Begin typing your search above and press return to search.

థైస్ అందాలతో ఆకట్టుకుంటున్న ఆషికా రంగనాథ్!

టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగిస్తూ.. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా తమను తాము ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు

By:  Madhu Reddy   |   13 Sept 2025 12:47 PM IST
థైస్ అందాలతో ఆకట్టుకుంటున్న ఆషికా రంగనాథ్!
X

టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగిస్తూ.. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా తమను తాము ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే సందర్భం ఉన్నా.. లేకపోయినా ఏదో ఒకరకంగా అభిమానులలో అటెన్షన్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. పైగా ఈ మధ్య సినీ హీరోయిన్స్ ఎక్కువగా సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని కూడా పెంచుకుంటున్న విషయం తెలిసిందే. అటు సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు అంశాలను అభిమానులతో చర్చిస్తున్నారు. అంతేకాదు వెకేషన్స్ కి వెళ్లినా.. ఇటు ఫ్రెండ్స్ , ఫ్యామిలీతో ఎంజాయ్ చేసినా.. ఇలా ఏ చిన్న విషయమైనా సరే అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇకపోతే ఇప్పుడు ఒక హీరోయిన్ హ్యాపీ వీకెండ్ అంటూ థైస్ అందాలు చూపిస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆమె ఎవరో కాదు యంగ్ బ్యూటీ ఆషికా రంగనాథ్. తన నటనతో, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె.. సినిమాలలో చాలా పద్ధతిగా కనిపించి ప్రేక్షకులను అలరించే ఈమె.. ఇటు సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ వలకబోస్తూ అభిమానులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వైట్ కలర్ స్వెటర్ ను తలపించేలా టీ షర్ట్ ధరించి.. దానికి కాంబినేషన్లో బ్లాక్ స్కర్ట్ ధరించింది ఈ ముద్దుగుమ్మ.

ఇక్కడ ఒక గోడ దగ్గర స్టైలిష్ గా నిలబడి.. కూలింగ్ గ్లాస్ పెట్టుకొని మొబైల్ చూస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇందులో థైస్ అందాలను హైలెట్ చేస్తూ ఫోటోలు షేర్ చేయడంతో ఈమె అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. సింపుల్ లుక్.. హ్యాపీ వీకెండ్ అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

ఆషికా రంగనాథ్ కెరియర్ విషయానికి వస్తే..

ఆశికా రంగనాథ్ విషయానికొస్తే.. కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లాలోని తుమకూరులో 1996 ఆగస్టు 5న జన్మించింది. బిషప్ సార్గెంట్ స్కూల్లో చదువుకున్న ఈమె. ఆ తర్వాత జ్యోతి నివాస్ కాలేజీలో ప్రీ ఇన్ కోసం బెంగళూరుకి వెళ్ళింది ఇక తర్వాత ఫ్రీ స్టైల్, బెల్లీ, వెస్ట్రన్ తో సహా వివిధ రూపాలలో శిక్షణ కూడా పొందింది. క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగళూరు పోటీ కోసం ఆడిషన్ చేయబడగా 2014లో మిస్ ఫ్రెష్ ఫేస్ 2014లో రన్నరప్ గా నిలిచింది. ఈమె మాత్రమే కాదు ఈమె అక్క అనూషా రంగనాథ్ కూడా సినిమా నటిగా పేరు దక్కించుకుంది.

ఆషికా రంగనాథ్ సినిమాలు..

2016 లో వచ్చిన 'క్రేజీ బాయ్' అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది. 2022 వరకు కన్నడలోనే నటించిన ఈమెకు.. తమిళంలో తొలిసారి అవకాశం వచ్చింది. ఆ తర్వాత 2023లో తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'అమిగోస్' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత 'నా సామిరంగా' సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న 'విశ్వంభర' సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.