Begin typing your search above and press return to search.

గోవాలో గాళ్స్ గ్యాంగ్‌తో క‌లిసి ఆషిక అల్ల‌రే అల్ల‌రి!

కానీ అందుకు భిన్నంగా `టీ` మాత్ర‌మే సేవించి.. ఎప్ప‌టికీ మందు ముట్ట‌ని ఒక‌ గ్యాంగ్ (టీ టోట్ల‌ర్స్ అంటారు) గోవా బీచ్ లో చిలౌట్ చేసిన వైనం చ‌ర్చ‌గా మారింది. ఆస‌క్తిక‌రంగా ఈ గ్యాంగ్ లో ఆషిక రంగ‌నాథ్ కూడా ఉన్నారు.

By:  Sivaji Kontham   |   21 Sept 2026 10:00 PM IST
గోవాలో గాళ్స్ గ్యాంగ్‌తో క‌లిసి ఆషిక అల్ల‌రే అల్ల‌రి!
X

చాలా మంది గోవా బీచ్ యాత్ర‌లో న‌చ్చిన‌ట్టు ఎంజాయ్ చేస్తుంటారు. అక్క‌డ మందు- విందు చాలా కామ‌న్. కానీ అందుకు భిన్నంగా `టీ` మాత్ర‌మే సేవించి.. ఎప్ప‌టికీ మందు ముట్ట‌ని ఒక‌ గ్యాంగ్ (టీ టోట్ల‌ర్స్ అంటారు) గోవా బీచ్ లో చిలౌట్ చేసిన వైనం చ‌ర్చ‌గా మారింది. ఆస‌క్తిక‌రంగా ఈ గ్యాంగ్ లో ఆషిక రంగ‌నాథ్ కూడా ఉన్నారు.




గోవా ట్రిప్ జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన‌ ఆషిక రంగనాథ్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తన స్నేహితురాళ్లతో కలిసి గోవాలో సరదాగా గడిపిన క్షణాలను త‌న‌ అభిమానుల కోసం షేర్ చేసారు ఆషిక‌. అనుషా రంగనాథ్, తేజస్విని శర్మ, కాజల్ కుందర్, శర్వరి బెల్లప్ప, సోనాలీ కరియప్పలతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఈ ట్రిప్ తమకు ఎంతో మధురానుభూతిని మిగిల్చిందని తెలిపారు.




ఈ ట్రిప్‌లో తామందరం కలిసి చేసిన అల్లరిని.. ఆహార ప్రియులుగా తాము తిరిగిన ప్ర‌దేశాల‌ను ఆషిక‌ ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా తమ గ్రూప్ అంతా పూర్తిగా టీ-టోటలర్స్ (మద్యం సేవించని వారు) ..అంటే ఎలాంటి మందు లేకుండానే అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో రెండింతల ఆనందంతో ఎంజాయ్ చేయవచ్చని నిరూపించామని ఆషిక సరదాగా పేర్కొన్నారు. గోవా అంటే కేవలం పార్టీలే కాకుండా.. మంచి ఆహారం.. ప్రకృతి అందాలు.. స్నేహితులతో గడిపే ప్రశాంతమైన సమయం ఎంత సంతోషాన్ని ఇస్తాయో ఈ ట్రిప్ ద్వారా తెలుసుకున్నట్లు చెప్పారు.




ఈ ట్రిప్‌లో అనుషా రంగనాథ్ తన చిన్న కెమెరాతో తీసిన ఫోటోలు ఈ ప్రయాణానికి మరింత ప్రత్యేకతను తెచ్చాయని.. ఆ కెమెరా తమ బృందంలో ఏడో మనిషిలా మారిపోయిందని ఆషిక కొనియాడారు. ఈ పోస్ట్‌కు తోటి నటి తేజస్విని శర్మ కూడా స్పందిస్తూ.. ఆరుగురు స్నేహితురాళ్లు కలిసి గోవాను ఏవిధంగా హోరెత్తించారో.. తమ మధ్య ఉన్న బంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.




ప్రస్తుతం ఆషిక రంగనాథ్ షేర్ చేసిన‌ ఈ క్యూట్ ఫోటోలు, గోవా విశేషాలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు ఈ పోస్ట్‌పై రకరకాల కామెంట్లతో తమ ప్రేమను కురిపిస్తున్నారు. అమ్మాయిల ఈ ప్యూర్ ఫ్రెండ్షిప్ గోవా ట్రిప్ గోల్స్‌ను సెట్ చేస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.




2026 సంవత్సరంలో నటి ఆషికా రంగనాథ్ తన వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన రవితేజ `భర్త మహాశయులకు విజ్ఞప్తి` చిత్రంలో ఆషిక‌ కీలక పాత్రలో నటించి మెప్పించారు. అలాగే కార్తీ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ `సర్దార్ 2` చిత్రంలోనూ నటించారు. ఇక త్వరలో విడుదల కానున్న సినిమాల విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ సోషియో-ఫాంటసీ చిత్రం `విశ్వంభర`లో ఆషికా రంగనాథ్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లతో ఈ బ్యూటీ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు.