Begin typing your search above and press return to search.

కాటుక కళ్ళతో మాయ చేస్తున్న ఆషికా రంగనాథ్..

ప్రముఖ హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఈమధ్య కాలంలో తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తోంది.

By:  Madhu Reddy   |   24 Dec 2025 11:12 AM IST
కాటుక కళ్ళతో మాయ చేస్తున్న ఆషికా రంగనాథ్..
X

ప్రముఖ హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఈమధ్య కాలంలో తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా మరో లేటెస్ట్ ఫోటోషూట్ తో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా బ్లూ కలర్ లెహంగాలో దర్శనమిచ్చిన ఈమె కాటుక కళ్ళతో కుర్రకారును మాయ చేసింది. సింపుల్ లుక్ తో కూడా తన అందంతో మెస్మరైజ్ చేసిన ఈమె.. మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.




ఆషికా రంగనాథ్ ప్రస్తుతం రవితేజతో కలిసి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో రవితేజకు ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా.. ఇందులో తన గ్లామర్ తో ఆడియన్స్ ను కట్టిపడేసింది. మునుపెన్నడూ లేని విధంగా చాలా గ్లామర్ గా కనిపిస్తూ అభిమానులను మాయ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలని అటు ఆషిక రంగనాథ్ కూడా ఈగర్ గా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతున్న ఈ సినిమా పై ఇప్పుడు అంచనాలు కూడా పెరిగిపోయాయి. అటు విడుదలకు దగ్గరవుతున్న నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో భాగంగా ఆషికా రంగనాథ్ ఇలా తన అందంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ఈ ముద్దుగుమ్మ.




తాజాగా ఈమె నటిస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా విషయాన్నికొస్తే రవితేజ, ఆషికా రంగనాథ్ తో పాటు డింపుల్ హయతి కూడా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. కిషోర్ కే తిరుమల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని.. ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ఈమె అమిగోస్ అనే చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నా సామిరంగా అనే సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయింది.




2016లో కన్నడ చిత్రం క్రేజీ బాయ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె రాంబో 2, మదగజ, రేయ్మో వంటి చిత్రాలతో కన్నడ సినిమాలో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. గ్లామర్ తో పాటు నటనతో కూడా మెప్పించింది. ముఖ్యంగా తన అందంతో మార్కెట్ పెంచుకున్న ఈమె తెలుగులోనే కాదు అటు తమిళంలో కూడా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఈమె సోదరి కూడా నటి కావడం గమనార్హం.. అలా ఒకవైపు నటిగా ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈమె.. ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.