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా మార్కెట్లో ఆషికకు మరింత గుర్తింపు తేనున్నాయి. దర్శకులు ఆమె గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం సాహసయాత్రలో ఉన్న ఆషికా.. షూటింగ్‌ల నుంచి చిన్న బ్రేక్ తీసుకుని తనను తాను రీఛార్జ్ చేసుకుంటోంది. మేఘాలయ పర్యటన ముగిసిన వెంటనే తన నెక్ట్స్ సినిమాల సెట్స్‌పైకి వెళ్లనుంది. ఒకవైపు భయానకమైన ట్రెక్కింగ్‌లు చేస్తూనే.. మరోవైపు ప్రకృతి అందాలను ఆస్వాధిస్తున్న ఈ నటి ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ``మరీ అంత భయపడుతూ కొండకోనల్లో ఈ నటికి ఏం పని?`` అని కొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నా.. కన్నడ కస్తూరి చూపిస్తున్న సాహసయాత్రలు స్ఫూర్తినిస్తున్నాయి.
